ETV Bharat / sports

AFG vs PAK T20: అభిమానుల తీరుపై అఫ్గాన్​ కెప్టెన్​ అసహనం

author img

By

Published : Oct 30, 2021, 3:34 PM IST

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో(AFG vs PAK T20) అఫ్గాన్​ అభిమానులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు ఆ దేశ జట్టు కెప్టెన్ మహ్మద్ నబి(mohammad nabi news). టిక్కెట్టు లేకుండా మైదానంలోకి ప్రవేశించడాన్ని తప్పుపట్టాడు. దీనిపై విచారణ చేపట్టాలని ఐసీసీ ఆదేశించింది.

afg vs pak
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌(AFG vs PAK T20 Match) మధ్య శుక్రవారం(అక్టోబర్​ 29) రాత్రి జరిగిన మ్యాచ్‌లో వేలాది మంది అఫ్గాన్‌ అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియానికి తరలిరావడంపై ఆ జట్టు కెప్టెన్‌ మహ్మద్‌ నబి(mohammad nabi news) అసహనం వ్యక్తం చేశాడు. మరోసారి ఇలా చేయొద్దని అభిమానులను కోరాడు. మరోవైపు ఈ విషయంపై ఐసీసీ విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డును (ఈసీబీ)(Emirates Cricket Board) కోరింది.

దుబాయ్‌ వేదికగా గతరాత్రి జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు అఫ్గాన్‌కు చెందిన వేలాది మంది అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియం వద్దకు తరలివచ్చారు. వారంతా బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన దుబాయ్‌ పోలీసులు బలగాల్ని మోహరించి అక్కడున్న వారిని చెదరగొట్టారు. స్టేడియంలో ఉన్న ఆటగాళ్లు, ఇతరుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో స్టేడియంలోని అన్ని గేట్లు మూసేసి ఎవరినీ అనుమతించలేదు.

అయితే, కొందరు అభిమానులు టికెట్లు కొనుగోలు చేసినా మైదానంలోనికి అనుమతించలేదు. ఈ విషయం ఐసీసీ దృష్టికి చేరడం వల్ల సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఈసీబీని ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం 16 వేలకు పైగా టికెట్లు కేటాయించామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక టికెట్లు కొనుగోలు చేసినా మ్యాచ్‌కు అనుమతించని వారికి ఐసీసీ, ఈసీబీతో సహా బీసీసీఐ బోర్డులు క్షమాపణలు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ తమ అభిమానులు ఎవరైనా టికెట్లు కొనుగోలు చేసి మాత్రమే స్టేడియానికి రావాలని కోరాడు. ఇలా చేయడం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 147/6 స్కోర్‌ చేయగా.. పాకిస్థాన్ 19 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చదవండి:

PAK vs AFG T20: అయ్యో.. టికెట్ కొన్నోళ్లకే ప్రవేశం లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.