ETV Bharat / state

ప్రైవేట్ ట్రావెల్స్​లో ప్రయాణంపై ప్రజల ఆందోళన - ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి - Private Buses Fitness certificate

author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 8:30 AM IST

Lack Of Fitness For Private Buses : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, క్షేమం అని ప్రయాణికులకు ప్రభుత్వం భరోసానిస్తోంది. కానీ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించే వారికి అటువంటి భరోసా లేదు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన ఓ బస్సు ప్రమాదం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా ప్రయాణికుల కోసం ఉపయోగించే వాహనాలకు ఏటా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలి. కానీ ప్రైవేట్‌ బస్సుల యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు వాపోతున్నారు.

Private Buses Are Lack Of Fitness Certificate in Telangana
Lack Of Fitness For Private Buses (ETV Bharat)
ప్రైవేట్ ట్రావెల్స్​లో ప్రయాణంపై ప్రజల ఆందోళన - ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి (ETV Bharat)

Private Buses Are Lack Of Fitness Certificate in Telangana : ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే రైళ్లున్నా మహారాష్ట్రకు వెళ్లి తిరిగి రావాల్సిందే. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌కు రైల్వే అనుసంధానమై ఉన్నా ఆ మార్గంలో నడిచేవన్నీ ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్‌లే. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు రైల్వే సౌకర్యం లేక ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. కానీ బస్సుల నిర్వహణ స్థితిపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది.

ఆర్టీవో అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 240 ప్రైవేట్‌ బస్సులు ఉన్నాయి. వీటిలో 143 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు పూర్తి కండిషన్‌లో లేకపోతే బయట నడపకూడదు. ప్రయాణికుల కోసం ఉపయోగించే ఏ వాహనమైనా ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇంజిన్‌ పనితీరు, బ్రేక్‌ల పటుత్వం, బీమా వెసులుబాటు చూసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం సరిగ్గా ఉన్నట్లు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధ్రువీకరణ పత్రం పొందాలి. కానీ అటువంటి జాగ్రత్తలు బస్సు యజమాన్యాలతో పాటు ఆర్టీవో అధికారులు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

బస్సులో వసతులపై నిలదీసిన ప్రయాణికులు - వాహనాన్ని రోడ్డుమీద వదిలేసి వెళ్లిన డ్రైవర్ - COMPLAINT ON BUS TRAVELS MANAGEMENT

"కాలపరిమితి చెందిన బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులను సమయానికి చేర్చేందుకు, తీసుకున్న కొరియర్స్​ను చేరవేయడానికి స్పీడ్​గా నడిపిస్తున్నారు. ఆర్టీవో అధికారులు కూడా దృష్టి సారించడం లేదు. ఇది ప్రజల ప్రాణానికి సంబంధించిన అంశం. రోజు వేల మంది ప్రయాణిస్తున్నారు అందుకు ప్రభుత్వం ప్రైవేటు బస్సులపైన నిఘా ఉంచాలి. ఫిట్​నెస్​ లేని బస్సులను ఆపేయాలి, అనుమతులు కూడా ఇవ్వొద్దు. డ్రైవర్లకు కూడా టెస్టులు చేసి వారికి డ్రైవింగ్ ఇవ్వాలి." - ప్రయాణికులు

ప్రమాదాలు జరగడానికి అతివేగమే కారణమని డ్రైవర్‌ల మీదకు నెట్టేయకుండా అసలు బస్సు ప్రమాదాలు జరగకుండా ఆర్టీవో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లకు నిర్వహించే విధంగా ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌లకు సైతం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తే ప్రమాదాలను కొంతమేరకైన తగ్గించవచ్చని స్థానికులు అంటున్నారు.

Private Travel Bus Fire Accident : ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Car Rental Scam Hyderabad : బీ కేర్​ఫుల్ బ్రదర్.. అద్దెకు తీసుకుంటారు.. అదునుచూసి అమ్మేస్తారు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.