ETV Bharat / bharat

పీటీ ఉషపై '420' కేసు.. రియల్ ఎస్టేట్​ వివాదంతో...

author img

By

Published : Dec 19, 2021, 1:56 PM IST

PT Usha cheating case: పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. తనను పీటీ ఉష మోసం చేశారని మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

pt usha cheating case
pt usha cheating case

PT Usha cheating case: భారత దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ క్రీడాకారిణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 420(మోసం) కింద పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకున్నారు.

PT Usha Jemma joseph

ఓ బిల్డర్​తో కలిసి పీటీ ఉష తనను మోసం చేశారని జెమ్మా జోసెఫ్ ఆరోపించారు. పీటీ ఉష హామీతో కేరళ కోజికోడ్​కు చెందిన ఓ బిల్డర్ నుంచి 1012 చదరపు అడుగుల స్థలాన్ని తాను కొనుగోలు చేశానని చెప్పారు. ఈ స్థలం ఖరీదు రూ.46 లక్షలు కాగా.. విడతలవారీగా నగదు చెల్లించినట్లు వివరించారు. అయితే, స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించకుండా బిల్డర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.

పీటీ ఉష సహా నిర్మాణ సంస్థకు చెందిన మరో ఆరుగురిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్.. పిటిషన్​ను వెల్లాయిల్ పోలీసు స్టేషన్​కు బదిలీ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.

ఇదీ చదవండి: 12 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.