ETV Bharat / international

లక్షలాది నగ్న చిత్రాలు, వీడియోలతో మ్యుజిషియన్‌ అరెస్ట్​!

author img

By

Published : Dec 18, 2021, 8:44 PM IST

Child Pornography News: లక్షలాది చిన్న పిల్లల నగ్న చిత్రాలు, వీడియోల్ని సేకరించిన ఓ సంగీతకారుడిని ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Child Pornography News
చైల్డ్​ పోర్నోగ్రఫీలో ఇటలీ మ్యుజిషియన్ అరెస్టు

Child Pornography News: లక్షలాది చిన్న పిల్లల నగ్న చిత్రాలు, వీడియోల్ని సేకరించి దాచిపెట్టిన ఓ వ్యక్తిని ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారులతో పెద్దలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టుగా చిత్రీకరించిన దాదాపు మిలియన్‌కు పైగా ఫొటోలు, వీడియోలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని ఇటలీలోని మార్చే రీజియన్‌లోని కోస్టల్‌ సిటీ అంకోనాకు చెందిన 49 ఏళ్ల సంగీతకారుడిగా గుర్తించారు.

Musician Arrested For Minors Nude Videos: దాదాపు 20 ఏళ్లుగా అతడు ఈ ఫొటోలు, వీడియోలను సేకరించినట్టు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నగ్న వీడియోలు, ఫొటోలను హార్డ్‌ డిస్క్‌లు, ఆప్టికల్‌ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లలో దాచినట్టు గుర్తించామన్నారు. ఆ ఫొటోలు, వీడియోల రకం, బాధితుల వయస్సుల వారీగా వాటిని విభజించి ప్రత్యేక ఫోల్డర్లు రూపొందించాడని వివరించారు. నిందితుడు మైనర్లకు పాఠాలు నేర్పేవాడని, అయితే, అతడు దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాల్లేవని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: Sukesh Chandrashekar Case: 'జైలు సిబ్బందికి ప్రతి నెలా రూ.కోటి లంచం'

Jaipur Girl Child Rape Case: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.