ETV Bharat / sports

Dhoni IPL 2021: 'ధోనీ పరుగులు సాధించడం కష్టమే'

author img

By

Published : Sep 16, 2021, 9:12 PM IST

Dhoni
ధోనీ

ఐపీఎల్​ 14వ సీజన్​(ipl 14 season) మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్ ధోనీ(Dhoni IPL 2021) పరుగులు సాధించడం కష్టమేనని తెలిపాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gambhir comments on dhoni).

ఐపీఎల్-14వ సీజన్‌(ipl 14 season) రెండో దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ(Dhoni IPL 2021) పరుగులు చేయడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌(gambhir comments on dhoni) అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీకి ఐపీఎల్‌లో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోవడం కఠినతరమని పేర్కొన్నాడు.

"ధోనీ సాధారణంగా నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. కానీ, ఐపీఎల్-14 మొదటి దశలో ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చాడు. కొన్నిసార్లు అతని కన్నా ముందు సామ్ కరన్ వచ్చిన సందర్భాలున్నాయి" అని గంభీర్ అన్నాడు.

"ధోనీ పరుగులు చేయడం చాలా కష్టం. ఐపీఎల్ చాలా క్లిష్టమైన టోర్నీ. ఇది కరీబియన్ ప్రీమియర్ లీగ్ లేదా మరో టోర్నీలా కాదు. ఇందులో అత్యుత్తమ బౌలర్లు ఆడుతుంటారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీ.. వారిని ఎదుర్కొని పరుగులు చేయడం కష్టం. కాబట్టి.. ధోనీ నుంచి చెన్నై టాప్ ఆర్డర్ ఎక్కువగా ఆశించకూడదు. మరోవైపు ధోనీ కూడా వికెట్ కీపింగ్‌, జట్టు మెంటార్ పాత్రని పోషించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు" అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

2019 ఐపీఎల్‌లో ధోనీ 416 పరుగులు సాధించి సీఎస్కే(csk squad 2021) తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై(పూర్తి కథన కోసం క్లిక్ చేయండి) చెప్పిన తర్వాత.. 2020 ఐపీఎల్‌లో 14 మ్యాచులు ఆడి 200 పరుగులు చేశాడు. ఇక, 2021 తొలి దశ ఐపీఎల్‌లో ఏడు మ్యాచులు ఆడి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అక్టోబరులో మొదలవనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టుని బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జట్టుకు మెంటార్‌(dhoni mentor indian team)గా ధోనీని బీసీసీఐ నియమించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.