Local body MLC Voter list: స్థానికసంస్థల కోటా మండలి ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన

author img

By

Published : Nov 16, 2021, 7:52 PM IST

Updated : Nov 16, 2021, 8:13 PM IST

Local body MLC Voter list

స్థానికసంస్థల కోటా శాసనమండలి ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు (Local body MLC Voter list). ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీలతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించారు.

స్థానికసంస్థల కోటా శాసనమండలి ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు (Local body MLC Voter list). మొత్తం 9,808 మంది ఓటర్లున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే మహబూబ్​నగర్​లో అత్యధికంగా 1,445 మంది ఓటర్లున్నారు. కరీంనగర్​లో 1,326 మంది, నల్గొండలో 1,271, రంగారెడ్డిలో 1,179, వరంగల్​లో 1,035, మెదక్​లో 1,027 మంది ఓటర్లున్నారు. ఆదిలాబాద్​లో 937 మంది, నిజామాబాద్​లో 820 మంది, ఖమ్మం జిల్లాలో 768 మంది ఓటర్లున్నారు.

మార్పులు, చేర్పులకు అవకాశం

ముసాయిదాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా, మార్పులు, చేర్పులు కోరినా 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు (Local body MLC Voter list). వాటన్నింటిని పరిష్కరించి 23న ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తారు. ఆ జాబితాల ఆధారంగానే వచ్చే నెల పదో తేదీన స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (Local body MLC election polling date) జరగనుంది.

65 పోలింగ్​ కేంద్రాలు

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 65 పోలింగ్ కేంద్రాలు (Local body MLC election polling stations) ఏర్పాటు చేశారు. మహబూబ్​నగర్, వరంగల్ జిల్లాల్లో పది చొప్పున పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమిది చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్​లో ఆరు, ఖమ్మంలో నాలుగు, మెదక్​లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ( Local Bodies Quota MLC Elections) నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా... ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం ఉంది. మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది.

స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి...

హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు చొప్పున స్థానాలున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ఈ స్థానాల నుంచి జనవరి నాలుగో తేదీలోగా కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది.

ఇదీ చూడండి: MLC Elections: తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు

Last Updated :Nov 16, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.