ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

author img

By

Published : Sep 16, 2021, 5:55 AM IST

Updated : Sep 16, 2021, 9:52 PM IST

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

21:43 September 16

టాప్​ న్యూస్​ @10 PM

  • డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ కౌంటరు దాఖలు

     డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. ఆ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటరు అఫిడవిట్​ను దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మధ్యంతర దరఖాస్తు కొట్టివేయాలని  ఎక్సైజ్‌శాఖ హైకోర్టును కోరింది.  

  • మరో ముందడుగు..

బ్యాంకింగ్ రంగంలో ఎన్​పీఏల సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదించిన బ్యాడ్​ బ్యాంక్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

  • దుల్కర్​ సల్మాన్​కు అరుదైన గౌరవం

మలయాళ నటుడు దుల్కర్​ సల్మాన్​కు ప్రతిష్ఠాత్మక దుబాయ్ గోల్డెన్ వీసా (dulquer salman movies) మంజూరైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

  • అత్యుత్తమ కెప్టెన్ ఎవరో తెలుసా?

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగబోతున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్​లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరో చూద్దాం.

20:51 September 16

టాప్​ న్యూస్​ @9PM

  • మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. గౌడ కులస్థులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రివర్గం తెలిపింది. సీఎం హామీ మేరకు గౌడ కులస్థులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వనుండగా.. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయించింది. 

  • సైదాబాద్‌ నిందితుడి అంత్యక్రియలు పూర్తి

    సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్‌ పోతననగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైదాబాద్​లో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. ఘటన జరిగిన నుంచి పరారీలో ఉన్న రాజు.. ఇవాళ ఉదయం స్టేషన్ ఘన్​పూర్​ రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. 

  • ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష

ప్రస్తుతం రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల పాశవిక ఘటనలు వెలుగుచూస్తున్న ఈ క్రమంలో.. నాలుగేళ్ల కింద జరిగిన ఓ విభిన్నమైన ఘటనలో కోర్టు తీర్పు వెలువరించింది. సైదాబాద్​లో ఆరేళ్ల చిన్నారిని అత్యంత కర్కశంగా హత్యాచారం చేసిన కామాంధున్ని ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్ తీవ్రంగా వెల్లువెత్తిన తరుణంలో.. నిందితుని ఆత్మహత్యతో ప్రజాగ్రహం చల్లారింది. అదే తరుణంలో... అందుకు భిన్నంగా.. ఓ బాలునికి జరిగిన మరో ఘటనలో ఎట్టకేలకు తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • '3 నెలలు జాగ్రత్తగా ఉండండి'

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి(Covid in India) స్థిరంగా ఉందని కేంద్రం(Centre on Covid) వెల్లడించింది. రాబోయే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు(Centre Warns States) హెచ్చరించింది. ఈ మేరకు దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు.

  • కోహ్లీ నిర్ణయంపై గంగూలీ కామెంట్స్​ 

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(virat kohli steps down as indian captain). దీనిపై స్పందించారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఉపాధ్యక్షుడు జైషా.

19:48 September 16

టాప్​ న్యూస్​ @8 PM

  • అటవీ అధికారిపై పెట్రోల్ దాడి 

భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్త వాతావారణం చోటుచేసుకొంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ రేంజ్‌ అధికారిణి దివ్య, సిబ్బందిపై పోడు వ్యవసాయదారులు పెట్రోల్‌ పోశారు. 

  • పేలిన బైక్​ పెట్రోల్​​ ట్యాంక్​!

ఓ వ్యక్తి బైక్​పై ప్రయాణిస్తుండగా వాహనం పెట్రోల్​ ట్యాంక్ (Bike Blast)​ పేలింది. పంజాబ్​లో(Punjab Bike Blast) జరిగిన ఈ ఘటనలో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.

 

  • సీఎంపై ఫిర్యాదు..!

కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించారని బంగాల్​ ముఖ్యమంత్రిపై (Bhabanipur election) ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసింది భాజపా.

  • చైనా వెన్నులో వణుకు!

భారత్​ అగ్ని-వీ బాలిస్టిక్ క్షిపణి(Ballistic missile) ప్రయోగాన్ని త్వరలో చేపట్టనున్న నేపథ్యంలో.. చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాసియాలో శాంతి భద్రతల కోసం అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంది. మరోవైపు.. బ్రిటన్​, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసిన ఆకస్(ఏయూకేయూఎస్​) కూటమిని విమర్శించింది.

