ETV Bharat / bharat

మరకలు పడి గ్యాస్​ స్టవ్ జిడ్డుగా మారిందా? - ఈ టిప్స్​తో కొత్తదానిలా తళతళా మెరిసిపోద్ది! - Gas Stove Top Cleaning Tips

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 5:09 PM IST

Gas Stove Cleaning Tips: ఇంటిల్లిపాది ఆరోగ్యానికి వంటిల్లే ముఖ్యం. అందుకే వంటగది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అయితే.. కొన్ని కొన్ని సార్లు గ్యాస్​ స్టవ్​​ మీద పడిన మరకలు జిడ్డుగా మారతాయి. వాటిని క్లీన్​ చేయడం కష్టమైపోతుంది. ఇందుకోసం గృహిణులు నానా అవస్థలు పడతారు. అయితే.. ఈ టిప్స్​ పాటిస్తే ఈజీగా క్లీన్​ చేయొచ్చంటున్నారు నిపుణులు.

Gas Stove Top Cleaning Tips in Telugu
Gas Stove Top Cleaning Tips (ETV Bharat)

How to Clean Gas Stove Top in Telugu: గ్యాస్‌ స్టవ్‌ మీద కుకింగ్​ ఈజీగానే ఉంటుంది. కానీ.. దాన్ని క్లీన్‌ చేసేటప్పుడే చుక్కలు కనపడతాయి. వంట చేసేటప్పుడు స్టవ్‌ మీద నూనె మరకలు, పిండి మరకలు, పొంగిన పాలు, పప్పు చిరాకు తెప్పిస్తాయి. వీటిని క్లీన్ చేయడం ఇంట్లో మహిళలకు సవాలే. అయితే.. ఈ చిన్న చిన్న టిప్స్‌ ఫాలో అయితే.. గ్యాస్​ స్టవ్ చిటికెలో క్లీన్​ అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వైట్​ వెనిగర్​: గ్లాస్‌ స్టవ్‌ ను క్లీన్‌ చేయడానికి వైట్‌ వెనిగర్‌ చాలా బాగా హెల్ప్‌ అవుతుంది. గ్యాస్‌ స్టవ్‌ క్లీన్‌ చేయడానికి రెండు కప్పుల నీటిలో.. ఒక కప్పు వెట్‌ వెనిగర్‌ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి స్టోర్​ చేసుకోండి. వెనిగర్‌లోని యాసిడ్‌ జిడ్డును వదిలిస్తుంది. మీరు ఈ లిక్విడ్‌ను గ్యాస్‌ స్టవ్‌‌‌ క్లీన్‌ చేయడానికి ఉపయోగించవచ్చు. కానీ.. గ్యాస్‌ బర్నర్‌లను క్లీన్ చేయడానికి వైట్‌ వెనిగర్‌ వాడకూడదు. వాటిని యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మిలమిలా మెరుస్తాయి.

మీ కిచెన్​లో పొగ ఎక్కువగా వస్తుందా? - ఈ టిప్స్ పాటించారంటే ఆ సమస్య ఉండదు - పైగా గ్యాస్ ఆదా! - Kitchen Pollution Reduce Tips

ఉప్పు, బేకింగ్ సోడా: గ్యాస్​ స్టవ్​ క్లీనింగ్​ కోసం ఉప్పు, బేకింగ్ సోడా ఈ రెండూ పర్ఫెక్ట్​గా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ రెండింటినీ చెంచా చొప్పున తీసుకొని మిక్స్‌ చేయండి. దీనికి కొద్దికొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమంతో తుడిస్తే.. స్టవ్‌కి అంటుకున్న జిడ్డు, మురికి ఇట్టే వదులుతుంది.

బేకింగ్​ సోడా, నిమ్మకాయ: గ్యాస్‌ టాప్‌పై జిడ్డు పేరుకుపోతే.. బేకింగ్ సోడా, నిమ్మకాయ వీటిని తొలగించడంలో సహాయపడతాయి. వీటి సహాయంతో గ్యాస్‌ స్టవ్‌ సులభంగా క్లీన్‌ చేసుకుని తళతళా మెరిపించవచ్చు.

గ్యాస్​ స్టవ్​ క్లీన్​ చేసే విధానం:

  • ముందుగా ఓ పెద్ద గిన్నెలో వేడి నీరు, డిష్​ సోప్ కలుపుకోవాలి.
  • అందులో గ్యాస్​ ప్లేట్​​లు, బర్నర్​లు వేసి వాటిని నాననివ్వాలి.
  • ఇప్పుడు స్టవ్​ టాప్​ భాగాన్ని క్లీన్​ చేయాలి. అందుకోసం ముందుగా స్టవ్​పై పేరుకుపోయిన ఆహార పదార్థాలను రిమూవ్​ చేసుకోవాలి.
  • పైన చెప్పిన మూడు కాంబినేషన్లలో ఏదో ఒకటి తీసుకుని ​టాప్​ మొత్తం స్ప్రే చేయాలి.
  • ఉదాహరణకు బేకింగ్​ సోడా, నిమ్మకాయ కాంబినేషన్​ తీసుకుంటే స్టవ్​పై బేకింగ్​ సోడాను చల్లి ఆపై నిమ్మచెక్కతో రుద్ది కొద్దిసేపు వదిలేయాలి.
  • ఆ తర్వాత నీటితో క్లీన్​గా శుభ్రం చేసుకోవాలి.
  • తర్వాత మెత్తటి క్లాత్​ తీసుకుని తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి.
  • ఇప్పుడు వేడినీటిలో నానబెట్టిన గ్రేట్లు (ప్లేట్లు), బర్నర్​లను కూడా క్లీన్​ చేసుకోవాలి.
  • ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. స్టవ్​ క్లీన్​ చేసే సమయంలో స్క్రాచింగ్ ప్యాడ్‌లు ఉపయోగించకూడదు. మెత్తని స్పాంజ్​లు ఉపయోగించాలి.
  • ఎందుకంటే స్క్రబ్​ యూజ్​ చేస్తే గీతలు పడే అవకాశం ఉంటుంది.
  • ఇవి పాటిస్తే.. స్టవ్ కొత్తదానిలా మెరిసిపోతుంది.

గ్యాస్​ సిలిండర్ పేలితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్​ - ఎలా క్లెయిమ్ చేయాలంటే?

గ్యాస్ స్టౌ నుంచి మంట సరిగా రావట్లేదా? - ఇలా ఈజీగా సెట్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.