దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడు!

author img

By

Published : Nov 16, 2021, 5:20 AM IST

Updated : Nov 16, 2021, 7:23 AM IST

delhi hc

దిల్లీ హైకోర్టు(Delhi High Court) న్యాయమూర్తిగా.. సీనియర్​ న్యాయవాది సౌరబ్ కిర్​పాలన్ పేరును సిఫార్సు చేసింది జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం. ఇప్పుడు ఈ సిఫార్సులను ఆమోదించి కేంద్రం నియామక ఉత్తర్వులిస్తే మన దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తి సౌరబ్ కిర్​పాల్​ అవుతారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయమూర్తుల నియామక సిఫార్సులో మరో రికార్డుకు మూలకారణమైంది. బహిరంగంగా స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న సీనియర్‌ న్యాయవాది సౌరబ్‌ కిర్‌పాల్‌ను దిల్లీ హైకోర్టు(Delhi High Court) న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది. హైకోర్టు కొలీజియం తొలిసారి 2017 అక్టోబరు 13న ఆయన పేరును సిఫార్సు చేసింది. 2018 సెప్టెంబరు 4న సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంది. మరో మూడు విడతల్లో 2019 జనవరి 16, అదే ఏడాది ఏప్రిల్‌1, ఈ ఏడాది మార్చి2న పరిగణనలోకి తీసుకుంటూ, వాయిదా వేస్తూ వచ్చింది.

saurabh kirpal advocate
సౌరబ్

అయితే కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. ఆయన స్వలింగ సంపర్కుడని ప్రస్తావించకుండా ఆయన జీవిత భాగస్వామి విదేశీయులని.. ఆ భాగస్వామి స్విస్‌ రాయబార కార్యాలయంలో పని చేస్తున్నందున దేశ భద్రతకు ముప్పు అని నివేదించడంతో అప్పట్లో కొలీజియం పేరును సిఫారసు చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యూయూలలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని కొలీజియం.. ఆయన్ను(saurabh kirpal advocate) దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ఆయన లైంగిక అలవాట్లను దృష్టిలో పెట్టుకునే కొలీజియం అప్పట్లో వాయిదావేస్తూ వచ్చిందన్న భావన న్యాయవాద వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఈ సిఫార్సులను ఆమోదించి కేంద్రం నియామక ఉత్తర్వులిస్తే మన దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తి ఆయన అవుతారు.

ఇదీ చదవండి:

స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై ఆ రోజే క్లారిటీ!

Last Updated :Nov 16, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.