ETV Bharat / sitara

Puneeth rajkumar news: పునీత్.. హీరోను మించిన గొప్ప మనిషి

author img

By

Published : Oct 30, 2021, 1:45 PM IST

ఓ ప్రాంతీయ భాషా(కన్నడ) హీరో మరణిస్తే ఇంతమంది బాధపడుతున్నారంటే ఆయన ఎంతమంచి వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. కేవలం హీరోగానే మనకు తెలిసిన ఆయనలో ఓ గొప్ప మనిషి కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే?

Puneeth Rajkumar
పునీత్ రాజ్​కుమార్

కన్నడ హీరో పునీత్​ రాజ్​కుమార్ మరణం చాలామందికి షాక్​కు గురిచేసింది. ఎందుకంటే ఓ మంచి నటుడే కాదు అంతకు మించిన గొప్ప మనిషిని కోల్పోయామనే బాధ. ఆయన ఇకలేరు, మరి సినిమాలు చేయరు అంటే ఏదో తెలియని వెలితి.

Puneeth Rajkumar
పునీత్ రాజ్​కుమార్

వెండితెరపై కథానాయకుడిగా, నటుడిగా ఎందరో మనసుల్ని గెలిచారు. బయటకూడా చాలామంచి పనులు చేసి ప్రజల్ని హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు.

ఇంతకీ ఏమేం చేశారంటే?

45 ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధ ఆశ్రమాలు, 19 గోశాలు ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నారు.

మరణానంతరం తన రెండు కళ్లను దానం చేసిన గొప్ప వ్యక్తి పునీత్ రాజ్​కుమార్. అందుకే కన్నడ ప్రేక్షకులకు ఆయనంటే అంత అభిమానం. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఆ నిజమైన హీరో మరణవార్త విని తల్లడిల్లిపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Puneeth Rajkumar
పునీత్ రాజ్​కుమార్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.