ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

author img

By

Published : Oct 30, 2021, 5:59 AM IST

Updated : Oct 30, 2021, 7:57 PM IST

top news@6AM
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

19:50 October 30

టాప్​న్యూస్​@ 8PM

  • ముగిసిన పోలింగ్​..

చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 12 గంటల పాటు పోలింగ్​ సాగింది. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదయింది. 

  • జమ్ముకశ్మీర్​లో పేలుడు..

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులకు తీవ్రగాయాలయ్యాయి.

  • సైకోప్రేమికునిపై దాడి..

తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడిచేశాడు ఓ సైకో ప్రేమికుడు. అర్ధరాత్రి సమయంలో యువతి ఇంట్లో దూరి నిద్రిస్తుండగా దాడిచేశాడు. గ్రామస్థులు యువకుడ్ని పట్టుకొని కొట్టి చంపారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

  • అదే టెక్నిక్​ వాడతా..

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) జరగనున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్ బ్యాటర్లను కట్టడి చేయడమే తన లక్ష్యమని తెలిపాడు కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. ఇందుకోసం పాక్​ బౌలర్​ షహీన్​ అఫ్రిది టెక్నిక్​ను వినియోగిస్తానని చెప్పాడు.

  • గుండెపోటుకు కారణాలు చెప్పటం కష్టం..

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్​కు గుండెపోటు(puneeth rajkumar heart attack video) రావడానికి గల కారణాలను కచ్చితంగా చెప్పడం అసాధ్యమని చెప్పారు ఆయన ఫ్యామిలీ డాక్టర్​ రమణరావు. పునీత్​ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు.


 


 

18:50 October 30

టాప్​న్యూస్​@ 7PM

  • ముగిసిన హుజూరా'వార్​'

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌  ముగిసింది. పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశమిచ్చారు. చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

  • రెండోడోస్​ కోసం మొబైల్​ వ్యాక్సిన్​ కేంద్రాలు..

జీహెచ్​ఎంసీ పరిధిలో రెండో డోస్​ వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎస్​ సోమేశ్​కుమార్​ తెలిపారు. 150 మొబైల్​ వ్యాక్సిన్​​ కేంద్రాల ద్వారా టీకాల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజేంద్ర నగర్​ సర్కిల్ పరిధిలోని సన్​రైజ్​ హోమ్​ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్​ పరీశీలించారు.

  • ఆమె వివాహానికి భర్తే పెళ్లిపెద్ద..

కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని తెలుసుకున్న ఓ భర్త.. ఆమెకు రెండో పెళ్లి జరిపించాడు. ప్రేమిస్తున్న యువకుడితో భార్య వివాహం జరిపించాడు. 'నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో.. వారితో కలిసి ఉంటేనే నాకూ ఆనందం' అంటూ భార్య పెళ్లికి.. పెద్దగా మారాడు.

  • మరో ముగ్గురికి జికా వైరస్​..

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో మరో ముగ్గురు.. జికా వైరస్(zika virus in india) బారినపడినట్లు తేలింది. దీంతో యూపీలో మొత్తం బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నేపథ్యంలో బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

  • కొత్త సరుకు వచ్చేసింది..

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో పుష్పకవిమానం ట్రైలర్​ సహా నాని 'శ్యామ్​సింగరాయ్​, రజనీకాంత్​ 'అన్నాత్తే' చిత్ర సంగతులు ఉన్నాయి.

18:17 October 30

టాప్​న్యూస్​@ 6PM

  • జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే... తానూ మద్దతిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనూ సమైక్యవాదాన్నే వినిపించినట్టు గుర్తు చేశారు. సమైక్యం.. తమ వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

  • నాలుగేళ్లుగా సూదితో నరకం..

భరించలేనంత నడుము నొప్పితో ఆస్పత్రులన్ని తిరిగింది ఆ మహిళ. సుమారు 4 లక్షల దాకా ఖర్చుపెట్టింది. అయినా.. అసలు సమస్య బయటపడలేదు. ఇటీవలే.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఎక్స్​రే తీశారు. అందులో అసలు సమస్య బయటపడింది. తన వెన్నుపూసలో సూది ఉన్నట్టు తేలింది. అసలు అక్కడికి సూది ఎలా వెళ్లిందంటే..