  • 'ముంబయిని అడ్టుకునే సత్తా ఆ జట్టుకే ఉంది'

ఐపీఎల్​(ipl 2021 schedule)లో ముంబయి ఇండియన్స్​(mumbai indians team)ను అడ్డుకోగల సత్తా ఒక్క జట్టుకు మాత్రమే ఉందని వెల్లడించాడు మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్. ఆ జట్టేంటో తెలుసా?

18:49 September 16

టాప్​ న్యూస్​ @7 PM

  • ఎన్జీటీ అధికారాలపై..

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు సుదీర్ఘ విచారణ జరిగింది. ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా అనే అంశంపై ఏపీ వాదనలు వినిపించింది. 

  • మరికొన్ని రోజులు వర్షాకాలం

దేశంలో నైరుతి రుతుపవనాల(Monsoon in India) తిరోగమనానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD weather forecast) పేర్కొంది. మరో 10 రోజుల వరకు రుతుపవనాల తిరోగమనంపై ఎలాంటి సూచనలు లేవని స్పష్టం చేసింది.

  • తేజ్​ను పరామర్శించిన అల్లు అర్జున్​

రోడ్డు ప్రమాదానికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగాహీరో సాయి ధరమ్​ తేజ్​ను(sai dharam tej accident) హీరో అల్లు అర్జున్​ పరామర్శించారు. అంతకుముందు మెగాఫ్యామిలీతో పాటు పలువురు నటులు కూడా హాస్పిటల్​కు వచ్చారు.

  • టీ20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై

అనుకున్నట్లే జరిగింది. టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్​ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టీ20 జట్టుకు రోహిత్‌ శర్మను సారథిగా నియమించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్​ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్​కు గురయ్యారు. 

  • ఎస్​బీఐ బంపర్​ ఆఫర్

దేశీయ అతిపెద్ద బ్యాంక్​ ఎస్​బీఐ పండుగ బొనాంజా (SBI Festive offers) ఆఫర్లు ప్రకటించింది. హోం లోన్స్​పై వడ్డీ (SBI loan) రేట్లను 45 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు తెలిపింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా వడ్డీ తగ్గింపు వర్తించనున్నట్లు పేర్కొంది.

17:43 September 16

టాప్​ న్యూస్​ @6PM

  • పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం

రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్​లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నడుం కట్టింది. ఈ మేరకు పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకొంది. ఈ ఉపసంఘానికి ఛైర్‌పర్సన్‌గా మంత్రి సత్యవతి రాఠోడ్​ వ్యవహరిస్తారు. సభ్యులుగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. 

  • 1993 పేలుళ్ల తరహాలో..!

 దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రముఠాను దర్యాప్తు చేస్తున్న కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల(Mumbai Bomb Blast) తరహా దాడులకు(Terrorist Attack) ముష్కరులు ప్లాన్‌ చేసినట్లు దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు చెప్పాయి.

  • ప్రమాదంలో వృక్షసంపద!

ప్రపంచంలోని మొత్తం వృక్షజాతుల్లో మూడింట(Tree Species) ఒక వంతు వృక్షజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఓ నివేదికలో తేలింది. ఇప్పటికే 142 జాతులు(Tree Species) అంతరించిపోయాయని తెలిపింది. వ్యవసాయం, కలప కోసం అడవులను నరికివేయడం వంటి చర్యలు.. ఈ ప్రమాదానికి కారణమని చెప్పింది.

  • బాలీవుడ్​ తారలను పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెటర్లు!

హీరో హీరోయిన్ల మధ్య కంటే.. క్రికెటర్స్, కథానాయికల మధ్యే ఎఫైర్స్ ఎక్కువగా సాగుతుంటాయి! ఇప్పటివరకు ఎందరో ముద్దుగుమ్మలు.. క్రికెటర్లతో ప్రేమలో మునిగితేలి వార్తల్లో నిలిచారు. కొన్ని ప్రేమలు పెళ్లికి దారితీయగా.. మరికొన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అందులో ఎవరెవరిని ప్రేమించారు? వారిలో పెళ్లిపీటలెక్కిన వారెందరు?

