ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

author img

By

Published : Dec 19, 2021, 5:59 AM IST

Updated : Dec 19, 2021, 9:50 PM IST

top news in telangana today
ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

21:38 December 19

టాప్​ న్యూస్​ @10PM

  • ఆ సీఎం మారనున్నారా?

Karnataka CM Emotional: కర్ణాటకలో ముఖ్యమంత్రి మారనున్నారా? సీఎంగా బసవరాజ్​ బొమ్మై స్థానంలో మరో నేతను భాజపా నియమించనుందా? 'ఈ ప్రపంచంలో పదవులు, అధికారులు ఏదీ శాశ్వతం కాదు' అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆదివారం వ్యాఖ్యానించడం ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

  • 'అన్నదాత ఆత్మహత్యలకు కేసీఆరే కారణం'

YS Sharmila on CM KCR: పండించిన పంటలను ప్రభుత్వం కొనకపోవడం, యాసంగిలో వరి వేయెద్దని చెప్పడం, రుణాలు మాఫీ చేయకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్​ షర్మిల అన్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊసరవెళ్లిలా మాటలు మారుస్తున్నారని.. ఒకసారి సన్న బియ్యం వేయాలని, ఇంకోసారి అసలు వరి వేసుకోవద్దని, మరోసారి ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని చెబుతున్నారని ధ్వజమెత్తారు.

  • ఆ రాష్ట్రాలకు దిల్లీ నుంచి భాజపా టీమ్స్

Bjp Up Election: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 150 మందికి పైగా దిల్లీకి చెందిన సీనియర్​ నేతలను ఈ రెండు రాష్ట్రాలకు పంపించింది. మరోవైపు.. ఉత్తర్​ప్రదేశ్​లో 'జన్ విశ్వాస్ యాత్ర', ఉత్తరాఖండ్​లో 'విజయ్ సంకల్ప్​ యాత్ర'కు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది.

  • బ్రిటన్​లో ఒక్కరోజే 10వేల మందికి ఒమిక్రాన్​

Britain Omicron Cases: బ్రిటన్​లో ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభిస్తోంది. శుక్రవారంతో పోల్చితే.. శనివారం మూడు రెట్లు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇరాన్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

'ఆలియా నా లైఫ్​లో లక్ష్మిబాంబు'

Bigg boss finale: బాలీవుడ్​ హీరో రణ్​బీర్ కపూర్, ఆలియా భట్​ గురించి వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఎనర్జీతో లక్ష్మిబాంబులా ఉంటుందని అన్నారు. వీరద్దరూ కలిసి నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

20:52 December 19

టాప్​న్యూస్ @ 9 PM

  • 'పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యం కావాలి'

పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నల్సార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

  • తొలి 'గే' మ్యారేజ్

తెలంగాణ‌లో ఘనంగా తొలి గే మ్యారేజ్ జరిగింది. దీనికి హైదరాబాద్​ వేదికైంది. 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఇద్దరు పురుషులు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్లు హాజరై గే జంటను ఆశీర్వదించారు.

  • ఆ రాష్ట్రాలకు దిల్లీ నుంచి భాజపా టీమ్స్​

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 150 మందికి పైగా దిల్లీకి చెందిన సీనియర్​ నేతలను ఈ రెండు రాష్ట్రాలకు పంపించింది.

  • ఈ రోబో 200 రకాల వంటలు చేయగలదు!

ఇంట్లో వంట చేసుకునే తీరిక లేదా? బయటి ఫుడ్​ తింటే అనారోగ్యానికి గురవుతామని భయపడుతున్నారా? అయితే.. మీ సమస్యకు చక్కటి పరిష్కారం ఈ 'నోష్​' రోబో. మీకు నచ్చిన వంటకం, నచ్చిన రుచితో చిటికెలో సిద్ధం చేసేస్తుంది. 200కుపైగా వెరైటీలు వండగలగడం ఈ నోష్​ ప్రత్యేకత.

  • ఓడినా రికార్డే..

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్స్​ ఫైనల్లో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్​ ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్​లో రజతం సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

19:50 December 19

టాప్​న్యూస్ @ 8 PM

  • 'సీఎం కేసీఆరే దాడి చేయాలనటం దారుణం..'

మెదక్​లో పర్యటించిన హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సీఎం కేసీఆర్​ వైఖరిపై మండిపడ్డారు. తన అసమర్థతను, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

  • ఒక్క నిమిషంలో ఇన్ని చేస్తున్నారా?