  • వచ్చేదీ సంకీర్ణ ప్రభుత్వమే..

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​(Sanjay Raut News) జోస్యం చెప్పారు. దాంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏకపార్టీ పాలన ముగుస్తుందని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్​ హాలులోకి విలేకరులను అనుమతించే విషయంలో కేంద్రం భయపడుతోందని ఆరోపించారు.

  • నిరాశపరిచిన సింధు..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఫ్రెంచ్​ ఓపెన్​(French Open 2021) సెమీస్​లో పరాభవం ఎదురైంది. జపాన్​ షట్లర్ సయాక (PV Sindhu vs Sayaka Takahashi) చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది.

  • చిరు భావోద్వేగం..

మెగాస్టార్​ చిరంజీవి(chiranjeevi puneeth rajkumar), వెంకటేశ్​, శ్రీకాంత్​, హాస్యనటుడు అలీ బెంగళూరు చేరుకుని పునీత్​ రాజ్​కుమార్​ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని భావోద్వేగానికి గురయ్యారు.

16:49 October 30

టాప్​న్యూస్​@ 5PM

  • కొనసాగుతోన్న హుజూరా'వార్​'..

హుజూరాబాద్​ ఉపఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. నియోజకవర్గంలోని పలు పోలీంగ్​ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం వాగ్వాదాలకు దిగటం వల్ల.. ఘర్ణణలు తలెత్తుతున్నాయి. పలు చోట్ల ఆయా పార్టీల కార్యకర్తలు.. నిరసనకు దిగారు.

  • గోవాలో రాహుల్​ రైడ్​..

గోవాలో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ద్విచక్రవాహనంపై ప్రయాణించారు. గోవా సంప్రదాయ బైక్ ట్యాక్సీ అయిన 'పైలట్'పై ఆయన ప్రయాణం చేశారు. ముందు ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. రాహుల్ వెనక కూర్చున్నారు. ఇద్దరూ హెల్మెట్, మాస్క్ ధరించి ప్రయాణించడం విశేషం. ఈ వీడియోను గోవా కాంగ్రెస్.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

  • మామ అత్యాచారం.. కోడలు గర్భవతి..

ఓ 15 ఏళ్ల బాలికపై తన మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

  • కరోనా మూలాలు కనుక్కోలేమా..?

కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించిందా? ల్యాబ్ నుంచి లీక్ అయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పట్లో దొరికేలా కనిపించటం లేదు. తాజాగా కరోనా మూలాలపై(Covid Origin Update) విస్తృత అధ్యయనం చేసిన అమెరికా నిఘా సంస్థలు... తాము కొవిడ్ మూలాలను ఎప్పటికీ గుర్తించలేమని తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం ఓ నివేదిక విడుదల చేశాయి.

  • వాళ్లే సెమిస్​కు వెళ్లేది..!

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) పాకిస్థాన్‌ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన టీమ్​ఇండియా ఆదివారం న్యూజిలాండ్‌తో(IND vs NZ T20) తలపడనుంది. నాకౌట్‌ దశకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ పోరులో ఓడితే టోర్నీలో నాకౌట్‌ దశకు చేరకుండానే వెనుదిరిగే ప్రమాదం పొంచి ఉంది. మరి ఈ కీలక మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో?


 

16:20 October 30

టాప్​న్యూస్​@ 4PM

  • ఈటల రూల్స్​ ఉల్లంఘించారు..

హుజూరాబాద్​ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదుచేసింది. తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

  • హుజూరాబాద్​లో ఉద్రిక్తత..

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌లో(Huzurabad by elections 2021) చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల తెరాస-భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. గులాబీ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కమలం పార్టీ నాయకులు ఆందోళనలకు దిగారు. గొడవలు పెద్దవి కాకుండా పోలీసులు పరిస్థితులను అదుపు చేశారు.

  • జీ 20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ

జీ20 సదస్సులో భాగంగా నిర్వహించిన 'గ్లోబల్ ఎకానమీ అండ్ గ్లోబల్ హెల్త్' సెషన్​లో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర సభ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతలు ఫ్యామిలీ ఫొటొ దిగారు. మోదీ పాటు ఇతర దేశాల నాయకులతో కలిసి ఇటలీ ఆరోగ్య కార్యకర్తలు ఫొటో దిగారు.

