ETV Bharat / international

చిన్నారులకు ఫైజర్​ టీకా పంపిణీకి ఆమోదం

author img

By

Published : Oct 30, 2021, 12:05 PM IST

అమెరికాలో చిన్నారులకు ఫైజర్​ టీకా పంపిణీ చేసేందుకు అనుమతించింది (Pfizer Kids Vaccine Approval) అక్కడి ప్రభుత్వం. ఈ టీకాలు అందుబాటులోకి వస్తే 2.8 కోట్ల మంది చిన్నారులు లబ్ధిపొందనున్నారు.

fda paves way
చిన్నారులకు ఫైజర్

టీకా పంపిణీలో అమెరికా మరో కీలక ముందడుగు వేసింది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుల కోసం ప్రముఖ టీకా తయారీ సంస్థ ఫైజర్ (Pfizer Kids Vaccine Approval) రూపొందించిన​ టీకాకు ఆమోదం లభించింది. అత్యవసర వినియోగం కింద ఈ టీకాల పంపిణీకి అనుమతిస్తున్నట్లు ఫుడ్​ అండ్ డ్రగ్​ అడ్మనిస్ట్రేషన్ (Pfizer Kids Vaccine Approval)​ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ టీకా పంపిణీపై నిపుణులు సూచనలను పరిశీలించి సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ మంగళవారం తుది ప్రకటన చేయనుంది.

చిన్నారులకు మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు (Pfizer Kids Vaccine Approval) ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకాలు అందుబాటులోకి వస్తే దేశంలోని 2.8 కోట్ల మంది చిన్నారులు లబ్ధిపొందనున్నారు.

అంతకుముందు.. 2,268 మంది పిల్లలపై ఫైజర్ చేపట్టిన పరిశోధనల్లో ఈ వ్యాక్సిన్​ 91 శాతం ప్రభావితం అని వెల్లడైంది. ఇప్పటికే ఫైజర్.. 18 ఏళ్ల దాటిన వారికి, 12-18 ఏళ్ల వారికి టీకాలను అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ చూడండి : 'వర్క్‌ ఫ్రమ్‌ స్పేస్‌' కోసం బెజోస్‌ యత్నాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.