ETV Bharat / entertainment

వాళ్లను ఇన్సిపిరేషన్​గా తీసుకో మోక్షు- నేను విశ్వక్ ట్విన్స్​లానే ఉంటాం: బాలయ్య - Nandamuri Mokshagna Inspiration

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 7:00 AM IST

Updated : May 29, 2024, 7:15 AM IST

Nandamuri Mokshagna Inspiration: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఆయన కుమారుడు మోక్షాజ్ఞ తెరంగేట్రం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయనను కాకుండా యువతరాన్ని ఇన్స్పిరేషన్​గా తీసుకోవాలని మోక్షాజ్ఞకు చెబుతుంటానని అన్నారు.

Nandamuri Mokshagna Inspiration
Nandamuri Mokshagna Inspiration (Source: ETV Bharat)

Nandamuri Mokshagna Inspiration: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్​ రోల్​లో నటించిన సినిమా 'గ్యాంగ్స్​ ఆఫ్ గోదావరి'. ఈ సినిమా మే 31న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీయూనిట్ హైదరాబాద్​లో మంగళవారం గ్రాండ్​గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్​కు నందమూరి నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. కాగా, ప్రోగ్రామ్​లో బాలయ్య తన తనయుడు మోక్షాజ్ఞ సినిమా అరంగేట్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కుమారుడు నందమూరి మోక్షాజ్ఞ తెరంగేట్రం త్వరలోనే ఉండనుందని బాలయ్య క్లూ ఇచ్చారు.'మా అబ్బాయి మోక్షు కూడా రేపు ఇండస్ట్రీకి రావాలి. కానీ, నన్ను కాకుండా విశ్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని తనకు చెబుతుంటా. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూ ఉండాలి. నాన్న నుంచి అదే నేర్చుకున్నా. మోక్షు కూడా అదే అనుసరిస్తాడు' అని బాలయ్య అన్నారు.

'ఇండస్ట్రీలో కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటాను. అందులో విశ్వక్ ఒకడు. మంచి నటుడు, నాలాగే ఉడుకురక్తం. ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తాడు. నాకు విశ్వక్ సోదరుడితో సమానం. మమ్మల్ని కవలలు అంటారు. నేను విశ్వక్​ కంటే చిన్నవాడినే (నవ్వుతూ). తనకు సినిమా అంటే తపన. ప్రతి సినిమాకు కొత్తదనం ఇవ్వాలనుకుంటాడు. మా ఇద్దరి మధ్య సారూప్యత అదే' అని బాలకృష్ణ అన్నారు.

బాలయ్య ఫోన్ చేస్తే, ఏడ్చేశా! ఇక ఇదే ఈవెంట్​లో హీరో విశ్వక్ మాట్లాడుతూ తనకు బాలయ్యతో ఉన్న రిలేషన్ గురించి చెప్పారు. 'ఈ సినిమా షూటింగ్​లో నేను ఓ రోజు గాయపడ్డాను. అది బాలయ్య సర్​కు తెలిసి నాకు ఫోన్ చేశారు. ఎలా ఉందంటూ నాతో చాలాసేపు మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నా ఫ్యామిలీ తర్వాత అంత ప్రేమ చూపించింది ఆయనే' అని విశ్వక్ అన్నారు.

ఇక ఈ సినిమాను డైరెక్టర్ కృష్ణచైతన్య తెరకెక్కించారు. ఈ మూవీ విలేజ్ బ్యాక్​డ్రాప్ పొలిటికల్ థ్రిల్లర్​గా ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. విశ్వక్​కు జోడీగా యంగ్ బ్యూటీ నేహా శర్మ నటించింది. అంజలీ, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, గోపరాజు రమణ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమా బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్​ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

'చరిత్రలో మిగిలిపోవాలంతే!'- పొలిటికల్ థ్రిల్లర్​గా 'గ్యాంగ్స్​ ఆఫ్ గోదావరి' - Gangs of Godavari Trailer

ఎన్టీఆర్ మూవీ రీమేక్​కు విశ్వక్​ సై- ఏ సినిమానో తెలుసా? - Vishwak Sen Gangs OF Godavari

Last Updated : May 29, 2024, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.