  • సినిమా అప్​డేట్స్​

మిమ్మల్ని పలకరించేందుకు సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పలాస' ఫేం రక్షిత్​, తనీశ్(maroprasthanam tanish)​, కన్నడ స్టార్​ పునిత్​ రాజ్​కుమార్ కొత్త చిత్రాల​ వివరాలు ఉన్నాయి.

16:53 September 16

టాప్​ న్యూస్​ @5 PM

  • 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 24 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 25తో గత శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి.

  • 'వచ్చే ఏడాది రిపబ్లిక్​ డే పరేడ్ అక్కడే​..' 

మరో రెండున్నర నెలల్లో సెంట్రల్​ విస్టా అవెన్యూ (central vista avenue) అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్​ సింగ్​ పురీ. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం పరేడ్ (Republic day​) నిర్వహించేందుకు అవెన్యూ సిద్ధంగా ఉంటుందన్నారు.

  • ఎన్​సీసీ నిపుణుల కమిటీలోకి ధోనీ

నేషనల్ కెడెట్ కార్ఫ్స్​(ఎన్​సీసీ)లో మార్పులు చేర్పులు చేపట్టే అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీమ్​ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు.

  • 'పానీపూరీ అమ్ముకునేవాడిని'

ఒకానొక దశలో క్రికెట్​ను పూర్తిగా వదిలేయాలని భావించినట్లు తెలిపాడు కోల్​కతా నైట్​ రైడర్స్​ బ్యాట్స్​మన్​ షెల్డన్​ జాక్సన్(sheldon jackson ipl 2021)​. ఆటలో తాను రాణించలేకపోయి ఉంటే పానీపూరీ అమ్ముకునేవాడినని చెప్పాడు.

  • ఒకాయా కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్

ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ సంస్థ ఒకాయా పవర్ గ్రూప్​.. ఫ్రీడమ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ను(Okaya Electric Scooter) విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ ధర చాలా తక్కువే అని చెబుతోంది.

15:43 September 16

టాప్​ న్యూస్​ @4 PM

  • రాజు ఆత్మహత్యపై ప్రముఖుల కామెంట్స్​ 

సైదాబాద్‌(saidabad incident) హత్యాచార ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యపై మెగాస్టార్​ చిరంజీవి, మంచు మనోజ్​ స్పందించారు. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయని అన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని చెప్పారు.

 

  • 'అఫ్గానిస్థాన్​లో భయంకర పరిస్థితులు'

అఫ్గానిస్థాన్​లో(Afghanistan news) భయంకర పరిస్థితులు ఉన్నాయని, మహిళలను(Afghanistan women) తాలిబన్లు కనీసం మనుషుల్లానైనా భావించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆ దేశానికి చెందిన పలువురు మహిళా జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు. దిల్లీలో భారతీయ మహిళా ప్రెస్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అఫ్గాన్​ పరిస్థితులను(Afghanistan women) వివరిస్తూ ఆవేదన చెందారు.

  • ఇన్​స్టా రీల్స్​ కోసం డాన్స్​.. షాకిచ్చిన పోలీసులు

ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ కోసం ఓ యువతి చేసిన డాన్స్​ వీడియో వైరల్​గా (girl dance viral video) మారింది. అయితే అదే వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో రసోమా స్క్వేర్​ వద్ద ట్రాఫిక్​ సిగ్నల్​ పడగానే జీబ్రా క్రాసింగ్ మీదకు చేరుకొని డాన్స్​ చేసింది(girl dance viral video) సదరు యువతి. దీనికి సామాజిక మాధ్యమాల్లో భారీగా స్పందన కూడా లభించింది.

  • 'కోహ్లీ ఫామ్​పై ఆందోళన అనవసరం'

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ ఫామ్​పై అనుమానాలు అక్కర్లేదని తెలిపాడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(kapil dev on virat kohli captaincy). అతడు ఫామ్​లోకి వస్తే ట్రిపుల్ సెంచరీ చేయగలడని తెలిపాడు.

  • సెకనుకు 4 ఓలా స్కూటర్ల అమ్మకం

ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ప్రారంభించిన మొదటిరోజే.. ఊహించని రీతిలో స్పందన లభించినట్లు ఓలా సంస్థ(Ola Electric Scooter) తెలిపింది. ప్రతి సెకనుకు 4 స్కూటర్ల చొప్పున అమ్మినట్లు చెప్పింది. మరోవైపు.. గురువారం అర్ధరాత్రి నుంచి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

14:41 September 16

టాప్​ న్యూస్​ @3 PM

  • కేబినెట్​లో కీలక అంశాలపై చర్చ

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ ప్రారంభమైంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్​లో చర్చిస్తున్నారు. 

