ETV Bharat / bharat

ఓటర్ల జోరు.. ప్రశాంతంగా 'ఉప'పోరు

author img

By

Published : Oct 30, 2021, 10:30 AM IST

దేశంలో మూడు లోక్​సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది(by election 2021). పలు పోలింగ్​ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు బారులు తీరారు(by election in india). వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలింగ్​ కేంద్రాలకు వెళుతున్నారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పోలింగ్​ నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

by election 2021
ఉపఎన్నికలు

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి(by election 2021). కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు(by election in india). ఓటేసేందుకు వృద్ధులు కూడా తరలివెళుతున్నారు. కాగా పలు ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేసినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినట్టు వెల్లడించింది.

by election 2021
దమన్​ దీవ్​లో ఇలా..
by election 2021
బంగాల్​ గోసావా నియోజకవర్గంలోని ఓ పోలింగ్​ కేంద్రంలో..
by election 2021
బంగాల్​ గోసావాలో ఓటేసేందుకు తరలిన వృద్ధులు
by election 2021
మిజొరాం తురియల్​లో ఓటేసేందుకు వెళుతూ..
by election 2021
మిజొరం తురియల్​లో..
by election 2021
మిజొరం తురియల్​లో ఓటేసిన వృద్ధురాలు
by election 2021
మేఘాలయా మావ్రింగ్క్నెంగ్​లోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఇలా
by election 2021
మేఘాలయా మావ్రింగ్క్నెంగ్​లోని ఓ పోలింగ్​ కేంద్రం వద్ద ప్రజలు
by election 2021
బిహార్​ కుశ్వేశ్వర్​ అస్థాన్​లోని ఓ పోలింగ్​ బూత్​లో..
by election 2021
కుశ్వేశ్వర్​ అస్థాన్​లో బారులు తీరిన ఓటర్లు

కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్‌ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలోని 5, బంగాల్‌లో 4, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాలలో రెండు.. తెలంగాణ, ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరంలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:- నీరోడుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.