కరోనా వేళ ఫోన్లు, స్మార్ట్​టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోయిన ప్రజలు.. ఇంటర్నెట్​ను మహాజోరుగా వాడేశారు. కాలక్షేపం కోసం సామాజిక మాధ్యమాల నుంచి ఓటీటీల్లో వీడియో స్ట్రీమింగ్​ వరకు దేన్నీ వదలకుండా నెట్టింట్లో గడిపారు! అయితే ఒక నిమిషం వ్యవధిలో ఇంటర్నెట్​లో ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ఓసారి చూద్దాం..

  • వచ్చే త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఐపీఓ!

ఎల్​ఐసీ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే సూచనలు కనిపించడం లేదని వచ్చిన వార్తల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. వచ్చే త్రైమాసికంలో సంస్థ పబ్లిక్‌ ఇష్యూను ప్రారంభించేందుకు చేస్తున్న ప్రణాళికలు కొనసాగుతున్నాయని తెలిపింది.

  • భారత అండర్-19 కెప్టెన్ గా యశ్ ధుల్

ఐసీసీ అండర్​-19 పురుషుల క్రికెట్​ వరల్డ్​ కప్​కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆటగాళ్ల జాబితాను పోస్టు చేసింది. యశ్ ధుల్​ను కెప్టెన్​గా ఎంపిక చేశారు.

  • ఆ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి

నటి, నిర్మాత మంచు లక్ష్మి.. ఇటీవల పోస్ట్​ చేసిన కొన్ని ఫొటోలు వైరల్​గా మారాయి. అందులో ఆమె గాయాలతో ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు ఆ విషయమై లక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

18:51 December 19

టాప్​న్యూస్ @ 7 PM

  • 'వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు సరైంది కాదు'

వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఏడు శాతం పెంచుతూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్​ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్‌కు లేఖ రాశారు.

  • 'పటేల్ జీవించి ఉంటే ముందుగానే గోవాకు స్వాతంత్య్రం'

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ మరికొద్దికాలం జీవించి ఉంటే గోవాకు ముందే స్వాతంత్య్రం వచ్చేదని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. పోర్చుగల్‌ పాలనలో ఏళ్లపాటు మగ్గినా.. గోవా తన భారతీయతను కోల్పోలేదన్నారు.

  • ఛార్జీలు చెల్లించాల్సిందే!

బ్యాంకులో ఇకపై డిపాజిట్​ చేయాలన్నా రుసుము చెల్లించక తప్పదు. ఈ మేరకు ఇండియా పోస్ట్​ పేమెంట్స్​ బ్యాంకు(ఐపీపీబీ) తమ నిబంధనలు సవరించింది. నిర్దేశిత పరిమితి దాటి డిపాజిట్​ చేస్తే ఛార్జీలు వసూలు చేయనుంది.

  • పాకిస్థాన్​కు ఆడిన సచిన్

టీమ్ఇండియా క్రికెట్ పేరు వింటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు సచిన్ తెందూల్కర్. తన ఆటతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అలాంటి మాస్టర్​.. మన దేశం కంటే ముందు పాకిస్థాన్ తరఫున ఆడాడంటే నమ్మగలరా?

  • 'బంగార్రాజు' మాస్ సాంగ్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో బంగార్రాజు, గాడ్సే, అతిధి దేవోభవ, అఖండ చిత్రాలతోపాటు బిపాస బసుకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి.

17:54 December 19

టాప్​న్యూస్ @ 6 PM

  • అడ్డొస్తున్నాయని నరికేయకుండా..

మొక్కలు నాటటం.. వాటిని సంరక్షించటం వరకు చాలా బాగుంది. కానీ.. అభివృద్ధి పేరిట.. విస్తరణ పేరిట.. అడ్డొచ్చిన వృక్షాలను మాత్రం అడ్డంగా నరికేస్తున్నారు. ఏళ్ల నుంచి ఏపుగా పెరిగి ఎంతో మందికి నీడనిచ్చి.. ప్రాణవాయువునిస్తున్న వృక్షాలను నిర్వీర్యం చేయకుండా.. కొందరు పర్యావరణ ప్రేమికులు పాటుపడుతున్నారు.

  • ముళ్ల కంపపై దొర్లుతూ సోదరికి వీడ్కోలు​!

