ETV Bharat / international

భారత్​ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం.. చైనా వెన్నులో వణుకు!

author img

By

Published : Sep 16, 2021, 6:34 PM IST

భారత్​ అగ్ని-వీ బాలిస్టిక్ క్షిపణి(Ballistic missile) ప్రయోగాన్ని త్వరలో చేపట్టనున్న నేపథ్యంలో.. చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాసియాలో శాంతి భద్రతల కోసం అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంది. మరోవైపు.. బ్రిటన్​, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసిన ఆకస్(ఏయూకేయూఎస్​) కూటమిని విమర్శించింది.

india ballistic missile
భారత్​ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే.. ఐసీబీఎం అగ్ని-వీ బాలిస్టిక్​ క్షిపణిని(Ballistic Missile) భారత్​ త్వరలో ప్రయోగించనుందన్న వార్తలపై చైనా స్పందించింది. దక్షిణాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు.. ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝాలో లిజియాన్​ వ్యాఖ్యానించారు.

"శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడం దక్షిణాసియాలోని అన్ని దేశాలకు అవసరం. ఇందుకోసం అన్ని దేశాలు నిర్మాణాత్మక కృషి చేస్తాయని మేం ఆశిస్తున్నాం. అణ్వాయుధాలను అమర్చే సామర్థ్యమున్న ఈ బాలిస్టిక్​ క్షిపణిని భారత్​ అభివృద్ధి చేసే విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1172 తీర్మానంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి."

-ఝావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

భారత్​ ప్రయోగించనున్న బాలిస్టిక్ క్షిపణికి చైనాలోని నగరాలపై దాడి చేసే శక్తి ఉంది. ఇది భారత అమ్ముల పొదిలో కీలకమైన అస్త్రం. ఈ క్షిపణికి అణు వార్​హెడ్​లను మోసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే.. ఈ క్షిపణిని భారత్​ ఐదుసార్లు విజయవంతంగా ప్రయోగించింది. త్వరలో.. దీన్ని ఆర్మీకి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా, చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి కొన్ని దేశాల వద్దే ఈ బాలిస్టిక్​ క్షిపణులు ఉండడం గమనార్హం.

'శాంతికి భంగమే..'

మరోవైపు.. ఇండో పసిఫిక్​ ప్రాంత రక్షణ కోసం చైనా, అమెరికా, బ్రిటన్​ కలిసి ఆకస్(ఏయూకేయూఎస్​)​ పేరుతో త్రైపాక్షిక కూటమి ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. చైనా ఘాటుగా స్పందించింది. ఈ మూడు దేశాల ఒప్పందాన్ని తాము నిశితంగా గమనిస్తామని చెప్పింది. ఈ కూటమి వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని ఆరోపించింది. వివిధ దేశాలు తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రోత్సహిస్తుందని, విస్తరణను అడ్డుకునే అంతర్జాతీయ ప్రయత్నాలకు భంగం కలిగిస్తుందని విమర్శించింది.

" న్యూక్లియర్ ఆధారిత సబ్​మెరెన్​ సాంకేతికతను పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా సమకూర్చుకునేందుకు అమెరికా, బ్రిటన్​ సహకరిస్తామని తెలిపాయి. ఈ చర్యలు.. భౌగోళిక రాజకీయాల కోసం అణ్వాయుధాలను పరికరాలుగా వినియోగించుకుంటున్నాయన్నది కనిపిస్తోంది. ఇది ఆ దేశాల ద్వంద్వ వైఖరికి, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. దక్షిణాసియాలో అణ్వాయుధాలు లేని దేశంగా ఆస్ట్రేలియాకు పేరుంది. వ్యూహాత్మక సైనిక శక్తి కలిగిన ఆ దేశం ఇప్పుడు అణ్వాయుధాలను దిగుమతి చేసుకుంటోంది."

-ఝావో లిజియాన్​, అమెరికా విదేశాంగ ప్రతినిధి.

శాంతి, అభివృద్ధి కోసం ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలని చైనా విశ్వసిస్తుందని లిజియాన్ పేర్కొన్నారు. ఆకస్ కూటమిలోని దేశాలు ఏ ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని చెప్పారు.

ఇదీ చూడండి: north Korea missile test: ఉత్తర కొరియా దూకుడు- రైలు నుంచి క్షిపణి ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.