ETV Bharat / sports

'రోహిత్​తో జట్టులో ప్రశాంతత.. ద్రవిడ్​ ఆ పని చేస్తాడు'

author img

By

Published : Nov 16, 2021, 5:28 AM IST

dravid
ద్రవిడ్

న్యూజిలాండ్​ పర్యటన నుంచి టీమ్​ఇండియాలో కొత్త శకం ప్రారంభంకానుంది. భారత జట్టులో నూతన నాయకత్వ బృందం ఏర్పాటుకానుంది. ప్రధాన కోచ్​గా ద్రవిడ్, కెప్టెన్​గా రోహిత్, వైస్​ కెప్టెన్​గా రాహుల్​ బాధ్యతలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనే సంస్కృతిని​ ద్రవిడ్​టీమ్​ఇండియాలో నెలకొల్పుతాడని అన్నాడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul News) .

టీమ్​ఇండియా టీ20 సారథి రోహిత్ శర్మ, హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్​తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు (KL Rahul News) వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ కొత్త నాయకత్వ బృందం.. మంచి జట్టు సంస్కృతిని నెలకొల్పుతుందని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్​తో సిరీస్​తో భారత క్రికెట్​లో కొత్త శకం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ (KL Rahul Dravid), రోహిత్​ గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు రాహుల్.

"రాహుల్ ద్రవిడ్​.. చాలాకాలంగా తెలియడం నా అదృష్టం. ఆయన ఆడే విధానం చూసి.. ఆటను మరింతగా అర్థం చేసుకున్నాను. ద్రవిడ్​ది ఎంత పెద్ద పేరో.. దేశం కోసం అతడు ఏం చేశాడో అందరికీ తెలుసు. కోచ్​గా.. జట్టులో మంచి సంస్కృతిని నెలకొల్పుతాడు. వ్యక్తులను ఉన్నతంగా, క్రికెటర్లను గొప్పగా తీర్చిదిద్దుతాడు. ఆయన జట్టు కోసమే ఆడాడు. ఇప్పుడూ జట్టులో అదే సంస్కృతిని తెస్తాడు."

- కేఎల్ రాహుల్, వైస్​ కెప్టెన్

కొత్త కెప్టెన్ రోహిత్​ శర్మ.. వ్యూహాత్మక మేధావి అని (KL Rahul Rohit Sharma) అన్నాడు రాహుల్. "రోహిత్​ గురించి.. ఐపీఎల్​, రికార్డులే మాట్లాడుతాయి. ఆట గురించి గొప్ప అవగాహన, నేర్పు అతడి సొంతం. డ్రెస్సింగ్​రూమ్​లోకి చాలా ప్రశాంతతను తీసుకొస్తాడు." అని రాహుల్ చెప్పాడు.

kl rahul dravid
టీమ్​ఇండియా

'ద్రవిడ్, రోహిత్ కాంబోలో ప్రపంచకప్​'

టీ20 ప్రపంచకప్​(t20 2world cup 2021)లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు భారత్. కెప్టెన్​గా కోహ్లీ, కోచ్​గా రవిశాస్త్రి కాంబినేషన్​లో ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gautam gambhir on virat captaincy).. రోహిత్ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్​గా భారత్ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"కెప్టెన్​గా రోహిత్(gambhir on rohit sharma), కోచ్​గా ద్రవిడ్ ఈ ఫార్మాట్​లో జట్టును మరింత ముందుకు తీసుకువెళతారని అనుకుంటున్నా. అలాగే ప్రపంచకప్​ టైటిల్​ కూడా వీరు సాధిస్తారని నమ్ముతున్నానని" వెల్లడించాడు గంభీర్.

ఈ ప్రపంచకప్​(t20 2world cup 2021)లో భాగంగా సోమవారం (నవంబర్ 8) నమీబియాతో జరిగే మ్యాచ్​ ఇటు కోచ్​గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్​గా కోహ్లీకి చివరిది. దీంతో ఈ మ్యాచ్​లో ఘన విజయం సాధించి వీరిద్దరికి గొప్ప వీడ్కోలు పలకాలని యాజమాన్యం భావిస్తోంది.

ఇవీ చూడండి:

ఐసీసీ జట్టులో టీమ్​ఇండియా క్రికెటర్లకు దక్కని చోటు

టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రికి కొత్త బాధ్యతలు!

Ind vs Nz: 'విహారిని ఎంపిక చేయకపోవడానికి కారణం అదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.