ఆ ఊరిలో కొంతమంది ప్రజలు ముళ్ల కంపపై పడుకుని దొర్లుతున్నారు. అనంతరం వారు తమ సోదరిని అత్తారింటికి సాగనంపుతున్నారు. ఈ వింత ఆచారాన్ని వాళ్లు గత యాభై తరాలుగా పాటిస్తున్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు? ఇలా చేయడం వెనుక కారణమేంటి?

  • ఈవీ మార్కెట్​లోకి 'టొయోటా'

జపాన్​కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా.. 30 రకాల ఎలక్ట్రిక్​ కార్లను మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అందులో ఎస్​యూవీ, క్రాస్​ఓవర్స్​, కాన్సెప్ట్స్​, స్పోర్ట్​ కార్స్​, పికప్​ ట్రక్కులు వంటివి ఉన్నాయి. మరి మార్కెట్లోకి ఎప్పుడొస్తాయి?

  • జపాన్​ను చిత్తుగా ఓడించిన భారత్​

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ​లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో జపాన్​పై 6-0తో క్లీన్​స్వీప్​ చేసింది.

  • ఆ సాంగ్​కోసం సమంతను ఎలా ఒప్పించారంటే?

ఇప్పటివరకు హీరోయిన్​ చేసిన సమంత.. తొలిసారి 'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్.. ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పాట ఆమె చేయడానికి ఒకే ఒక కారణం డైరెక్టర్ సుకుమార్. ఇంతకీ అతడు ఏం చెప్పి ఒప్పించాడంటే?

16:51 December 19

టాప్​న్యూస్ @ 5 PM

  • డ్రంకెన్​ డ్రైవింగ్​.. ప్రాణాలపై లేదు కేరింగ్​..

వద్దని వారించినా వినరు..! పదేపదే అదే తప్పు చేస్తారు. కౌన్సిలింగ్‌లు, జరిమానాలు ఏవీ లెక్క చేయరు. చివరకు ఎవరో ఒకరి ప్రాణాలు తీసి...ఊచలు లెక్కబెడతారు. రాత్రివేళల్లో రోడ్లపై మందు బాబుల తీరు ఇది. ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు.

  • 145కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కు పెరిగింది. తాజాగా గుజరాత్​లో మరో ఇద్దరికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది.

  • క్లూ ఇచ్చినా కనుక్కోలేకపోయారు..!

కరోనా కాలంలో విద్యార్థులకు వినూత్నంగా, ఆసక్తికరంగా బోధించాలనుకున్నారు ఓ ప్రొఫెసర్​. ఈ క్రమంలోనే వారికి తెలియకుండానే.. ఓ టెస్ట్​ పెట్టారు. మ్యూజిక్​ సెమినార్​ సిలబస్​లో ఓ క్యాష్​ ప్రైజ్​కు సంబంధించి క్లూలు ఉంచారు. తీరా చూస్తే.. ఏ ఒక్క విద్యార్థి కూడా నగదును సొంతం చేసుకోలేకపోయారు. ఆ సిలబస్​లో 3 పేజీలే ఉండటం గమనార్హం. అసలు సంగతేంటంటే?

  • 'దక్షిణాఫ్రికా టూర్​లో టీమ్​ఇండియా బలం వాళ్లే..'

టీమ్​ఇండియా బౌలింగ్ విభాగంపై ధీమా వ్యక్తం చేశాడు సీనియర్​ ఆటగాడు చెతేశ్వర్​ పుజారా. సౌతాఫ్రికాతో జరగబోయే ప్రతి టెస్టు మ్యాచ్​లోనూ ఫాస్ట్ బౌలింగ్​ యూనిట్ 20 వికెట్లు తీయగలదని విశ్వాసం వ్యక్తం చేశాడు.

  • 'ఆచార్య' రిలీజ్ వాయిదా?

చిరు 'ఆచార్య' వాయిదా అంటూ వస్తున్న వార్తలపై నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ స్పందించింది. చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.

15:36 December 19

టాప్​న్యూస్ @ 4 PM

  • కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్‌సీ లేఖ

కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్‌ మరోసారి లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో పేర్కొన్న రెండు అంశాలను ఒక్కటిగా పొందుపరచాలని లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్‌లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండో కాంపోనెంట్‌ను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచినట్లుగా చూపించడం తప్పని లేఖలో పేర్కొన్నారు.

