ETV Bharat / crime

Pakistani citizen prison: పెళ్లి పేరుతో పాకిస్థాన్​ వాసి మోసం.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

author img

By

Published : Oct 30, 2021, 5:10 AM IST

Updated : Oct 30, 2021, 5:22 AM IST

హైదరాబాద్‌లో తొమ్మిదేళ్లుగా అక్రమంగా నివాసముంటున్న పాకిస్తాన్‌ దేశస్థుడికి నాంపల్లి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దిల్లీ వాసినంటూ ప్రేమపేరుతో ఓ గాయనిని వివాహం చేసుకున్న మహ్మద్‌ అబ్బాస్‌.... తర్వాత విషయం బయటపడటంతో ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలోనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించటంతో చివరకు కటకటాల పాలయ్యాడు.

Illegal residence of a Pakistani national for nine years
యువతిని పెళ్లి చేసుకుని ఆమెతో పాటు హైదరాబాద్‌ వచ్చిన అబ్బాస్ ఇక్రమ్

హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌కు చెందిన ఓ యువతి దేశవిదేశాల్లో జరిగే కచేరీల్లో పాటలు పాడుతోంది. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు మహ్మద్‌ అబ్బాస్ ఇక్రమ్‌ దుబాయ్‌లో పరిచయమయ్యాడు. దిల్లీలో ఉంటున్న ముస్లింనంటూ ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత హైదరాబాద్‌కు వచ్చాక వారికి ఓబిడ్డ జన్మించింది. తానూ పాకిస్తాన్‌వాసినని.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇక్రమ్‌తో భయంభయంగా జీవిస్తున్న యువతి ఇంట్లోని చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అబ్బాస్‌ ఇక్రమ్‌ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇక్కడే నకిలీ ధ్రువపత్రాలు, విద్యార్హతలు, పాస్‌పోర్ట్‌, ఆధార్‌ సంపాదించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.


మహ్మద్‌ అబ్బాస్‌కేసు విచారణను లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు చేయగా పాకిస్తాన్‌వాసిగా ఉన్న పాస్‌పోర్టు లభించింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు వివరాలను పంపగా అబ్బాస్‌ పాక్‌ పౌరుడిగా తేలింది. ఆ ఆధారాలను పోలీసులు కోర్టులో సమర్పించగా గతేడాది అక్టోబర్‌లో నాంపల్లి న్యాయస్థానం విచారణ చేపట్టి ఏడాదిలోపే తుదితీర్పునిచ్చింది. హైదరాబాద్‌లో తొమ్మిదేళ్లుగా అక్రమంగా నివాసముంటున్నందుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అబ్బాస్‌ ఇక్రమ్‌ ఇప్పటికే మూడున్నరేళ్లు జైల్లో ఉన్నందున మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాత ఇక్రమ్‌ను డిపోర్టేషన్‌ ప్రక్రియ ద్వారా పాకిస్తాన్‌కు పంపనున్నారు.

ఇదీ చూడండి:

కోర్టులో లొంగిపోయిన డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు బండారు హన్మంత్

Last Updated :Oct 30, 2021, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.