ETV Bharat / sitara

'పునీత్​​' మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

author img

By

Published : Oct 29, 2021, 3:03 PM IST

Updated : Oct 29, 2021, 5:42 PM IST

Well-known Kannada actor Puneet Rajkumar dies after heart attack
పునీత్​ రాజ్​కుమార్​ కన్నుమూత

16:24 October 29

పునీత్​ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి..

కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

షాక్‌కు గురయ్యా: సీఎం బొమ్మై

పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. పునీత్‌ ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. కన్నడిగుల అభిమాన హీరో అప్పూ మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పునీత్‌ ఇకలేరన్న బాధను తట్టుకొనే శక్తిని అభిమానులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో తెలిపారు. అంతకుముందు పునీత్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హఠాన్మరణం కలిచివేస్తోంది: యడియూరప్ప

పాపులర్‌ సినీ హీరో రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. చిన్న వయస్సులోనే మనందరినీ వదిలి వెళ్లిపోవడం కలిచివేస్తోందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పునీత్‌ నటించిన అనేక చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు.

  • ''హృదయం ముక్కలైంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంత త్వరగా మనల్ని వదలి వెళ్లారనే వార్త విస్మయానికి గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.'' 

               - చిరంజీవి

  • ''అప్పూ మృతితో గొప్ప స్నేహితుడ్ని కోల్పోయా. ఆయన మృతి కన్నడ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయకుడు, గాయకుడు, నిర్మాత, బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రతిభ చాటాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.''

                  - నందమూరి బాలకృష్ణ.

  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ చాలా మంచి మనిషి. భగవంతుడు కొన్నిసార్లు ఇలా ఎందుకు చేస్తాడో నాకు అర్థంకాదు. యావత్‌ సినీ ప్రపంచానికి విషాదకరమైన రోజు ఇది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా.''

                - మోహన్‌ బాబు.

  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. రాజ్‌కుమార్‌ ఆత్మకు శాంతి కలగాలి.''

                    -నాగార్జున.

  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. నమ్మశక్యం కాలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నా.''

                   -పవన్‌ కల్యాణ్‌

  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను కలిసిన, మాట్లాడిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం.'' 

      - మహేశ్‌బాబు.

  • ''నా ప్రియమైన సోదరుడు పునీత్‌ రాజ్‌కుమార్ కల్మషం లేని వ్యక్తి. తన తండ్రి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం.''

        - రామ్‌ చరణ్‌

  • ''హృదయం బద్దలైంది. మమ్మల్ని వదిలి మీరు ఇంత త్వరగా వెళ్లిపోయారనే విషయాన్ని నమ్మలేకపోతున్నా.'' - జూనియర్‌ ఎన్టీఆర్‌.
  • ''అంత త్వరగా వెళ్లిపోయావా అప్పూ! ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నా హృదయం ముక్కలైంది. నా జీవితంలో ఇది 'బ్లాక్‌ ఫ్రైడే'.'' - ప్రకాశ్‌రాజ్‌.
  • ''హృదయం ముక్కలైంది... పునీత్‌ రాజ్‌కుమార్‌ అన్నా.''  -మంచు మనోజ్‌.
  • ''ఇది నిజం కాదు. పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నా. వారి ఆత్మకు శాంతి కలగానికి ప్రార్థిస్తున్నా.'' - మంచు లక్ష్మి.
  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను. వారి కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నా.'' - వరుణ్‌ తేజ్‌.
  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్తతో హృదయం పగిలింది. ఆయన లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా.'' - దర్శకుడు కె. ఎస్‌. రవీంద్ర (బాబీ).
  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ నటుడు. తన నటనతో కొన్ని లక్షల హృదయాల్ని గెలుచుకున్నారు. అలాంటి ఆయన మరణ వార్త షాక్‌కి గురిచేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.'' - బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌.
  • ''నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్‌ రాజ్‌కుమార్‌ ఒకరు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.'' - నటుడు రామ్‌ పోతినేని.
  • ''కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌గారి కుమారుడు, అద్భుతమైన అభినయం, చాతుర్యం ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇక లేరనే నిజం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా.'' - రచయిత పరుచూరి గోపాలకృష్ణ.
  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా.'' - పూజా హెగ్డే.
  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిని నమ్మలేక పోతున్నాను. పునీత్‌ నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. చిన్న వయసులోనే పునీత్‌ మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సుదీర్ఘకాలం సినిమాలు తీయాల్సి ఉంది. పునీత్‌ మృతిని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను'' -చరణ్‌రాజ్‌

