ETV Bharat / spiritual

ఈ రాశివారికి కోరుకున్న చోటుకు ట్రాన్స్​ఫర్! వ్యాపారులకు ఫుల్​ ప్రాఫిట్స్​! - Horoscope Today May 29th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 5:00 AM IST

Horoscope Today May 29th 2024 : మే​ 29న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 29th 2024
Horoscope Today May 29th 2024 (ETV Bharat)

Horoscope Today May 29th 2024 : మే​ 29న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వారి రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు ఎదురైనా మీ ప్రతిభతో వాటిని అధిగమిస్తారు. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు వ్యాపారులకు సర్వత్రా విజయం ఉంటుంది. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. దూరదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు చేతికి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అభీష్టసిద్ధి ఉంటుంది. చేతికి అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగండి. దురలవాట్ల జోలికి పొతే సమాజంలోపరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రతిష్టను దిగజార్చడానికి శత్రువులు పొంచి ఉన్నారు. కీలక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటే మేలు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. దుర్గా దేవి శ్లోకాలు పఠిస్తే ప్రశాంతత దొరుకుతుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు గ్రహబలం బాగుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అదృష్టం వరిస్తుంది. ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీకి అవకాశం ఉంది. నిజాయితీతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో మంచి పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. అనేక మార్గాలలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం పొందుతారు. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా అవసరం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రయాణాలలో శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు దైవబలంతో ఇప్పుడు పూర్తవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాల పట్ల అప్రమత్తం అవసరం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు, ఆటంకాలు ఎదురు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులకు పని భారం పెరగడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. మనోబలంతో పనిచేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు, పెట్టుబడుల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి కొత్త వెంచర్లు మొదలు పెట్టడానికి ఇది తగిన సమయం. కుటుంబ సభ్యులతో అనుబంధాలు దృఢపడతాయి. కీలకమైన వ్యవహారాల్లో చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక సంబంధమైన లాభాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత, అనిశ్చితి ఉంటా యి. ఆయా రంగాలలో అనుభవజ్ఞుల సలహా మేలు చేస్తుంది. వ్యాపారులకు అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి, ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల వాతావరణం, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. గృహంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు పొందుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. తగిన విశ్రాంతి అవసరం.ఉద్యోగులకు ప్రమోషన్, కావలసినంత ఆదాయం లభిస్తుంది. గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. తీరికలేని పనులతో అవిశ్రాంతంగా ఉంటారు. ప్రత్యర్థులపై పై చేయి సాధించడంపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. పని ప్రదేశంలో అందరిని కలుపుకొని పోతారు. సమష్టి కృషితో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.