  • అభిమానులపై కెప్టెన్​ అసహనం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో(AFG vs PAK T20) అఫ్గాన్​ అభిమానులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు ఆ దేశ జట్టు కెప్టెన్ మహ్మద్ నబి(mohammad nabi news). టిక్కెట్టు లేకుండా మైదానంలోకి ప్రవేశించడాన్ని తప్పుపట్టాడు. దీనిపై విచారణ చేపట్టాలని ఐసీసీ ఆదేశించింది.

  • కన్నీటిపర్యంతమైన ఎన్టీఆర్​

హీరో ఎన్టీఆర్(ntr puneeth rajkumar)​.. నటుడు పునీత్ రాజ్​కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

14:36 October 30

టాప్​న్యూస్​@ 3PM

  • ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్​..

హుజూరాబాద్​ ఉపఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. నియోజకవర్గంలోని పలు పోలీంగ్​ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం వాగ్వాదాలకు దిగటం వల్ల.. ఘర్ణణలు తలెత్తుతున్నాయి. పలు చోట్ల ఆయా పార్టీల కార్యకర్తలు.. నిరసనకు దిగారు.

  • అధికారులు చూసుకుటారు..

హుజూరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన సీఈవో... అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ పక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఏదైనా సమస్య ఉన్నా... మావద్ద అందుకు తగ్గ అధికారులు, పోలీస్‌ బలగాలు ఉన్నాయని పేర్కొన్నారు.

  • దేశాన్ని నాశనం చేస్తున్నారు..

కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. గోవా పర్యటన (Mamata Banerjee Goa) సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ఏడో ఏటా దూరమై.. 

కూతురు సరిగ్గా చదవడం లేదని, తన స్నేహితుడి ఇంట్లో ఉంచి చదివిస్తే.. ఆమె బాగుపడుతుందనుకున్నాడు. వెంటనే ఆమెను తీసుకొచ్చి హైదరాబాద్​లోని స్నేహితుడి ఇంట్లో విడిచివెళ్లాడు. రెండ్రోజులు గడవకముందే తల్లిమీద బెంగతో ఎవరికీ చెప్పకుండానే ఇంటికెళ్లాలని బయటకొచ్చేసింది. ఆమె చేసిన ఆ చిన్న తప్పే 38 ఏళ్ల పాటు ఆమెను తన కుటుంబానికి దూరం చేసింది. చివరకు ఆమె అల్లుడి ద్వారా తన సోదరులను కలుసుకుంది. ఆ క్షణాన ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

  • ఆర్ఆర్ఆర్' నుంచి గ్లింప్స్​ రిలీజ్​

'ఆర్ఆర్ఆర్' నుంచి మరో అప్డేట్ వచ్చింది. రిలీజ్​ వాయిదా పడిన సినిమా గ్లింప్స్​ను నవంబరు 1వ తేదీని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

13:54 October 30

టాప్​న్యూస్​@ 2PM

  • రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి సాగు, అక్రమ (Ganja Smuggling) రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా (Ganja Smuggling)  అవుతున్న గంజాయి... నిత్యం ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ మొత్తంలో గంజాయి ఇవాళ పట్టుబడింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 54 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

  • కాంగ్రెస్​కే మా మద్దతు - లాలూ

బిహార్​లో జరుగుతున్నఉపఎన్నికల్లో (Bihar By Election News) ఆర్​జేడీ భారీ విషయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ అన్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్​ను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్​ పార్టీ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

  • పోప్​ ఫ్రాన్సిస్​ను కలిసిన ప్రధాని

ప్రముఖ క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi Pope Francis) కలిశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం ప్రధాని (Modi Italy tour) వెంట వెళ్లారు.

  • బ్రేక్​ చేయడమే అతడి పని

అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు పాకిస్థాన్​ సారథి బాబర్ అజామ్. అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన కెప్టెన్​గా (Fastest 1000 Runs in T20 as Captain) నిలిచాడు. దీంతో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ రికార్డును (Virat Kohli Records) అతడు బ్రేక్ చేశాడు.

  • హీరోను మించిన గొప్ప మనిషి

ఓ ప్రాంతీయ భాషా(కన్నడ) హీరో మరణిస్తే ఇంతమంది బాధపడుతున్నారంటే ఆయన ఎంతమంచి వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. కేవలం హీరోగానే మనకు తెలిసిన ఆయనలో ఓ గొప్ప మనిషి కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే?
 