  • మరో బాలికపై అత్యాచారం

సైదాబాద్‌లో రాజు కిరాతక చర్య మరువకముందే మరో దారుణం జరిగింది. జగిత్యాల జిల్లాలో బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారం జరిపాడు. 

  • 'రాజును పోలీసులే చంపేశారు' 

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై వారి కుటుంబ సభ్యులు స్పందించారు. రాజుది ఆత్మహత్య కాదు... పోలీసులే చంపేశారని ఆరోపిస్తున్నారు.

  • కాంగ్రెస్​లోకి కన్నయ్య!

యూపీ ఎన్నికలకు (UP Election 2022) ముందు జేఎన్​యూఎస్​యూ మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ నేత కన్నయ్య కుమార్(Kanhaiya kumar congress).. కాంగ్రెస్​లో చేరడం (Kanhaiya kumar congress) ఖాయంగా కనిపిస్తోంది. ఆయన చేరికతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

  • సోనూసూద్ నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు

బుధవారం, గురువారం.. సోనూసూద్​ నివాసాల్లో ఇంకా సోదాలు సాగుతున్నాయి. అయితే ఏం లభించింది అనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.

13:51 September 16

టాప్​ న్యూస్​ @2PM

  • ఆర్టీసీ ఛైర్మన్‌గా  బాజిరెడ్డి గోవర్దన్

ఆర్టీసీ ఛైర్మన్​గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ నియమితులయ్యారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్​ను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్

  • చిన్నారి ఆత్మకు శాంతి

సైదాబాద్​ ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడటంపై రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్(Minister Satyavathi rathod) స్పందించారు. పశ్చాత్తాపంతోనే రాజు బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు.

  • తెలంగాణది ఫస్ట్ ప్లేస్..

దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4వ స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ఐటీ రంగంలో వార్షిక వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న కేటీఆర్.. ప్రపంచంలో 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్(HYDERABAD) లోనే ఉన్నాయని వెల్లడించారు. హెచ్ఐసీసీలో ఐసీటీ(ICT) నూతన పాలసీ విధానాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.

  • మేమెందుకు పోటీచేస్తాం

గత ఏడేళ్లలో పన్నుల వాటా, అనేక పథకాల కింది రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.2లక్షల 52వేల కోట్లు చెల్లించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు... కేసీఆర్​తో సహా వెళ్లి వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సిద్ధమని ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న ఆయన... నాగిరెడ్డిపేట్​ మండలం బంజారాలో మీడియా సమావేశం నిర్వహించారు.

  • ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలను సమర్థించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చింది.

12:45 September 16

టాప్​ న్యూస్​ @1PM

  • స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో?

సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని వరంగల్ సీపీ తరుణ్‌ జోషి పరిశీలించారు. ఇవాళ ఉదయ 8 గంటల 45 నిమిషాలకు మృతదేహాన్ని రైల్వే కార్మికులు గుర్తించారని తెలిపారు.

  • కౌంటింగ్​కు గ్రీన్​సిగ్నల్​

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలను సమర్థించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చింది.

  • అబద్ధాల లెక్క ఎంతంటే?

పురుషులు అబద్ధాలు చెప్పడం సహజం! అమ్మాయిల విషయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. అవసరాన్ని బట్టి చెప్పేవి కొన్ని ఉంటే.. మరికొన్ని మెప్పు కోసం చెప్తారు. అయితే ఓ పురుషుడు సగటున రోజుకు ఎన్ని అబద్ధాలు చెప్తారు అనేది మీకు తెలుసా?

  • చైనాకు చెక్​ పెట్టేలా..!

ఇండో పసిఫిక్ ప్రాంతంలో(Indo Pacific) తమ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆకస్​(ఏయూకేయూఎస్​)(AUKUS Alliance) పేరుతో కొత్త త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. రక్షణ సంబంధాలను మరింత మెరుగుపరుచునేందుకు ఈ కూటమి(AUKUS Alliance) సహకరిస్తుందని మూడు దేశాలు పేర్కొన్నాయి.

