ETV Bharat / city

Minister Niranjan reddy: భాజపా నేతలపై దాడితో తెరాసకు సంబంధం లేదు

author img

By

Published : Nov 16, 2021, 6:58 PM IST

రైతులను రెచ్చగొట్టి రోడ్డెక్కేలా చేసి భాజపా నేతలు భంగపడ్డారని.. రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ రైతులకు సమస్యగా మారారని మండిపడ్డారు.

minister niranjanreddy
minister niranjanreddy

భాజపా నేతలపై దాడితో తెరాసకు సంబంధం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్నదాతలను రెచ్చగొట్టి రోడ్డెక్కేలా చేసి (minister niranjan reddy responds on bandi sanjay tour in Nalgonda) భంగపడ్డారని మంత్రి ఎద్దేవా చేశారు. పంటల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు సహకరిస్తున్నామన్న నిరంజన్‌రెడ్డి.. సాగు చట్టాలను రద్దు చేసేందుకు భాజపా నేతలు కృషిచేయాలని సూచించారు. కేంద్రం నిర్ణయాలను పునఃసమీక్ష చేసేందుకు పాటుపడాలని మంత్రి హితవు పలికారు. ఎవరు దాడులు చేశారో చట్టపరంగా తేలుతుందన్నారు.

రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ రైతులకు (minister Niranjan reddy fires on TRS) సమస్యగా మారారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. భాజపా నేతలకు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన అవసరమేంటని మంత్రి ప్రశ్నించారు. గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలంటే దాని గురించి కేంద్ర మంత్రి, భాజపా నేతలు మాట్లాడడం లేదని నిరంజన్​రెడ్డి ఆక్షేపించారు. యూపీ, పంజాబ్‌లో రైతులు ఆందోళన చేస్తుంటే.. ప్రధాని మోదీ స్పందించారని.. కానీ ఇక్కడ మాత్రం రైతుల పేరిట భాజపా నేతలు ఆందోళన చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారని (minister niranjan reddy responds on bandi sanjay tour in Nalgonda) ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సాయపడుతోంది. రాష్ట్రంలో పంటలు పండించడంలో భాజపా పాత్ర ఏంటి..? రాజకీయ ప్రేరేపిత చర్యలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చేలా చేసింది భాజపా, కేంద్ర ప్రభుత్వమే. భాజపా నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. రైతులకు నీళ్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పంటలు పండిస్తోంది. వ్యవసాయానికి విద్యుత్‌, నీళ్లకు సంబంధించి భాజపా పాత్ర ఏంటి?. ఏడాదిగా ఉత్తర భారతదేశంలో రైతుల ఆందోళనలు. భాజపా చర్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఆత్మవిశ్వాసం చెదరగొట్టేలా, కుంగిపోయేలా చేస్తున్నారు.

- నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

Minister Niranjan reddy: భాజపా నేతలపై దాడితో తెరాసకు సంబంధం లేదు

పంజాబ్‌లో ఎన్నికలు ఉన్నందునే..

బండి సంజయ్‌ పర్యటనలో రైతులపై భాజపా నాయకులు దాడి చేశారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆరోపించారు. భాజపా నేతల తీరు దొంగే.. దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. పంజాబ్‌లో ఎన్నికలు ఉన్నందున అక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.