ETV Bharat / bharat

5 వేల మందికి పురుడు పోసిన నర్స్​.. తన వరకు వచ్చే సరికి... పాపం...

author img

By

Published : Nov 16, 2021, 3:51 PM IST

సుమారు 5 వేలమందికి పురుడు పోసిన ఓ నర్స్​... తన రెండో కాన్పులో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయారు. డెలివరీ ముందు రోజు వరకు ఆమె విధులు నిర్వహించినట్లు స్థానిక వైద్యాధికారులు తెలిపారు.

Nurse
నర్స్​

మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జ్యోతి గావ్లీ అనే నర్స్​ సుమారు 5 వేల మందికి పురుడు పోశారు. అయితే తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఆమె మంగళవారం చనిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నెల నవంబర్​ 2వ తేదీన హింగోలీలో ప్రజావైద్యశాలలో ఆమెకు రెండో కాన్పు చేశారు అక్కడి వైద్యులు. ఈ క్రమంలోనే గావ్లీకి బైలాటరల్​ నిమోనియాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో నాందేడ్​లో చికిత్స తీసుకుంటూ.. చనిపోయారు.

" గావ్లీకి ఈ నెల 2వ తేదీన ప్రసవం జరిగింది. ఆ సమయంలో వచ్చిన కొన్ని సమస్యలు వచ్చాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను నాందేడ్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించాం. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. "

- వైద్యాధికారులు

డెలివరీ రోజు ముందు వరకు ఆమె హింగోలీలోని ప్రజావైద్యశాలలో విధులు నిర్వహించినట్లు ఆసుపత్రి రెసిడెంట్​ మెడికల్​ ఆఫీసర్​ డా. గోపాల్ కదమ్​ చెప్పారు. డెలివరీ పూర్తి అయిన తరువాత ఆమె ప్రసూతి సెలవులు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఆమె రెండేళ్లుగా ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని అన్నారు. అంతకుముందు మూడేళ్ల పాటు మరో రెండు ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 5 వేల మంది డెలివరీలో నర్స్ సాయం చేశారని అన్నారు.

ఇదీ చూడండి: టీకా వేసేందుకు వెళ్లిన ఆరోగ్య సిబ్బందిని చూసి గ్రామస్థులు పరార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.