IND Vs NZ: భారత్-న్యూజిలాండ్​ సిరీస్ వాయిదా

author img

By

Published : Sep 16, 2021, 11:53 AM IST

Updated : Sep 16, 2021, 4:45 PM IST

India's New Zealand Tour Postponed Till Next Year as NZC Struggles with Covid-Crammed Schedule
IND Vs NZ: టీమ్​ఇండియా-న్యూజిలాండ్​ సిరీస్ వాయిదా ()

కరోనా క్వారంటైన్​ నిబంధనలు, వరుస ద్వైపాక్షిక సిరీస్​ల కారణంగా భారత్-న్యూజిలాండ్​ పర్యటన​(India's New Zealand Tour) వాయిదా పడింది. ఈ ఏడాది జరగాల్సిన సిరీస్​ను వచ్చే ఏడాదికి(2022) వాయిదా వేస్తున్నట్లు కివీస్​ క్రికెట్​ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

భారత్, న్యూజిలాండ్​(India Vs New Zeland) మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్​ వచ్చే ఏడాదికి(2022) వాయిదా పడింది. ఇదే విషయాన్ని న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా ఒకేసారి చాలాజట్లుకు ఆతిథ్యం ఇవ్వలేకపోవడం అందుకు కారణమని తెలుస్తోంది. భారత్​తో సిరీస్​ కంటే ముందుగా ఇతర దేశాల జట్లతో షెడ్యూల్​ చేసిన వాటిని పూర్తి చేయడంపై న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ప్రస్తుతం దృష్టిసారించింది. దీనివల్లే భారత్​-న్యూజిలాండ్ పర్యటనలో(India's New Zealand Tour) మార్పు చోటుచేసుకుంది. ఈ సిరీస్​లో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు జరగాల్సి ఉంది.

వరుస సిరీస్​ల కారణంగా న్యూజిలాండ్​ ఆటగాళ్లు ఈఏడాది క్రిస్​మస్​కు స్వదేశానికి చేరుకోలేరు. క్వారంటైన్​ నిబంధనల కారణంగా ఈ ఏడాది బాక్సింగ్​ డే టెస్టు(Boxing Day Test) జరగకపోవచ్చు. న్యూజిలాండ్​ టీమ్​ ప్రస్తుతం పాకిస్థాన్​ పర్యటనలో(New Zealand Vs Pakistan) భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్​ ఆడనుంది. ఇది పూర్తవ్వగానే టీ20 ప్రపంచకప్​(ICC T20 Worldcup 2021) ఆడేందుకు కివీస్​ బృందం యూఏఈ చేరుకుంటుంది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్ జట్టు వరుస సిరీస్​లతో బిజీగా గడపనుంది. తొలుత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ ఆ తర్వాత నెదర్లాండ్స్​తో ద్పైపాక్షిక సిరీస్​లు ఆడనుంది.

ఇదీ చూడండి.. Ipl-2021: ఐపీఎల్​ రెండోదశలో విజయావకాశాలు ఎవరికి ఎక్కువ?

Last Updated :Sep 16, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.