ETV Bharat / state

Siddipet New Collector: సిద్దిపేట కలెక్టర్‌గా సంగారెడ్డి జిల్లా పాలనాధికారికి బాధ్యతలు

author img

By

Published : Nov 16, 2021, 10:05 AM IST

Updated : Nov 16, 2021, 1:21 PM IST

సిద్దిపేటకు నూతన కలెక్టర్
సిద్దిపేటకు నూతన కలెక్టర్

10:02 November 16

సిద్దిపేట కలెక్టర్‌గా హనుమంతరావు

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్​గా... హనుమంతరావు(Siddipet district new collector Hanumanth Rao)కు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పాలనాధికారిగా(Sangareddy district collector) ఉన్న హనుమంతరావుకు.. అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంతకుముందున్న కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి(siddipet district former collector Venkat ram reddy resigned) ఈనెల 15న రాజీనామా చేశారు. బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు (CS SOMESH KUMAR) రాజీనామా లేఖ అందించారు.  తెరాస పార్టీలో చేరి... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హన్మంతరావు గతంలో సిద్దిపేట ఆర్డీవోగా, గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారిగా, సిద్దిపేట జిల్లా సంయుక్త కలెక్టర్‌గా సేవలు అందించారు. రేపు సిద్దిపేట కలెక్టర్‌గా హన్మంతరావు బాధ్యతలు స్వీకరించనున్నారు..

ఇటీవల కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఎవరైనా విత్తనాలు అమ్మితే.. ఆ పరిధిలోని అధికారులను విధుల్లో నుంచి తొలగిస్తానని కలెక్టర్ వెంకటరామిరెడ్డి(siddipet collector Venkata rami reddy) హెచ్చరించారు. దీనిపై విపక్షాలు పలు విమర్శలు చేశారు.  అంతకు ముందు మరో వివాదంలో కూడా కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి ఇరుక్కున్నారు. సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటరామరెడ్డి సీఎం కేసీఆర్‌ పాదాలకు నమస్కారం చేయడం చర్చనీయాంశమైంది. కలెక్టర్​ అయి ముఖ్యమంత్రి కాళ్లపై పడటంపై విపక్షాలు, ప్రజలు మండిపడ్డారు. 

Last Updated :Nov 16, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.