నమ్మలేకపోతున్నా:డీకేఎస్‌

పునీత్‌ మరణించారన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నట్టు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ''రాజ్‌కుమార్‌ మంచి గాయకుడు కూడా. బాలనటుడిగా తెరంగ్రేట్రం చేసి గొప్ప హీరోగా ఎదిగారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. పవర్‌స్టార్‌ సినీ ప్రేమికులందరి హృదయాల్లో ఉంటారు''  అని పేర్కొన్నారు. పునీత్‌తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.

15:55 October 29

బాలకృష్ణ విచారం..

  • పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతి
  • పునీత్ మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయా: బాలకృష్ణ
  • పునీత్‌ మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టం: బాలకృష్ణ
  • బాలనటుడిగా పునీత్‌ సినీరంగ ప్రవేశం చేశారు: బాలకృష్ణ
  • తండ్రికి తగిన తనయుడిగా పునీత్‌ పేరొందారు: బాలకృష్ణ
  • పునీత్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: బాలకృష్ణ

15:55 October 29

చంద్రబాబు దిగ్భ్రాంతి..

  • పునీత్ హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
  • పునీత్ మృతి కన్నడ సినీ పరిశ్రమకు తీరనిలోటు: చంద్రబాబు
  • పునీత్‌ లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు: చంద్రబాబు
  • పునీత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: చంద్రబాబు
  • పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు

15:40 October 29

రాజకీయ ప్రముఖులు..

పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపట్ల రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్ధరామయ్య సహా పి.మురళీధర్‌రావు.. పునీత్​ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.  

పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం చంద్రబాబు, తెలుగుదేశం నేత లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. 

15:28 October 29

కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

షాక్‌కు గురయ్యా: సీఎం బొమ్మై

పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. పునీత్‌ ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. కన్నడిగుల అభిమాన హీరో అప్పూ మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పునీత్‌ ఇకలేరన్న బాధను తట్టుకొనే శక్తిని అభిమానులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో తెలిపారు. అంతకుముందు పునీత్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హఠాన్మరణం కలిచివేస్తోంది: యడియూరప్ప

పాపులర్‌ సినీ హీరో రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. చిన్న వయస్సులోనే మనందరినీ వదిలి వెళ్లిపోవడం కలిచివేస్తోందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పునీత్‌ నటించిన అనేక చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు.

  • ''హృదయం ముక్కలైంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంత త్వరగా మనల్ని వదలి వెళ్లారనే వార్త విస్మయానికి గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.''

              - చిరంజీవి

  • ''పునీత్‌ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ నటుడు. తన నటనతో కొన్ని లక్షల హృదయాల్ని గెలుచుకున్నారు. అలాంటి ఆయన మరణ వార్త షాక్‌కు గురిచేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.''

             - బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌.

  • ''నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్‌ రాజ్‌కుమార్‌ ఒకరు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.''

              - నటుడు రామ్‌ పోతినేని.

  • ''కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌గారి కుమారుడు, అద్భుతమైన అభినయం, చాతుర్యం ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇక లేరనే నిజం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా.''

              - రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

''పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా.''

        - పూజా హెగ్డే.

నమ్మలేకపోతున్నా: డీకేఎస్‌

పునీత్‌ మరణించారన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నట్టు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ''రాజ్‌కుమార్‌ మంచి గాయకుడు కూడా. బాలనటుడిగా తెరంగ్రేట్రం చేసి గొప్ప హీరోగా ఎదిగారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. పవర్‌స్టార్‌ సినీ ప్రేమికులందరి హృదయాల్లో ఉంటారు'' అని పేర్కొన్నారు. పునీత్‌తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.

