ETV Bharat / international

క్లూ ఇచ్చి లాకర్​లో క్యాష్​ ప్రైజ్​ ఉంచినా.. ఏ ఒక్కరూ!

author img

By

Published : Dec 19, 2021, 3:52 PM IST

Professor Kenyon Wilson: కరోనా కాలంలో విద్యార్థులకు వినూత్నంగా, ఆసక్తికరంగా బోధించాలనుకున్నారు ఓ ప్రొఫెసర్​. ఈ క్రమంలోనే వారికి తెలియకుండానే.. ఓ టెస్ట్​ పెట్టారు. మ్యూజిక్​ సెమినార్​ సిలబస్​లో ఓ క్యాష్​ ప్రైజ్​కు సంబంధించి క్లూలు ఉంచారు. తీరా చూస్తే.. ఏ ఒక్క విద్యార్థి కూడా నగదును సొంతం చేసుకోలేకపోయారు. ఆ సిలబస్​లో 3 పేజీలే ఉండటం గమనార్హం. అసలు సంగతేంటంటే?

Kenyon Wilson
Kenyon Wilson

Professor Kenyon Wilson: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ టెన్నెస్సీలోని ప్రొఫెసర్​ కెన్యాన్​ విల్సన్​.. తన విద్యార్థులు సిలబస్​ను పూర్తిగా చదువుతున్నారో లేరో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం ఓ వెరైటీ టెస్ట్​ పెట్టారు.

Professor Cash Prize Syllabus: ఓ మ్యూజిక్​ సెమినార్​ కోసం 3 పేజీల సిలబస్​ను విద్యార్థులకు ఇచ్చి పూర్తిగా చదవమన్నారు. క్లాస్​లోని 70 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా, ఎవరూ టెస్ట్​ పాస్​ కాలేకపోయారు. ఎందుకంటే.. ఆ సిలబస్​లోని రెండో పేజీలో ఓ లాకర్​కు సంబంధించి లొకేషన్​ దాని కాంబినేషన్ క్లూలు ఉంచారు. ఆ లాకర్​లో 50 డాలర్లు(రూ. 3800) ఉండటం విశేషం. విద్యార్థులు ఎవరూ అది కనిపెట్టలేకపోయారు.

''క్లెయిమ్​ చేసిన మొదటి వ్యక్తికి ఉచితం; లాకర్ నెంబర్​​ 147; కాంబినేషన్​ 15,25,35'' అని ఆ పేజీలో ఉంది.

కానీ డిసెంబర్​ 8తో సెమిస్టర్​ ముగిసింది. విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. కానీ నగదు మొత్తం ఆ లాకర్​లోనే ఉంది. ఈ విషయాన్నంతా ఆ ప్రొఫెసరే ఫేస్​బుక్​లో పోస్ట్​ చేయడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

''సెమిస్టర్​ మొత్తం విద్యార్థులపై చేసిన ప్రయోగం ముగిసింది. ఎవరూ పొందని నిధిని తిరిగి నేనే దక్కించుకున్నాను.''

- కెన్యాన్​ విల్సన్​, ప్రొఫెసర్​

ఆయన చేసిన పోస్ట్​ గురించి ఏకంగా కెనడియన్​ బ్రాడ్​కాస్టింగ్​ కార్పొరేషన్​.. విల్సన్​ను సంప్రదించడం గమనార్హం. ఆ తర్వాత ఇది మరింత వైరల్​ అయింది.

కరోనా కాలంలో పిల్లలకు కాస్త వినూత్నంగా పాఠాలు చెప్పాలని అలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు విల్సన్​. తన విద్యార్థులను చూసి కోపం రావట్లేదని, తాను చిన్నవయసులో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి మిస్​ అయ్యేవాడినేమో అంటున్నారు.

ఇది ఫెయిల్​ అయినందున.. నెక్ట్స్​ ఏం ప్రయోగించాలో సలహాలు కూడా కోరారు.

ఇవీ చూడండి: లక్షలాది నగ్న చిత్రాలు, వీడియోలతో మ్యుజిషియన్‌ అరెస్ట్​!

ఒలింపిక్స్​లో రాజకీయాలా?.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.