  • సిరీస్​ వాయిదా!

కరోనా క్వారంటైన్​ నిబంధనలు, వరుస ద్వైపాక్షిక సిరీస్​ల కారణంగా టీమ్ఇండియా-న్యూజిలాండ్​ పర్యటన​(India's New Zealand Tour) వాయిదా పడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కివీస్​ క్రికెట్​ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

11:53 September 16

టాప్​ న్యూస్​ @12PM

  • మృగం చనిపోయింది: కేటీఆర్​

నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందని వెల్లడించారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పినట్లు తెలిపారు.

  • సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

  • చిన్నారి ఆత్మగోస రాజు మృతికి దారితీసింది

సైదాబాద్ ఘటన నిందితుడి ఆత్మహత్యపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్పందించారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నానని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మరిన్ని లైవ్ అప్​డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • రక్షణ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభం

దిల్లీలో నూతన రక్షణ కార్యాలయ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సహా పలువురు హాజరయ్యారు.

  • కొత్త కేబినెట్​- మంత్రి పదవులు వీరికే..!

గుజరాత్​లో కేబినెట్(Gujarat Cabinet)​ మంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్​భవన్​లో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 18 మందికి మంత్రివర్గంలో(Gujarat New Cabinet Minister List) చోటు కల్పించినట్లు తెలుస్తోంది.

11:01 September 16

టాప్​ న్యూస్​ @11AM

  • సైదాబాద్‌ ఘటన నిందితుడు ఆత్మహత్య

సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు.

  • మంగళ్‌హాట్‌లో మరో బాలికపై అత్యాచారం!

 హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక హత్యచార ఘటనను మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాంగారు బస్తీలో బాలికపై సుమిత్‌ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. 

  • హైదరాబాద్​లో యథేచ్ఛగా మాదకద్రవ్యాల విక్రయం..

రాజధాని మత్తుకు అడ్డాగా మారింది. ఎవరికి కావాలన్నా సులభంగా గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాలు దొరుకుతున్నాయి. ఈ క్రమంలోనే అనేకమంది విచక్షణ కోల్పోయి అత్యాచారం చేసి చిన్నారులను చంపేస్తున్నారు. అతి వేగంగా వాహనాలు నడిపి అనేకమంది చావులకు కారణమవుతున్నారు. సైదాబాద్‌ ఠాణా పరిధిలోని బస్తీలో ఒక చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కూడా గంజాయి తాగి మత్తులోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో తేలింది. పరిస్థితి ఇంతదారుణంగా ఉన్నా కూడా ఒక వైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

  • రైతులకు సులభం కాదు.. కానీ.

యాసంగి నుంచి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే సీజన్​లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు(Alternatives for Rice cultivation) సాగు చేయాలని చెబుతోంది. ఎన్నో ఏళ్లుగా వరి సాగు చేస్తున్న రైతులు.. వచ్చే రబీ సీజన్​కి ఇతర పంటలు పండించడం సాధ్యమేనా? ఒకవేళ పండించినా.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందా? రైతులకు భరోసానిస్తుందా? "వరితో సమస్యలు - ప్రత్యామ్నాయ పంటల"పై వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రవీణ్ రావు, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జీవీ రామాంజనేయులు వెల్లడించిన విషయాలు ఇవే...

  • సలహాలు ఇవ్వండి: మోదీ

ఈనెల 26న జరగనున్న 'మన్​ కీ బాత్'​ (PM Modi mann ki baat) కార్యక్రమంలో మాట్లాడాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ మేరకు 'మైగవ్​' లింక్​ను ట్వీట్​ చేశారు మోదీ.

09:45 September 16

టాప్​ న్యూస్​ @10AM

  • సాయం వద్దు.. శిక్షించండి చాలు

సైదాబాద్​ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను హోమ్ మంత్రి మహమూద్ మహమూద్​ అలీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పరామర్శించారు. మంత్రుల ఎదుట తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున రూ.20 లక్షల చెక్కు మంత్రులు అందించారు. బాధిత కుటుంబానికి రెండు పకడ గదుల ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల సాయాన్ని బాలిక కుటుంబసభ్యులు తిరస్కరించారు. రూ.20 లక్షల చెక్కు అవసరం లేదని తేల్చిచెప్పారు. మంత్రులు ఇచ్చిన చెక్కు వెనక్కి ఇచ్చేస్తామని వెల్లడించారు. 

