ETV Bharat / bharat

యుద్ధ విమానంలో యూపీకి మోదీ.. రహదారిపై ల్యాండింగ్

author img

By

Published : Nov 16, 2021, 1:30 PM IST

Updated : Nov 16, 2021, 2:55 PM IST

యూపీలో పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​వేను ప్రారంభించారు ప్రధాని మోదీ. అంతకుముందు.. యుద్ధ విమానంలో అక్కడికి వెళ్లిన ఆయన.. రహదారిపైనే ల్యాండ్​ అయ్యారు.

pm modi inaugurates poorvanchal express way in up
పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​వేను ప్రారంభించిన మోదీ

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi news). అంతకుముందు సీ-130జే యుద్ధ విమానంలో రహదారిపైనే ల్యాండ్ అయ్యి.. వినూత్నంగా కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి సాదర స్వాగతం పలికారు(Modi news latest).

యుద్ధ విమానంలో యూపీకి మోదీ.. రహదారిపై ల్యాండింగ్

లఖ్​నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఆరు లేన్ల ఈ ఎక్స్​ప్రెస్ వే(Purvanchal Expressway route).. బారాబంకి, అమేఠీ, సుల్తాన్​పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను (Purvanchal Expressway route map 2021) కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్​పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్​స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్​స్ట్రిప్​పైనే మోదీ యుద్ధ విమానంలో దిగారు.

వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు. భవిష్యత్​లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు. రూ.22,500 కోట్ల వ్యయంతో రహదారిని పూర్తి చేశారు.

ఇదీ చదవండి: బలమైన ఆడిట్లతోనే పారదర్శక వ్యవస్థ: మోదీ

Last Updated :Nov 16, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.