  • సూట్​కేస్​లో రూ.15కోట్ల డ్రగ్స్​తో దర్జాగా మహిళ జర్నీ

విదేశాల నుంచి భారత్​కు మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళను విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 2 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.15 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

  • 'విగ్రహం అపవిత్రం' కేసులో ఏడుగురు అరెస్ట్​

బెంగళూరులో విగ్రహాన్ని అపవిత్రం చేశారన్న కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్​ చేశారు పోలీసులు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసిన వీడియో ఆధారంగా వారిని పట్టుకున్నట్లు చెప్పారు. మరోవైపు.. బెళగావిలో విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ చేపట్టి బైక్​ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు పదుల సంఖ్యలో కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

  • చలికాలంలోనే అత్యంత చల్లటి రాత్రి

చలికాలంతో ఉత్తర భారతం వణికిపోతోంది. జమ్ముకశ్మీర్​లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో.. ఈ చలికాలంలోనే అత్యంత తక్కువగా మైనస్‌ 6.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది

  • 'శ్యామ్​ సింగ రాయ్' సెన్సార్ పూర్తి

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్', సత్యదేవ్ నటిస్తున్న 'గాడ్సే', శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'అర్జున ఫల్గుణ' చిత్రాల వివరాలు ఉన్నాయి.

14:36 December 19

టాప్​న్యూస్ @ 3 PM

  • 'సీఎం ప్రెస్​మీట్​ వినాలంటే ప్రజలు భయపడే పరిస్థితి'

కేంద్రంపై తెరాస విష ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్... హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు.

  • రైతు వేదిక ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

నారాయణపేట జిల్లా బైరంకొండ రైతువేదిక ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకులు, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.

  • పీటీ ఉషపై '420' కేసు

పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. తనను పీటీ ఉష మోసం చేశారని మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • ఫైరింగ్ ప్రాక్టీస్​లో​ అపశ్రుతి

రాజస్థాన్​లోని బీఎస్​ఎఫ్​ ఫైరింగ్​ రేంజ్​లో ఓ మోర్టార్​ షెల్​ పేలిన ఘటనలో ఓ జవాను మరణించారు. మరో 8మంది గాయపడ్డారు. పేలుడు సమయంలో వీరందరూ ఫైరింగ్ సాధన చేస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

  • బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలే

బిగ్​బాస్​ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కాగా, ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథులుగా పలువురు హీరోహీరోయిన్లు , డైరెక్టర్లు విచ్చేశారు.

13:58 December 19

టాప్​న్యూస్ @ 2 PM

  • కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం: జస్టిస్‌ ఎన్వీ రమణ

CJI N.V. RAMANA in Hanamkonda: రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తోందని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయాన్ని జస్టిస్​ ప్రారంభించారు. కాకతీయుల చారిత్రక సంపదకు దీటుగా కోర్టు భవనాల నిర్మాణం జరిగిందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా వరంగల్​తో తనకున్న అనుబంధాన్ని సీజేఐ గుర్తు చేసుకున్నారు.

  • అండమాన్‌ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్‌

100 percent vaccination: కరోనా టీకా పంపిణీలో అండమాన్​ నికోబార్​ దీవులు కీలక మైలురాయిని చేరుకున్నాయి. అర్హులైనవారందరికీ ​రెండు డోసుల కొవిడ్​ టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం కొవిషీల్డ్​ టీకానే అందించి ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నారు.

  • జిమ్​లో.. డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా 'ఫైట్'​

Fighting in gym: గాజియాబాద్​లోని ఓ జిమ్​లో డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా ఫైట్​ జరిగింది. బయట నుంచి జిమ్​లోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు.. ఓ వ్యక్తిపై దాడి చేశారు. పైకి ఎత్తి కుదిపేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడు గాయపడ్డారు. గతంలో వ్యాయామశాలలో వారి మధ్య జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • రైతు వేదిక ప్రారంభోత్సవంలో ప్రధాని చిత్రంపై రగడ

Tension at the rythu vedika inauguration : నారాయణపేట జిల్లా బైరంకొండ రైతువేదిక ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకులు, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.

  • కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి

Sai Pallavi Crying: సినీ నటి సాయి పల్లవి స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో భావోద్వేగానికి గురయ్యారు. తనని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు.

12:57 December 19

టాప్​న్యూస్ @ 1 PM

  • 'రావత్ చాపర్ క్రాష్'​లో విశేష సేవలు

కూనూర్ హెలికాప్టర్ దుర్ఘటన సహా ఎన్నో ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో సహాయక చర్యలు అందించిన స్థానిక అగ్నిమాపక సిబ్బంది.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాల్లో సదుపాయాలతో పాటు కనీసం టాయిలెట్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు.