  • కొత్తగా 30వేల మందికి వైరస్​

దేశంలో కరోనా కేసుల (Corona cases in India) సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 30,570 మంది కొవిడ్​​(Corona Update) బారినపడ్డారు. మరో 431 మంది వైరస్​తో(Covid-19)​ మరణించారు.

  • బెస్ట్.. భూదాన్ పోచంపల్లి!

ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోన్న బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్​లో భారత్​ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ సంపాదించాయి. అందులో ఒకటి తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి. బెస్ట్ టూరిజం విలేజ్​గా ఎంపికైతే భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఈ గ్రామంతో పాటు మేఘాలయ రాష్ట్రంలోని కాంగ్ థాన్, మధ్యప్రదేశ్​లోని చారిత్రాత్మక గ్రామం లాద్ పురా ఖాస్​ కూడా పోటీలో ఉన్నాయి.

  • ఆన్‌లైన్‌ వేధింపులు ఎక్కువే!

మహిళలపై ఆన్‌లైన్‌ వేధింపులకు సంబంధించిన కేసులు తెలంగాణలో ఆందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది.

  • కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55 వేల 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,20,810 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

08:43 September 16

టాప్​ న్యూస్​ @9AM

  • జాతీయోద్యమంలో నిర్మల్ పాత్రేంటి?

నిర్మల్‌ అనగానే కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి అని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. కానీ జాతీయోద్యమంలో యావత్‌భారతాన్ని కదిలించిన జలియన్‌వాలాబాగ్‌లాంటి దారుణ మారణ కాండకు ఇది వేదికనీ... సిపాయిల తిరుగుబాటు కాలంలోనే బ్రిటిష్‌-నిజాంలపై రాంజీగోండ్‌లాంటి గోండు యోధుడు పోరాడిన స్థానమని చాలామందికి తెలియదు. రాంజీ సహా వెయ్యిమందిని మర్రిచెట్టుకు ఉరితీసి, పోరాటాన్ని అణచివేశాయి బ్రిటిష్‌ - నిజాం సేనలు!

  • అయిదు లక్షల మంది ఎదురుచూపు

ఒకరి పేరున అదనంగా నమోదైన భూమిని తిరిగి అర్హుడైన రైతుకు అప్పగించి సమస్యను పరిష్కరించడం అధికారుల విధి. దీనికి బదులు ధరణి పోర్టల్‌ వేదికగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారానే భూ యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయంటూ అధికారులు సూచిస్తుండటం... సమస్య జటిలంగా మారిన తీరుకు అద్దం పడుతోంది.

  • ఎన్జీటీ ఆరా

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై ఎన్జీటీ దర్యాప్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీ ఎల్లూరు వచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

  • త్వరలో ఎయిరో స్పేస్ డిఫెన్స్ యూనివర్శిటీ

రక్షణ, ఎయిరో స్పేస్ రంగాలు మరింత విస్తరించేలా.. త్వరలో ఒక ఎయిరో స్పేస్, డిఫెన్స్ యూనివర్శిటీ, డిఫెన్స్ ఎయిరో స్పేస్ ఇంక్యుబేటర్, డ్రోన్ టెస్టింగ్ కారిడార్​లను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయాత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎయిర్​ క్రాఫ్ట్​ల విడిభాగాల తయారీ హైదరాబాద్​ నుంచి జరగటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

  • క్రేజ్ చూసి షాకైన రజనీకాంత్

హీరోయిన్​గా తెలుగు, తమిళ, మలయాళంలో అదరగొట్టిన మీనా పుట్టినరోజు గురువారం. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎదురైన ఆసక్తికర అనుభవాలు మీనా మాటల్లోనే..

07:42 September 16

టాప్​ న్యూస్​ @8AM

  • అధికారమే లక్ష్యంగా కమలనాథుల ముందడుగు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 17న భాజపా భారీ బహిరంగ సభకు (BJP public meeting) సన్నాహాలు చేస్తోంది. నిర్మల్‌ జిల్లా వెయ్యి ఊడలమర్రి వద్ద ఏర్పాటు చేసే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah )ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజు గజ్వేల్‌లో కాంగ్రెస్‌ దళిత, ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

  • జట్టుపై కసరత్తు.. 

