ETV Bharat / business

కృష్ణ ఎల్లకు అమిటీ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌

author img

By

Published : Dec 19, 2021, 7:36 AM IST

Krishna Ella Amity: వ్యాక్సిన్‌ రంగంలో విశేష కృషికి గుర్తింపుగా భారత్​ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది అమిటీ యూనివర్సిటీ. నోయిడా క్యాంపస్​లో జరిగిన స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్​ను అందించింది.

KRISHNA ELLA
KRISHNA ELLA

Krishna Ella Amity: అనేక మెట్రో నగరాల్లో విస్తరించిన ప్రాంగణాలతో పేరొందిన అమిటీ యూనివర్సిటీ శనివారం ఇక్కడి నోయిడా క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవంలో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. వర్శిటీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఛాన్స్‌లర్‌ అతుల్‌ చౌహాన్‌, ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్‌ కె.చౌహాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Doctorate Krishna Ella

నార్తర్న్‌ ఐర్లాండ్‌ క్యూన్స్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌, వైస్‌ఛాన్స్‌లర్‌ అయిన ప్రొఫెసర్‌ ఇయాన్‌ గ్రీర్‌, భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్లు అందించి గౌరవించారు. వ్యాక్సిన్‌ రంగంలో కృష్ణ ఎల్ల చేస్తున్న విశేషసేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ అందజేశారు.

నవంబరు 25న కర్ణాటక అగ్రికల్చర్‌, హార్టికల్చరల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ తావర్‌చంద్‌ గహ్లోత్‌ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. నెల తిరక్కముందే ఈయనకు మరో డాక్టరేట్‌ లభించింది.

ఇదీ చదవండి: 'అలా చేస్తే మాస్కులు వాడాల్సిన పని లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.