  • హనుమకొండలో కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ

CJI Inaugurated Hanamkonda court Complex: హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ.రమణ ప్రారంభించారు. సీనియర్‌ సివిల్‌ కోర్టు హాలును... పోక్సో కోర్టుగా మార్పులు చేశారు. లైంగిక దాడుల కేసుల్లో విచారణకు వచ్చేవారు కనపడకుండా ఏర్పాట్లు చేశారు.

  • సౌర విద్యుత్​ వినియోగం దిశగా తెలంగాణ

Governor tamisai at TSECA: హైదరాబాద్​లో తెలంగాణ ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్​ తమిళిసై.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపులో ప్రగతి సాధించిన సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. సౌర విద్యుత్​ వినియోగం దిశగా రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించిందని.. అందుకే ప్రభుత్వంపై ఇంధన భారం తగ్గిందని గవర్నర్​ స్పష్టం చేశారు.

  • యాషెస్ సిరీస్​లో మరోసారి కరోనా కలకలం

Ashes 2021 Corona: యాషెస్ సిరీస్​లో భాగంగా అడిలైడ్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్​ కోసం పనిచేస్తున్న బ్రాడ్​కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలడం ఆటగాళ్లను కలవరపెడుతోంది.

  • 'పుష్ప' కలెక్షన్స్​ చూస్తే పూనకాలే

Pushpa Day2 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో దుమ్ములేపుతున్నారు. కలెక్షన్ల విషయంలోనూ తగ్గేదే.. లే అంటున్నారు. తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాకు రెండో రోజూ మంచి వసూళ్లే వచ్చాయి.

11:52 December 19

టాప్​న్యూస్ @ 12PM

  • వరి సాగుకే రైతన్నల మొగ్గు

Paddy Cultivation in Jagtial: ఈ యాసంగిలో వరి సాగు వద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెప్పినా... జగిత్యాల జిల్లాలో రైతులు ఆ పంటవైపే మొగ్గుచూపుతున్నారు. నువ్వు పంట తప్ప మిగతా పంటలకు సమయం దాటిపోవటంతో.. వరి సాగులో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా నార్లు పోస్తూ పొలాల్ని చదును చేస్తున్నారు.

  • 12 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య

Alappuzha politicians killing: కేరళలోని అలప్పుజలో ఇద్దరు రాజకీయ నాయకులు 12 గంటల వ్యవధిలో హత్యకు గురయ్యారు. తొలుత ఎస్​డీపీఐ నేతను కొందరు దుండగులు హత్య చేశారు. దీని వెనక ఆరెస్సెస్ హస్తం ఉందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆగంతుకులు ఇంట్లోకి చొరబడి భాజపా నేతను చంపేశారు.

  • నవజాత శిశువుకు వీధి శునకం రక్షణ

ఓ కర్కశ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే.. వీధి శునకమే తల్లిగా మారింది. తన బిడ్డలతో పాటే రాత్రంతా కాపలా కాసింది. ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలిచింది. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ ముంగెలీ జిల్లాలో జరిగింది.

  • ఇంగ్లాండ్​కు షాక్

Ashes 2021 Joe Root: యాషెస్ సిరీస్​లో ఇంగ్లాండ్ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే తొలి టెస్టు ఓటమితో ఇబ్బందుల్లో పడిన ఈ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టు నాలుగో రోజు గాయం కారణంగా ఈ జట్టు కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్​కు దిగలేదు.

  • బాలయ్యతో రవితేజ

Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్​ షోలో సందడి చేశారు మాస్​మాహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

10:50 December 19

టాప్​న్యూస్ @ 11M

  • లారీ-బొలెరో ఢీ..

Hanamkonda Accident Today : హనుమకొండ జిల్లా పంతిని వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై లారీ-బొలెరో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • లకారం పర్యాటకానికి సరికొత్త సొబగులు..

Lakaram Tank Bund : ఖమ్మం సిగలో కలికితురాయిగా ఉన్న లకారం ట్యాంక్ బండ్​పై తీగల వంతెన రూపంలో మరో అదనపు హంగు చేకూరింది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న లకారం ట్యాంక్ బండ్ సందర్శకులకు మధురానుభూతులు పంచేందుకు సిద్ధమవుతోంది. రూ.8 కోట్లతో నిర్మించిన తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది.