12:51 October 30

టాప్​న్యూస్​@ 1PM

  • హుజూరాబాద్​లో ఉద్రిక్తత, తోపులాట

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌లో(Huzurabad by elections 2021) చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల తెరాస-భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.

  • రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టుబడింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 54 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

  • బాలకృష్ణ కన్నీటి పర్యంతం

నందమూరి బాలకృష్ణ.. హీరో పునీత్ రాజ్​కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

  • ఫిట్​నెస్ ట్రైనర్​ ఏమంటున్నారంటే..

శరీరదారుఢ్యం కోసం తరుచూ వ్యాయామాలు చేసే వ్యక్తులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని టాలీవుడ్ సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రైనర్ కులదీప్ శెట్టి సూచించారు. ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్(puneeth rajkumar death) గుండెపోటుతో హఠాన్మరణం చెందటం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కులదీప్.. 

  • చిన్నారులకు ఆ టీకాకు గ్రీన్ సిగ్నల్!

అమెరికాలో చిన్నారులకు ఫైజర్​ టీకా పంపిణీ చేసేందుకు అనుమతించింది (Pfizer Kids Vaccine Approval) అక్కడి ప్రభుత్వం. ఈ టీకాలు అందుబాటులోకి వస్తే 2.8 కోట్ల మంది చిన్నారులు లబ్ధిపొందనున్నారు.

11:49 October 30

టాప్​న్యూస్​@ 12PM

  • హుజూరాబాద్ పోలింగ్ శాతం..

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్((Huzurabad by election 2021)) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్‌ జరగనుంది. 

  • ఆ వివరాలపై ఆరా తీసిన కలెక్టర్, సీపీ

హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by elections 2021) ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ వేర్వేరుగా పర్యటించారు.

  • టార్గెట్ చైనా..!

ఇటలీ పర్యటనలో (Modi in Italy) ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అఫ్గాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలోని పరిస్థితులను, అక్కడి నుంచి ఎదురయ్యే సవాళ్లను తీక్షణంగా గమనించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. 

  • ఆయనపై ధోనీ నమ్మకం..

టీ20 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో టీమ్​ఇండియా కీలక పోరుకు సన్నద్ధమవుతున్న వేళ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య ఫిట్​నెస్​పై ఆందోళన వ్యక్తమవుతోంది. అతడిని ఎంపిక చేయడం పట్ల పలువురు మాజీలు సెలక్టర్లను తప్పుబడుతున్నారు.

  • ఆర్యన్ ఖాన్ విడుదల

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్​ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఆర్ధర్ రోడ్​ జైలు వద్దకు షారుక్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

10:49 October 30

టాప్​న్యూస్​@ 11AM

  • కౌశిక్‌రెడ్డి అడ్డగింత

హుజూరాబాద్(Huzurabad by elections 2021) నియోజకవర్గంలోని ఘన్ముక్లలో తెరాస నేత కౌశిక్ రెడ్డికి(Huzurabad by elections 2021) చేదు అనుభవం ఎదురైంది. ఘన్ముక్ల పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన కౌశిక్ రెడ్డిని... స్థానికేతరులు ఎందుకు వచ్చారని భాజపా శ్రేణులు నిలదీశాయి.

  • 'పోలింగ్ రోజూ డబ్బులు పంచుతోంది'

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది(Huzurabad by election 2021). ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌... సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కందుగులలో పోలింగ్ కేంద్రాన్ని ఈటల రాజేందర్‌ పరిశీలించారు.

  • ఓటర్ల జోరు.. 

దేశంలో మూడు లోక్​సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది(by election 2021). పలు పోలింగ్​ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు బారులు తీరారు(by election in india). వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 

  • భర్తకు వీడియోకాల్ చేసి ఉరేసుకుంది..

కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్‌(Video Call) చేసి ఆత్మహత్య(Selfie Suicide) చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

  • పునీత్ మరణవార్త చూసి అభిమాని మృతి

తమ అభిమాన హీరో పునీత్ రాజ్​కుమార్ మరణవార్త విని ఓ ఫ్యాన్ తట్టుకోలేకపోయాడు. షాక్​తో గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచాడు.

