ETV Bharat / sports

IND vs NZ T20: 'టీమ్​ఇండియాను ఆ వ్యూహంతో కట్టడి చేస్తా'

author img

By

Published : Oct 30, 2021, 7:41 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) జరగనున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్ బ్యాటర్లను కట్టడి చేయడమే తన లక్ష్యమని తెలిపాడు కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. ఇందుకోసం పాక్​ బౌలర్​ షహీన్​ అఫ్రిది టెక్నిక్​ను వినియోగిస్తానని చెప్పాడు.

boult
బౌల్ట్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు(IND vs NZ T20 clash). ఆదివారం(అక్టోబర్ 31) దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా బ్యాటర్లను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Boult News) తెలిపాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​లో టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్ బ్యాటర్లను షహీన్​షా అఫ్రిది(Shaheen Afridi vs India) కట్టడి చేసిన విధానాన్ని తాను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నాడు. అదే టెక్నిక్​ను ఆదివారం జరగనున్న మ్యాచ్​లోనూ తాను అనుసరిస్తానని తెలిపాడు.

"షహీన్ బౌలింగ్​ చేసిన విధానాన్ని బాగా గమనించాను. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రానున్న మ్యాచ్​లో నేను కూడా అదే తరహాలో బౌలింగ్​ చేయగలననిపిస్తోంది. టీమ్​ఇండియా జట్టులో మేటి బ్యాటర్లున్నారు. బౌలర్​గా నా ఫోకస్​ అంతా వారిని కట్టడి చేయడంపైనే ఉంటుంది."

--ట్రెంట్ బౌల్ట్, కివీస్ పేసర్.

టీమ్​ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం సహా వారి బ్యాటింగ్​ లైనప్​ను కట్టడి చేయడం ముఖ్యమని కివీస్​ పేసర్ బౌల్ట్ అభిప్రాయపడ్డాడు. భారత్​తో మ్యాచ్ సవాల్​గా ఉంటుందని, ఈ మ్యాచ్​ కోసం కివీస్​ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. గత మ్యాచ్​లో గాయపడ్డ గప్తిల్​ కూడా ఆడే అవకాశాలున్నాయని తెలిపాడు. ఇరు జట్లూ బలంగానే ఉన్నాయని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలుత భారత్​పై ఘన విజయం సాధించిన పాక్(IND vs PAK T20 Match), రెండో మ్యాచ్​లో న్యూజిలాండ్​ను(PAK vs NZ T20) ఓడించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్​ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఈ పోరులో గెలిచిన వాళ్లకే సెమీస్​ అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి:

భారత్​ X న్యూజిలాండ్: గెలిచిన జట్టుకే సెమీస్​ ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.