'భారత్​ నుంచి 90 దేశాలకు వ్యాక్సిన్లు'

India-Central Asia Dialogue 2021: కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని 90 దేశాలకు భారత్​ వ్యాక్సిన్లు పంపించినట్లు చెప్పారు భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. దిల్లీలో జరుగుతోన్న 3వ భారత్​- సెంట్రల్​ ఆసియా సదస్సులో భాగంగా వైరస్​పై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

  • రోహిత్​ కెప్టెన్సీకి కోహ్లీ ఫుల్ సపోర్ట్

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్‌ శర్మకు.. టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మద్దతు ప్రకటించడం పట్ల పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ సల్మాన్‌ బట్ సంతోషం వ్యక్తం చేశాడు.

  • 'పోలీస్​ స్టోరీ'కి 25 ఏళ్లు!

Police Story Movie: 'పోలీస్​ స్టోరీ' సినిమాలోని 'చట్టానికి, న్యాయానికి, ధర్మానికి..' డైలాగ్​ సాయికుమార్​కు మంచి పేరుతెచ్చిపెట్టింది. ఈ సినిమా తెలుగులో విడుదలై నేటితో 25 ఏళ్ల గడిచింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం..

09:56 December 19

టాప్​న్యూస్ @ 10AM

  • భారత్ @ 7వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. 24 గంటల వ్యవధిలో 7,081 కేసులు నమోదయ్యాయి. మరో 264 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,469మంది కోలుకున్నారు.

  • భద్రకాళీ సేవలో సీజేఐ దంపతులు

CJI at Bhadrakali Temple : వరంగల్‌ శ్రీ భద్రకాళీ అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషు.. సీజేఐ దంపతులకు ఆలయ విశిష్టతను తెలియజేశారు.

  • వ్యాక్సిన్ తీసుకోగానే వృద్ధురాలికి పూనకం

Corona Vaccine to Old Woman : సాధారణంగా కొంతమందికి దేవుని ఆలయాల్లోనూ, జాతరలోనూ పూనకం వస్తూ ఉంటుంది. అయితే ఓ మహిళకు కొవిడ్​ వ్యాక్సిన్ తీసుకోగానే పూనకం వచ్చింది. వింతగా ఉంది కదా.. అదెక్కడో చూద్దాం..

  • పిల్ల కొండముచ్చు కోసం తల్లి విలవిల

Baby langur Died: ఉత్తరాఖండ్​ గోపేశ్వర్​లో.. ఓ పిల్ల కొండముచ్చు మరణంపై ఓ తల్లి స్పందించిన తీరు కంటతడి పెట్టిస్తోంది. అనుకోకుండా ట్రాన్స్​ఫార్మర్​పై చనిపోయి పడి ఉన్న తన బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లి అక్కడక్కడే తిరుగుతూ ఉండటం ఓ వీడియోలో కనిపించింది. చివరకు కరెంట్ నిలిచిపోయిన సమయంలో పైకి వెళ్లి నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను గుండెలకు హత్తుకుని పరిగెత్తింది. ఈ బాధాకర సన్నివేశాన్ని చూసి స్థానికులు సైతం కంటతడిపెట్టారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర రూ.50వేల ఎగువన కొనసాగుతోంది. వెండి ధర కిలోకు రూ.63వేలు దాటింది.

08:55 December 19

టాప్​న్యూస్ @ 9AM

  • ఆత్మాభిమానమే ముఖ్యం

ఇక్కడున్న ఆంగ్లేయ కలెక్టర్‌కే ఎక్కడలేని రాచమర్యాదలు సాగుతుంటే.. ఇక ఇంగ్లాండ్‌ నుంచి ఏకంగా రారాజే వస్తే ఎలా ఉంటుంది? ఎంత హంగామా ఉంటుంది? అలా ఊహించుకునే 1921లో భారత్‌లో అడుగుపెట్టిన ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌.. ఎడ్వర్డ్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. నిర్మానుష్యమైన వీధులు.. నిరసనలు, హర్తాళ్‌లు, దాడులతో కూడిన వాతావరణం ఆహ్వానం పలికింది. పర్యటనంతా అవమానకరంగా ముగిసింది.