09:52 October 30

టాప్​న్యూస్​@ 10AM

  • హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శాతం

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్((Huzurabad by election 2021)) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్‌ జరగనుంది. 

  • దేశంలో కరోనా కేసులు

భారత్​లో కొత్తగా 14,313 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 549 మంది ప్రాణాలు కోల్పోగా.. 13,543 మంది వైరస్​ను జయించారు.

  • సెలబ్రిటీల పాటల సందడి..

ఈసారి దీపావళికి రచ్చ రచ్చే. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రోగాంకు సంబంధించిన ప్రోమో అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి.

  • వారికి అవకాశమిస్తేనే

న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ గెలుపు దాయాది శిబిరంలో ఎంత సంతోషం నింపిందో తెలియదు కానీ.. టీమ్​ఇండియా అభిమానులు మాత్రం చాలా ఆనందపడ్డారు. ఇదేంటీ.. కివీస్‌పై పాక్‌ గెలిస్తే భారత్‌కు వచ్చిన లాభమేంటి అని బుర్రలు బద్దలు కొట్టుకోకండే.. అదెలాగో ఓసారి చదివేయండి!

  •  మరోసారి పెరిగిన చమురు ధరలు

దేశంలో చమురు ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

08:50 October 30

టాప్​న్యూస్​@ 9AM

  • కుమార్తె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు

కన్నడ స్టార్ హీరో పునీత్​ రాజ్​కుమార్ అంత్యక్రియలు.. శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి. అయితే అమెరికాలో ఉన్న ఈ నటుడి కుమార్తె వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహిస్తారు.

  • అప్పూ.. హైదరాబాద్‌ అభిమాని!

కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు వారితోనూ పునీత్​కు అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు. 

  • ​ 'సముద్రయాన్'​ ప్రారంభం

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ 'సముద్రయాన్​'ను ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి మానవసహిత సముద్ర మిషన్​. ఫలితంగా సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించగలిగే సామర్థ్యం సంపాదించుకున్న దేశాల్లో భారత్​కు చోటు దక్కింది.

  • 'ఇంజినీరింగ్​ చేయాలంటే అది తప్పనిసరి'

విదేశాల్లో ఇంజినీరింగ్​ చేయడంపై ఏఐసీటీఈ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్​లో ఇంజినీరింగ్​, ఇతర సాంకేతిక ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే నిరభ్యంతర పత్రం (ఏన్​ఓసీ) తప్పనిసరి అని స్పష్టం చేసింది.

  • సెమీస్‌లో సింధు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ (French Open Badminton) టోర్నమెంట్​లో పీవీ సింధు దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో థాయ్​లాండ్​కు చెందిన బుసానన్​పై విజయం సాధించి సెమీస్​లోకి అడుగుపెట్టింది (PV Sindhu News).

07:50 October 30

టాప్​న్యూస్​@ 8AM

  • కొనసాగుతున్న పోలింగ్

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు నవంబర్‌ 2న వెల్లడి కానున్నాయి.

  • ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా (Bypolls in india latest) ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, 3లోక్​సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది.

  • బతికించే చదువుల కోసం..

ఉన్నత విద్యలో సబ్జెక్టుల మధ్య కచ్చితమైన విభజనరేఖ ఉండే శకం ముగిసిపోయింది. ఏమేమి మెలకువలు తెలుసు, ఎంత సృజనాత్మకంగా యోచించగలరన్న ప్రాతిపదికపై ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ప్రతిభావంతుల్ని కోరి వరిస్తున్నాయి. 

  • 'సీనియర్ నటిని అయినా తప్పలేదు'

సీనియర్ నటిని అయినప్పటికీ, అజయ్ దేవ్​గణ్ కొత్త సినిమా ఆడిషన్స్​లో పాల్గొన్నానని రాశీఖన్నా చెప్పింది. స్టార్​డమ్​కు రోజులు చెల్లిపోతున్నాయని తెలిపింది.

  • రషీద్​ ఖాన్​ అరుదైన రికార్డు

అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan News). ఈ ఫార్మాట్​లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన బౌలర్​గా నిలిచాడు.

