ETV Bharat / state

Srisailam dam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

author img

By

Published : Sep 16, 2021, 9:17 AM IST

Srisailam dam
Srisailam dam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55 వేల 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,20,810 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,20,810 క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో అధికారులు.. ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 44,597 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయం ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులు కాగా.. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 212.43 టీఎంసీలు కాగా.. గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 2.08 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 2,09,900 క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయం 28 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 8.048 టీఎంసీలుగా ఉంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.