  • పులుల గణనకు పక్కా ఏర్పాట్లు

Tiger Estimation : పులుల గణన కోసం ఈసారి వెయ్యికి పైగా కెమెరాలను వినియోగిస్తున్నారు. మరింత కచ్చితత్వంతో పులులను గణించేలా ఈ దఫా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 300 జతలు, కవ్వాల్‌, సహా మిగతాచోట్ల 200-250 జతల సెన్సార్లు ఉన్న కెమెరాలను అమరుస్తున్నారు.

  • కృష్ణ ఎల్లకు అమిటీ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌

Krishna Ella Amity: వ్యాక్సిన్‌ రంగంలో విశేష కృషికి గుర్తింపుగా భారత్​ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది అమిటీ యూనివర్సిటీ. నోయిడా క్యాంపస్​లో జరిగిన స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్​ను అందించింది.

  • 2022లో స్థిరాస్తి, బ్యాంకులు రాణిస్తాయ్‌

Anshul Saigal kotak: వచ్చే ఏడాది స్థిరాస్తి, బ్యాంకింగ్ రంగాలు రాణిస్తాయని కోటక్ మహీంద్రా ఏఎంసీ పోర్ట్​ఫోలియో మేనేజర్ అన్షుల్ సైగల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిలో 10 శాతం అటూ, ఇటుగా కదలాడే అవకాశం ఉందని చెప్పారు. ఒమిక్రాన్‌ ఆందోళనలు మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతాయో తెలియాల్సి ఉందన్నారు.

  • చరిత్రకు అడుగు దూరంలో శ్రీకాంత్

World Badminton Championship: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్​లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంతో ఉన్నాడు భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్. ఇప్పటివరకు ఈ టోర్నీలో పీవీ సింధు మాత్రమే బంగారు పతకం గెలిచింది. ఆదివారం జరగబోయే ఫైనల్​లో గెలిస్తే శ్రీకాంత్ ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.

07:37 December 19

టాప్​న్యూస్ @ 8AM

  • జస్టిస్‌ జీటీ నానావతి కన్నుమూత

గోధ్రా అల్లర్లు, 1984 సిక్కు వ్యతిరేక హింస కేసులను విచారించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జీటీ నానావతి(86) మరణించారు. ఆయన శనివారం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇంటర్‌ ఫలితాలపై సీఎంవో స్పందన

Telangana CMO on Inter results : ఇంటర్‌ ఫలితాలు.. తదనంతర పరిణామాలపై సీఎం కార్యాలయం ఆరా తీస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని విధానాలపై సమాచారం సేకరిస్తూ.. అధికారులతో సమాలోచనలు జరుపుతోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • దళితబంధు అమలయ్యే దాకా వడ్డీ చెల్లింపు

Interest on Dalit Bandhu Funds : దళిత బంధు యూనిట్లు మంజూరయ్యే వరకూ ఆయా ఖాతాల్లోని నగదుపై వడ్డీ జమకానుంది. మూడు నెలల క్రితం నిధులు జమచేసినందున ఒక్కో లబ్ధిదారుకు కనీసం రూ.8-9వేల వరకు వడ్డీ రూపంలో అందే అవకాశం ఉంది.

  • ఐటీ కంపెనీలు తగ్గేదేలే

ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఐటీ కంపెనీల ఆదాయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచే పని విధానం అమలు అవుతుండటం వల్ల ఖర్చులు తగ్గడం కూడా వీటికి కలిసొస్తోంది. నియామకాల విషయంలోనూ సంస్థలు జోరు కనబరుస్తున్నాయి. దేశీయంగా యువ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ రంగం ముందుస్థానంలో నిలుస్తోంది.

  • 'పుష్ప' శక్తిమంతం

Pushpa Movie Director: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సందడి అస్సలు తగ్గట్లేదు. థియేటర్​ల్లో, సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు దర్శకుడు సుకుమార్.

06:46 December 19

టాప్​న్యూస్ @ 7AM

  • మరో 100 రోజుల్లో యాదాద్రి ఉద్ఘాటన

Yadadri Temple Reopening : యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి మూలవరుల దర్శన భాగ్యం మరో వంద రోజుల్లో దక్కనుంది. పంచనారసింహుల పుణ్యక్షేత్రంలోని పనులు చకాచకా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ వచ్చే ఏడాది మార్చి 28న చేపట్టాలని చినజీయర్‌ స్వామి ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

  • ప్రజా ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్ష

Parliament panel news: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యల మీద వచ్చే వార్తా కథనాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. ప్రజా ఫిర్యాదులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లను క్రోడీకరించి, అవి సరైన విభాగానికే వెళ్లేలా చూడాలంది.

