ETV Bharat / sports

నేటి నుంచే ఇండోనేసియా మాస్టర్స్​.. టైటిల్​పై సింధు గురి

author img

By

Published : Nov 16, 2021, 6:58 AM IST

pvsindhu
పీవీ సింధు

ఇండోనేసియా మాస్టర్స్​ సూపర్​ 750 నేటి(నవంబరు 16) నుంచి ప్రారంభంకానున్నాయి(indonesia masters 2021). ఇటీవలే జరిగిన డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్​ నెగ్గలేకపోయిన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు ఈ టోర్నీలోనైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.

భారత స్టార్‌ షట్లర్‌ పీవీసింధు(pv sindhu next tournament) ఇండోనేసియా మాస్టర్స్‌ సూపర్‌ 750 టైటిల్‌పై గురిపెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం తర్వాత టైటిల్‌ నెగ్గలేకపోయిన సింధు ఇండోనేసియా టోర్నీలో విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది(indonesia masters 2021). ఇటీవల డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సింధు సెమీస్‌ చేరుకుంది. 2019లో స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సింధుకు అదే చివరి టైటిల్‌. ఈ ఏడాది ఆరంభంలో స్విస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరినా.. టైటిల్‌ నెగ్గలేకపోయింది. దీంతో ఇండోనేసియా టైటిల్‌తో మళ్లీ గెలపు బాట పట్టాలని సింధు భావిస్తోంది9indonesia masters badminton 2021). మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సుపనిద (థాయ్‌లాండ్‌)తో మూడో సీడ్‌ సింధు తలపడుతుంది. ప్రిక్వార్టర్స్‌తో ఫిత్రియాని (ఇండోనేసియా), క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ మిచెల్‌ లీ (కెనడా).. సింధుకు ఎదురవ్వొచ్చు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీస్‌లో టాప్‌ సీడ్‌ అకానె యమగూచి (జపాన్‌)తో సింధుకు పోటీ తప్పకపోవచ్చు.

మరో స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌(saina nehwal next tournament), యువ ఆటగాడు సమీర్‌వర్మ గాయం కారణంగా టోర్నీకి దూరంగా ఉన్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)తో శ్రీకాంత్‌, షెసర్‌ హిరెన్‌ (ఇండోనేసియా)తో సాయి ప్రణీత్‌, హన్స్‌ క్రిస్టియన్‌ (డెన్మార్క్‌)తో పారుపల్లి కశ్యప్‌, డారెన్‌ ల్యూ (మలేసియా)తో ప్రణయ్‌, సునెయామా (జపాన్‌)తో లక్ష్యసేన్‌ తలపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో ఆంగ్‌ సిన్‌- తియో యి (మలేసియా)తో ఆరో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి, తకురొ- కొబయాషి (జపాన్‌)తో అర్జున్‌- ధ్రువ్‌; మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో అలెగ్జాండ్ర- పౌల్సెన్‌ (డెన్మార్క్‌)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప; మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో చాంగ్‌ చింగ్‌- వింగ్‌ యంగ్‌ (హాంకాంగ్‌)తో వెంకట ప్రసాద్‌- జుహి, హఫీజ్‌ ఫైజల్‌- గ్లోరియా (ఇండోనేసియా)తో సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప, ప్రవీణ్‌ జోర్డాన్‌- మెలాతి (ఇండోనేసియా)తో ధ్రువ్‌- సిక్కిరెడ్డి పోటీపడతారు.

ఇదీ చూడండి: స్కీయింగ్​లోనే కాదు.. సోయగాల్లోనూ ఈమె ఛాంపియన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.