ETV Bharat / bharat

నోరూరించే పుల్లపుల్లని మామిడికాయ పకోడీలు - ఇలా చేస్తే చిటికెలో ప్లేట్లు ఖాళీ! - Mango Pakoda Recipe

author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 4:17 PM IST

Mango Pakoda Recipe in Telugu : ఉల్లిపాయతో చేసే పకోడీ అందరికీ తెలిసిందే. అలాగే అప్పుడప్పుడూ చికెన్, పాలకూర పకోడీ తిని ఉంటారు. అయితే ఎప్పుడూ తినే పకోడీలు కాకుండా ఈసారి మామిడికాయ పకోడీ ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. మరి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Mango Pakoda
Mango Pakoda Recipe (ETV Bharat)

How to Make Mango Pakoda in Telugu : చాలా మందికి పకోడీ అనగానే.. ఉల్లిపాయ, చికెన్, పాలకూరతో చేసే రెసిపీలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, అలాకాకుండా వేసవి​లో విరివిగా దొరికే పచ్చిమామిడితో పకోడీ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు అంటే మాత్రం.. ఇప్పుడే ఈ అదిరిపోయే రెసిపీని ట్రై చేయండి. పుల్లపుల్లగా ఉంటూ నోరూరించే పచ్చిమామిడి పకోడీని(Pakoda) పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! పైగా సమ్మర్​ కాబట్టి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. మరి, ఇంకెందుకు ఆలస్యం పచ్చిమామిడి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చి మామిడికాయ - ఒకటి
  • శనగపిండి - ఒక కప్పు
  • కారం - అర స్పూను
  • పసుపు - చిటికెడు
  • జీలకర్ర - ఒక స్పూను
  • కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • సోడా ఉప్పు - చిటికెడు
  • వేయించడానికి సరిపడా - ఆయిల్

'ఆలూ మాసాలా సాండ్​విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ' అనడం పక్కా!

పచ్చి మామిడికాయ పకోడీ తయారీ విధానం :

  • ముందుగా ఒక పచ్చిమామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్​ చేసి చాలా సన్నగా తురుముకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే పైన పేర్కొన్న విధంగా శనగపిండి, కారం, పసుపు, జీలకర్ర, కొత్తిమీర తరగు, కరివేపాకుతో పాటు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు వేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అవసరమైనతే కొన్ని నీళ్లు కూడా ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. సాధారణంగా మామిడి తురుములోని నీళ్లు సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే పకోడీకి ఎంత జారుడుగా పిండి కావాలో ఆ విధంగా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
  • ఆయిల్ హీట్ అయ్యాక తయారు చేసుకొని పెట్టుకున్న మామిడి తురుము మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అంతే.. నోరూరించే టేస్టీ టేస్టీ పచ్చి మామడికాయ పకోడీ రెడీ! ఆపై దాన్ని సర్వింగ్ బౌల్​లోకి తీసుకొని వేడి వేడిగా టమాటా సాస్ లేదా కొత్తిమీర చట్నీతో వడ్డిస్తే తిన్నవాళ్లు ఆహా ఏమి రుచి అనడం పక్కా!
  • సమ్మర్​ స్పెషల్​ ఫ్రూట్​గా చెప్పుకునే మామిడితో చేసే ఈ పకోడీలు పుల్లపుల్లగా, కారంకారంగా ఉండటం వల్ల సాయంత్రం స్నాక్స్​గా చేసి పెడితే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.
  • వేసవిలో విరివిగా దొరికే పచ్చిమామిడితో కేవలం పకోడీ ఒక్కటే కాదు.. బోండాలు, గారెలు వంటి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి!

ఈ స్నాక్స్​ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్​ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు! - Easy Egg Snack Recipes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.