  • గ్యాంగ్​రేప్​ కేసులో 13మందికి 20 ఏళ్ల జైలు శిక్ష

Gang Rape case Rajasthan: బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో రాజస్థాన్​లోని కోటా కోర్టు​ కీలక తీర్పునిచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 16 మందికి శిక్షను ఖరారు చేసింది. వారిలో 13 మందికి 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది.

  • కోహ్లీ గురించి గంగూలీ?

Sourav Ganguly Comment on Virat Kohli: విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి వైఖరి అంటే తనకు ఇష్టమని అన్నాడు. కానీ ఈ మధ్యే విరాట్​ చిక్కుల్లో పడుతున్నాడని చెప్పాడు.

  • కృతిశెట్టితో నాని రొమాన్స్

'శ్యామ్ సింగరాయ్' సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో చిత్రబృందం బిజీగా మారింది. ఇందులో భాగంగానే హీరో నాని.. హీరోయిన్లు సాయిపల్లవి, కృతిశెట్టి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటో మీరు చూసేయండి.

03:46 December 19

టాప్​న్యూస్ @ 6AM

  • అందరి చూపు ఐఏఎంసీ వైపే

దేశ విదేశాల చూపు హైదరాబాద్‌ ఐఏఎంసీ వైపే ఉంటుందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్​లోని నానక్‌రాంగూడలోని ఫీనిక్స్‌ వీకే టవర్స్‌లోని ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సీజేఐ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల(ఏడీఆర్‌) ధోరణి పెరగడానికి ఈ కేంద్రం ముందడుగు వేస్తుందని చెప్పారు.

  • రెండోరోజు సీజేఐ పర్యటన

CJI NV Ramana tour:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ వరంగల్ పర్యటన కొనసాగుతోంది. నిన్న రామప్ప ఆలయాన్ని సందర్శించిన సీజేఐ.. ఇవాళ హనుమకొండలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలను ప్రారంభిస్తారు. అంతకముందు వరంగల్వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు.

  • 'అరుదైన చారిత్రక కట్టడం'

CJI justice NV Ramana visits ramappa: ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

  • రాష్ట్రంలో మరో 12 కేసులు

Telangana Omicron Cases: రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. రిస్క్‌ దేశాల నుంచి నలుగురిలో ఒమిక్రాన్ వేరింయట్​ను గుర్తించారు

  • అన్నదాతల ఖాతాల్లో నగదు జమ

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం పునరుద్ఘాటించారు. కేంద్ర వైఖరిని రైతులకు అర్థమయ్యేలా చెప్పడమే కాక ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా అన్నదాతలను మళ్లించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు

  • ఈ ఏడాదే దళితబంధు అమలు

CM meet with Collectors: రాష్ట్రంలో దళితబంధు పథకం అమలు వేగవంతం కానుంది. పైలట్ ప్రాజెక్టుతో పాటు అన్ని నియోజకవర్గాల్లో వంద చొప్పున కుటుంబాలకు.. ఈ ఆర్థికసంవత్సరంలోనే అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది.

  • కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం

RevanthReddy On CM Kcr: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

  • షర్మిల రైతు ఆవేదన యాత్ర

YS Sharmila Padayatra: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇవాళ రైతు ఆవేదన యాత్ర చేపట్టబోతున్నారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయం నుంచి నుంచే యాత్ర ప్రారంభించనున్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఆవేదనకు గురిచేసిందని షర్మిల పేర్కొన్నారు.

  • స్వర్ణదేవాలయంలో అగంతకుడు

Golden Temple Death: పంజాబ్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ యువకుడిపై దాడి చేశారు కొందరు భక్తులు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు అమృత్​సర్ డీసీపీ పరమీందర్ సింగ్ బందాల్​ తెలిపారు.

  • కిడాంబి శ్రీకాంత్​ రికార్డ్

World Badminton Championship 2021: స్పెయిన్​ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్​ రికార్డు సృష్టించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్స్​లో భారత్​ తరుపున బరిలోకి దిగిన మరో ఆటగాడు లక్ష్యసేన్​పై గెలిచి ఫైనల్​ చేరుకున్నాడు. ఓ భారత ఆటగాడు ఫైనల్స్​కు చేరుకోవడం ఇదే తొలిసారి.

Last Updated :Dec 19, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.