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ కార్యవర్గాన్ని(Tpcc working committee).. పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే దిశలో ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రకటించిన ఏఐసీసీ.... పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తదితర పోస్టులు భర్తీ చేసే దిశలో ముందుకు సాగుతోంది. మరో వైపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ నియామకంపై మూడు పేర్లను సిఫారసు చేయాలని ఏఐసీసీ కోరగా... ఆ దిశలో కసరత్తు చేస్తోంది.

  • నల్లపులి రంగు రహస్యం

ప్రపంచంలోనే నలుపు రంగు పులులు (black tiger) కనిపించే ఒకే ఒక ప్రాంతం ఒడిశాలోని సిమిలాపాల్. వాటి రంగు వెనకాల రహస్యం కనుగొనడానికి ఏళ్లుగా పరిశోధనలు జరిగాయి. ఎట్టకేలకు ఆ రహస్యాన్ని ఛేదించారు బెంగళూరు శాస్త్రవేత్తలు.

  • ప్రైవేట్ రైడ్​ షురూ..

60 ఏళ్ల మానవ అంతరిక్ష యాత్రలో తొలిసారిగా అద్భుతఘట్టం ఆవిష్క్రుతమైంది. అంతరిక్షయానంలో ఎలాంటి అనుభవం లేని.. గతంలో ఎన్నడూ వ్యోమగాములు కాని నలుగురు వ్యక్తులు మూడురోజుల పాటు అంతరిక్షాన్ని చుట్టిరానున్నారు. 'ఇన్‌స్పిరేషన్ 4'గా పిలుస్తున్న ఈ పర్యటక(ప్రైవేటు) రైడ్​ను స్పేస్​ఎక్స్ సంస్థ రూపొందించిన 'డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్' ద్వారా చేపట్టారు.

  • విజయావకాశాలు ఎవరికి ఎక్కువ?

ఈ ఏడాది ఏప్రిల్​లో భారత్​లో ఆరంభమై... వైరస్ భయంలో ఉన్న ప్రజలకు కాస్త ఉపశమనాన్ని అందించేలా సాగిన ఐపీఎల్​ 14వ (Ipl-2021)సీజన్​ను మహమ్మారి కాటేసింది. కొంతమంది ఆటగాళ్లు పాజిటివ్​గా తేలడం కారణంగా మేలో లీగ్​ను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. అప్పటికే తమ ఆటతీరుతో కొన్ని జట్లు అభిమానులకు ఆనందాన్ని పంచితే.. మరికొన్ని పేలవ ప్రదర్శనతో నిరాశలో ముంచెత్తాయి. అయితే మరలా ఆదివారం నుంచి అభిమానులను అలరించేందుకు లీగ్ రెండో దశ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? వాటి విజయావకాశాల మాటేంటి అనేది ఓ సారి చూద్దాం.

06:47 September 16

టాప్​ న్యూస్​ @7AM

  • సర్కారీ బడుల వైపే..

కరోనా వల్ల మూతపడిన పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వివిధ కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని సర్కారీ బడుల్లో ప్రవేశాలు పెద్దఎత్తున పెరిగాయాయి. నాణ్యమైన విద్య అందిస్తుండటంతో పాటు.. ఫీజుల భారం లేనందున ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి విద్యార్థుల చేరికను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

  • 6 నెలల్లో ఎండెమిక్‌ దశలోకి..?

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకమని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. భారత్​లో కరోనా కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ దేశంలో కొవిడ్- ఎండెమిక్ దశకు చేరుకోనుందని అంచనా వేశారు.

  • తోడ్పాటుతోనే అందరికీ టీకా

ధనిక దేశాలు కరోనా టీకాలను గుత్తకు తీసుకుని పేద దేశాలకు కొరత సృష్టించే ప్రమాదాన్ని నివారించే 'కోవ్యాక్స్‌ కార్యక్రమం' నత్తనడకన కొనసాగుతోంది. దీనితో అనేక పేద దేశాల్లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం మందగించింది. మరోవైపు కొన్ని దేశాల్లో రెండు డోసులు పూర్తయి.. బూస్టర్​డోసు ప్రతిపాదనలూ తెరపైకి వస్తున్నాయి. టీకాల పంపిణీలో ఈ వ్యత్యాసం తగ్గాలంటే ధనిక దేశాలు కలసి రావల్సిందే.

