12 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య

author img

By

Published : Dec 19, 2021, 10:40 AM IST

Updated : Dec 19, 2021, 10:46 AM IST

KERALA POLITICIANS KILLINGS

Alappuzha politicians killing: కేరళలోని అలప్పుజలో ఇద్దరు రాజకీయ నాయకులు 12 గంటల వ్యవధిలో హత్యకు గురయ్యారు. తొలుత ఎస్​డీపీఐ నేతను కొందరు దుండగులు హత్య చేశారు. దీని వెనక ఆరెస్సెస్ హస్తం ఉందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆగంతుకులు ఇంట్లోకి చొరబడి భాజపా నేతను చంపేశారు.

Alappuzha politicians killing: కేరళలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్​డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్.. శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

KERALA POLITICIANS KILLINGS
ఎస్​డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్

SDPI leader killed Kerala

బైక్​పై వెళ్తున్న షాన్​ను కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. కింద పడిపోయిన ఆయనను దుండగులు తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ షాన్​ను కొచ్చిలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని ఎస్​డీపీఐ ఆరోపించింది.

భాజపా నేత హత్య

కాగా, 12 గంటల వ్యవధిలో భాజపా నేత ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజీత్ శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

KERALA POLITICIANS KILLINGS
భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజీత్ శ్రీనివాస్

దీంతో అలప్పుజలో ఆంక్షలు విధించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం పినరయి విజయన్​ ఈ ఘటనలను ఖండించారు.

ఇదీ చదవండి: గ్యాంగ్​రేప్​ కేసులో 13మందికి 20 ఏళ్ల జైలు శిక్ష

Last Updated :Dec 19, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.