ETV Bharat / sitara

పురుషులు రోజుకు చెప్పే అబద్ధాలు ఎన్నో తెలుసా?

author img

By

Published : Sep 16, 2021, 11:31 AM IST

పురుషులు అబద్ధాలు చెప్పడం సహజం! అమ్మాయిల విషయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. అవసరాన్ని బట్టి చెప్పేవి కొన్ని ఉంటే.. మరికొన్ని మెప్పు కోసం చెప్తారు. అయితే ఓ పురుషుడు సగటున రోజుకు ఎన్ని అబద్ధాలు చెప్తారు అనేది మీకు తెలుసా?

men lies in a day
పురుషులు రోజుకు చెప్పే అబద్ధాలు

పురుషులు/ స్త్రీలు రోజూ ఏదో ఓ విషయంలో అబద్ధాలు చెబుతూనే ఉంటారు! ఫోన్​లో మాట్లాడినప్పుడు అయితే మరీ ఎక్కువ. ఎక్కడ ఉన్నావ్​ అని అడిగితే పక్కనే ఉన్నాను అనే దానితో స్టార్ట్ చేసి మరో 5 నిమిషాల్లో నీ ముందు ఉంటాను అనే వరకు ఏకధాటిగా చెబుతూనే ఉంటారు. ఇంక అమ్మాయిల విషయంలో.. ముఖ్యంగా ప్రేయసి, భార్య దగ్గర అయితే ఎక్కువమంది పురుషులు కనీసం మెచ్చుకోలు కోసం అయినా అబద్ధాలు చెప్పడం సహజం. ఇలా సగటున ఓ పురుషుడు రోజుకు కనీసం ఆరు అబద్ధాలైనా చెప్తారని ఓ సర్వేలో తేలింది.

ఈటీవీలో ప్రసారమయ్యే.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న క్యాష్​ ప్రోగ్రామ్​లో ఈ ప్రశ్నను వ్యాఖ్యత సుమ అడిగారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన బుల్లితెర నటుడు రవి కృష్ణ, యాంకర్​ శివ జ్యోతి, నటి నవ్య స్వామి​, ప్రణవిలు హాస్యాస్పదంగా సమాధానాలిచ్చారు. ఈ ప్రశ్నకు షోలో ఉన్న ఒకే ఒక్క పురుషుడైన రవికృష్ణ సరిగ్గా బదులిచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ప్రశ్నలు సంధించారు సుమ.

  • ప్రశ్న: దుబాయ్​లో వేటిని పెంపుడు జంతువుగా పెంచుకుంటారు?

జవాబు: పులి.

  • ప్రశ్న: టమాటో కెచప్​ను మొదట్లో దేని గురించి తయారు చేశారు?

జవాబు: మెడిసిన్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Ntr Koratala Movie: చరణ్​ భామ.. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.