ETV Bharat / state

రైతు వేదిక ప్రారంభోత్సవంలో ప్రధాని చిత్రంపై రగడ

author img

By

Published : Dec 19, 2021, 1:24 PM IST

Tension at the rythu vedika inauguration, bhairamkonda rythu vedika
రైతు వేదిక ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

Tension at the rythu vedika inauguration : నారాయణపేట జిల్లా బైరంకొండ రైతువేదిక ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకులు, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.

Tension at the rythu vedika inauguration : నారాయణపేట జిల్లా బైరంకొండ రైతు వేదిక ప్రారంభోత్సవంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు వేదిక నిర్వాహకులు, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి... ఇరు వర్గాల వారు పరస్పర దాడులు చేసుకున్నారు.

రైతువేదికపై ప్రధాని చిత్రపటం లేదని భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులతో భాజపా నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలను అదుపుచేశారు.

రైతు వేదిక ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

ఇదీ చదవండి: GCC Giri brand soap : గిరిపుత్రులకు అండగా... 'గిరి' సబ్బుల పరిశ్రమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.