  • టెలికాం సంస్థల హర్షం!

టెలికాం రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా కేంద్రం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై(telecom relief package) టెలికాం సంస్థలు(telecom companies in india) హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు, ఉపశమన చర్యలు.. టెలికాం రంగం తన లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నాయి.

  • ఈ ఫైట్​ సినిమాకే హైలెట్!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ 'సలార్' ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. ఇందులో ప్రభాస్ అదిరిపోయేలా కనిపిస్తారని తెలుస్తోంది.

05:41 September 16

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • కేబినెట్ భేటీ..

శాసనసభ సమావేశాల ఖరారుతో పాటు దళితబంధు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉద్యోగ ఖాళీల భర్తీ, ధాన్యం కొనుగోళ్లు, వరిసాగు, కరోనా సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మైనింగ్ సహా ఇతర అంశాలకు సంబంధించి కొత్త పాలసీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయ పున:ప్రారంభం సహా ఇతర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

  • కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్..

రాష్ట్రంలో అర్హులందరికీ కొవిడ్ టీకాలు లక్ష్యంగా నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే స్పెషల్ డ్రైవ్​(Covid Vaccination Special Drive)పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

  • నిమజ్జనంపై నేడు స్పష్టత..

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్‌లో నిమజ్జనం అంశంపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించగా.. నేడు విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. హుస్సేన్​సాగర్​తో పాటు జంట నగరాల్లోని ఇతర జలాశయాల్లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపుతట్టింది. నిమజ్జనంపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. 

  • నూతన ఐటీ విధానానికి శ్రీకారం..

తెలంగాణ ప్రభుత్వ నూతన ఐటీ విధానాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఇవాళ విడుదల చేయనున్నారు. ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ విధాన ఆవిష్కరణ కార్యక్రమం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ హెచ్​ఏసీసీలో జరగనుంది. ఐటీ పాలసీ ఆవిష్కరణకు ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 2021-26 కొత్త ఐటీ విధానాన్ని మంత్రిమండలి ఆమోదానికి అధికారులు సమర్పించగా.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్​లో జరిగే సమావేశంలో దీనిని ఆమోదించనున్నారు.

  • దర్యాప్తు వేగవంతం.. గాలింపు ముమ్మరం..

ఆటోలు, రైళ్లు, బస్సులు ఇలా వెతకని చోటు లేదు. జన సమర్థ ప్రాంతాల్లో పోస్టర్లు వేసినా.. రూ.10 లక్షల రివార్డు ప్రకటించినా ఇప్పటి దాకా ఫలితం లేదు. ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది పోలీసులు గాలిస్తున్నా అతడి జాడ లేదు. ఇది ఏ గజదొంగనో.. ఉగ్రవాదినో పట్టుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు కాదు. సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు కోసం పోలీసులు శ్రమిస్తున్న తీరు.

  • షర్మిల దీక్ష భగ్నం..

సైదాబాద్​లో అత్యాచారానికి గురైన చిన్నారికి న్యాయం జరగాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానికులను చెదరగొట్టి.. షర్మిలను అక్కడి నుంచి తరలించారు.

  • సరైన పునరావాసం కల్పించాలి..

జైలు జీవితం నుంచి బయటకొచ్చిన మహిళలు వివక్షకు గురవుతున్నారని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న వారు సమాజంలో సులువుగా కలసిపోయేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

  • 5జీ షురూ!

2022 ఫిబ్రవరిలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ఉండవచ్చని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే టెలికాం రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. ఆటోమేటిక్‌ రూట్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిచ్చింది.

  • హైదరాబాద్​ జట్టులో విహారి..

భారత టెస్టు ఆటగాడు హనుమ విహారి రంజీల్లో ఈసారి హైదరాబాద్​కు(Hanuma Vihari Ranji Team) ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇదే విషయాన్ని విహారి ఇప్పటివరకు ఆడిన ఆంధ్ర క్రికెట్​ అసోసియేషన్​ ధ్రువీకరించింది.

  • ఇప్పుడు ఎన్టీఆర్ కోసం..!

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు కియారా అడ్వాణీ హీరోయిన్ కాదని తెలుస్తోంది. ఆమె బదులు బాలీవుడ్​ స్టార్ కథానాయికను తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరంటే?

Last Updated :Sep 16, 2021, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.