ETV Bharat / sitara

గాయాలతో మంచు లక్ష్మి.. ఆ ఫొటోలపై క్లారిటీ

author img

By

Published : Dec 19, 2021, 7:20 PM IST

Manchu lakshmi news: నటి, నిర్మాత మంచు లక్ష్మి.. ఇటీవల పోస్ట్​ చేసిన కొన్ని ఫొటోలు వైరల్​గా మారాయి. అందులో ఆమె గాయాలతో ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు ఆ విషయమై లక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

manchu lakshmi
మంచు లక్ష్మి

ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్‌ చేసిన గాయాల ఫొటోలపై నటి మంచు లక్ష్మి వివరణ ఇచ్చారు. తనకెలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.

ఇంతకీ ఏమైందంటే?

మంచు లక్ష్మి ఇటీవల ఓ సినిమా షూటింగ్​లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోల్ని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు. వీటిల్లో ఆమె చేతికి, మోకాలికి గాయాలు కనిపించాయి. దాంతో ఆమె అభిమానులు, నెటిజన్లు లక్ష్మికి ఏమైందోనని ఆరా తీయడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టారు.

manchu lakshmi injury
మంచు లక్ష్మి పోస్ట్ చేసిన ఫొటోలు

'ఆ ఫొటోలు సినిమా చిత్రీకరణకు సంబంధించినవి. నాకెలాంటి ప్రమాదం జరగలేదు. నాపై ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు' అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె మలయాళీ నటుడు మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కీలకపాత్ర చేస్తున్నారు.

manchu lakshmi mohan lal
మంచు లక్ష్మి-మోహన్​లాల్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.