ETV Bharat / sports

BWF World Championship: కిదాంబి శ్రీకాంత్​కు సిల్వర్​- ఓడినా రికార్డే..

author img

By

Published : Dec 19, 2021, 8:23 PM IST

Updated : Dec 19, 2021, 10:34 PM IST

World Badminton Championship: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్స్​ ఫైనల్లో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్​ ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్​లో రజతం సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

WORLD BADMINTON CHAMPIONSHIP
శ్రీకాంత్

kidambi srikanth news: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్​ పురుషుల సింగిల్స్​​లో కిదాంబి శ్రీకాంత్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కియాన్ యో(సింగపూర్​) చేతిలో 15-21, 20-22 తేడాతో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్​లో రజతం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో శ్రీకాంత్​ 17-21, 21-14, 21-17తో లక్ష్యసేన్‌పై విజయం సాధించి ఫైనల్​ చేరాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్​ మహిళల సింగిల్స్​లో అకానె యమగూచి (జపాన్‌) స్వర్ణం సాధించింది. ఒకటో సీడ్​ తైజు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై 21-14,21-11తో విజయాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచ మూడో సీడ్​ యమగుచి బీడబ్ల్యూఎఫ్​ ఛాంపియన్స్ టైటిల్​ని నెగ్గిన జపాన్​ రెండో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది.

బీడబ్ల్యూఎఫ్​ మిక్స్​డ్​ డబుల్స్​లో థాయ్​లాండ్ ద్వయం డెచాపోల్ పువారానుక్రో, సప్సీరీ తారత్తనాచై టైటిల్​ సాధించింది. జపాన్ ద్వయం యుటా వటనాబే, అరిసా హిగాషినోను 21-13, 21-14తో ఓడించింది.

ఇదీ చదవండి:

చరిత్రకు అడుగు దూరంలో శ్రీకాంత్.. స్వర్ణంపై కోటి ఆశలు

లక్ష్యసేన్.. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ ఆశాకిరణం ​

Last Updated :Dec 19, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.