06:46 October 30

టాప్​న్యూస్​@ 7AM

  • మంత్రికి మాతృవియోగం

మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతమ్మ(srinivas goud family) గుండెపోటుతో మరణించారు. ఇటీవలె ఆయన తండ్రి కూడా కన్నుమూశారు.

  • పెట్టుబడులతో రండి..

ఫ్రాన్స్​ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, మానవ వనరుల గురించి తెలిపారు. 

  • కల్తీ మద్యం తాగి నలుగురు మృతి

బిహార్ ముజఫర్​పుర్​లో విశాదం జరిగింది. కల్తీ మద్యం తాగి (adulterated alcohol in india) నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలో కల్తీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • 'గత ఖ్యాతితోనే హార్దిక్, భువీ'

టీమ్​ఇండియా ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya Bowling), భువనేశ్వర్ కుమార్​ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి(Dilip Doshi News) అభిప్రాయపడ్డాడు. 

  • తిరిగి సెట్స్​పైకి 'ఇండియన్ 2'

కమల్​హాసన్-శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 2' తిరిగి సెట్స్​పైకి వెళ్లనుంది. నిర్మాణ సంస్థకు, డైరెక్టర్ శంకర్​కు మధ్య వివాదం ముగిసినట్లు తెలుస్తోంది.

04:56 October 30

top news@6AM

  • నేడే హుజూరా‘వార్‌’.. 

నేడే హుజూరాబాద్​ ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్‌ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • 'అందుకు హైదరాబాదే సరైన ప్రాంతం'

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్యారిస్​లోని ఫ్రెంచ్ సెనేట్​లో ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరమ్​లో కేటీఆర్ ప్రసంగించారు. కొవిడ్ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్​ను రూపొందించడం అనే అంశంపై మాట్లాడారు. ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగమిస్తున్న తీరును వివరిస్తూ... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

  •  నేడు కాంగ్రెస్ కీలక సమావేశం

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్‌ నేతృత్వంలో హైదరాబాద్​లోని ఇందిరాభవన్​లో సాయంత్రం 6 గంటలకు సమావేశం జరగనుంది.

  • 'పునీత్​​' మరణం  ప్రముఖుల సంతాపం

కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

  • యూపీఎస్​సీ ప్రిలిమ్స్​-2021 ఫలితాలు విడుదల

సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమ్స్​ పరీక్ష 2021 ఫలితాలను యూపీఎస్​సీ విడుదల చేసింది. ఫలితాలను తన అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది.

  •  మరో నిందితుడు అరెస్ట్

తెలుగు అకాడమీ కేసులో మరో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కకుండా షిర్డీలో తలదాచుకుంటున్న మదన్​ను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు అకాడమీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

  •  మా డబ్బులు మాకివ్వండి

ఆహార, ఆర్థిక సంక్షోభం (economic crisis in afghan) అఫ్గానిస్థాన్​ను వేధిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్ల ప్రభుత్వం బ్యాంకులను అభ్యర్థిస్తోంది.

  • పాకిస్థాన్​ వాసికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

హైదరాబాద్‌లో తొమ్మిదేళ్లుగా అక్రమంగా నివాసముంటున్న పాకిస్తాన్‌ దేశస్థుడికి నాంపల్లి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దిల్లీ వాసినంటూ ప్రేమపేరుతో ఓ గాయనిని వివాహం చేసుకున్న మహ్మద్‌ అబ్బాస్‌.... తర్వాత విషయం బయటపడటంతో ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలోనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించటంతో చివరకు కటకటాల పాలయ్యాడు.

  • 'పుష్ప' సాంగ్​తో బన్నీ అదిరిపోయే రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప'(pushpa latest updates). ఈ సినిమాలోని ఓ లిరికల్​ సాంగ్​ను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. 'సామి సామి' పేరుతో విడుదలైన ఈ సాంగ్​​ సౌత్​ ఇండియా రికార్డును కొల్లగొట్టింది.

  • పాకిస్థాన్‌ హ్యాట్రిక్ విజయం

పాకిస్థాన్‌ వరుస విజయాలతో (T20 worldcup latest news) దూసుకుపోతోంది. నేడు (అక్టోబర్ 29) అఫ్గాన్‌స్థాన్‌పై నెగ్గి హ్యాట్రిక్ విజయాలను నమోదుచేసింది . అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది.

Last Updated :Oct 30, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.