ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' నుంచి అప్డేట్.. ఆ రోజే గ్లింప్స్​ రిలీజ్​

author img

By

Published : Oct 30, 2021, 1:55 PM IST

Updated : Oct 30, 2021, 2:23 PM IST

RRR glimpse teaser
'ఆర్ఆర్ఆర్' మూవీ

'ఆర్ఆర్ఆర్' నుంచి మరో అప్డేట్ వచ్చింది. రిలీజ్​ వాయిదా పడిన సినిమా గ్లింప్స్​ను నవంబరు 1వ తేదీని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ విడుదలకు తేదీ ఖరారైంది. నవంబరు 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. 45 సెకన్లపాటు ఈ వీడియో ఉండనుందని చెప్పారు.

శుక్రవారం సాయంత్రమే ఈ గ్లింప్స్​ విడుదల చేయాలనుకున్నారు. కానీ కన్నడ హీరో పునీత్​రాజ్ హఠాన్మరణంతో దానిని వాయిదా వేశారు.

RRR glimpse teaser
ఆర్ఆర్ఆర్ మూవీ గ్లింప్స్

నిజ జీవిత, కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్, కొమరం భీమ్​గా ఎన్టీఆర్ నటించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తయింది. నిర్మాణనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది 'ఆర్ఆర్ఆర్'.

RRR glimpse teaser
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పోస్టర్

ఇవీ చదవండి:

Last Updated :Oct 30, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.