15:25 October 29

క్రీడాప్రముఖులు..

  • పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపట్ల క్రీడా ప్రముఖుల దిగ్భ్రాంతి
  • పునీత్‌ మృతిపట్ల వెంకటేశ్‌ ప్రసాద్‌, సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లే  సంతాపం

15:25 October 29

సినీ ప్రముఖుల సంతాపం..

పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

పునీత్‌ మృతిపట్ల చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రానా, ప్రకాశ్​ రాజ్​, రాధిక విచారం వ్యక్తం చేశారు.  

హీరోలు సుధీర్‌బాబు, రామ్‌, అల్లరి నరేశ్‌, నారా రోహిత్‌, మంచు విష్ణు.. హీరోయిన్లు తమన్నా, రకుల్​ ప్రీత్​ సింగ్​, రాశీ ఖన్నా.. పునీత్​ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 

బాలీవుడ్​ ప్రముఖులు అభిషేక్​ బచ్చన్​, బోనీ కపూర్​, సోనూ సూద్​.. పునీత్​ మరణవార్త షాక్​కు గురిచేసిందన్నారు. 

15:24 October 29

నమ్మలేకపోతున్నా..

  • పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి నమ్మలేక పోతున్నా: చరణ్‌రాజ్‌
  • పునీత్‌ నాకు చాలా సన్నిహితంగా ఉంటారు: చరణ్‌రాజ్‌
  • చిన్న వయసులో పునీత్‌ మృతి జీర్ణించుకోలేకపోతున్నా: చరణ్‌రాజ్‌
  • పునీత్‌ సుదీర్ఘ కాలం సినిమాలు తీయాల్సి ఉంది: చరణ్‌రాజ్‌
  • పునీత్‌ కుటుంబానికి తట్టుకునే శక్తినివ్వాలని కోరుకుంటున్నా: చరణ్‌రాజ్‌

15:24 October 29

పునీత్ రాజ్‌కుమార్ మృతిపట్ల మహేశ్‌బాబు దిగ్భ్రాంతి

పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి సానుభూతి తెలిపిన మహేశ్‌ బాబు

15:12 October 29

ప్రకాశ్​రాజ్​ విచారం..

పునీత్ రాజ్‌కుమార్ మృతిపట్ల ప్రకాశ్‌రాజ్ దిగ్భ్రాంతి

పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి సానుభూతి తెలిపిన ప్రకాశ్‌రాజ్‌

15:09 October 29

సినీ ప్రముఖుల విచారం..

కన్నడ పవర్​స్టార్​ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పునీత్​ మరణవార్తతో గుండె పగిలినట్లయిందని, ప్రతి క్షణం మిస్​ అవుతానని అన్నారు సోనూసూద్​.

పునీత్​ మరణాన్ని నమ్మలేకపోతున్నట్లు ట్వీట్​ చేశారు నటి తమన్నా.

15:07 October 29

మోహన్​బాబు విచారం..

  • పునీత్ రాజ్‌కుమార్ మృతిపట్ల మోహన్‌బాబు దిగ్భ్రాంతి
  • పునీత్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మోహన్‌బాబు
  • పునీత్ మరణం యావత్‌ సినీపరిశ్రమకు తీరనిలోటు: మోహన్‌బాబు

15:03 October 29

  • Shocking ,devastating & heartbreaking! #PuneethRajkumar gone too soon. 💔
    Rest in Peace! My deepest sympathies and tearful condolences to the family. A huge loss to the Kannada / Indian film fraternity as a whole.Strength to all to cope with this tragic loss!

    — Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చిరంజీవి దిగ్భ్రాంతి..

పునీత్‌ రాజ్‌కుమార్ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

  • పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: చిరంజీవి
  • పునీత్‌ మృతి భారత, కన్నడ సినీ పరిశ్రమకు తీరనిలోటు: చిరంజీవి

14:54 October 29

లైవ్​ అప్​డేట్స్​: పునీత్​ రాజ్​కుమార్​ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్(46) కన్నుమూశారు. ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన పునీత్​ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. 

ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు చేస్తున్నారు. 

Last Updated :Oct 29, 2021, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.