ETV Bharat / bharat

వాషింగ్‌ మెషీన్‌లో జీన్స్‌ ప్యాంట్లను ఏ టెంపరేచర్‌ వద్ద వాష్‌ చేయాలి? - మీకు తెలుసా? - BEST TEMPERATURE TO WASH JEANS

author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 11:42 AM IST

Washing Machine
Washing Machine (ETV Bharat)

Best Temperature To Wash Jeans : చాలా మంది ఇళ్లలో వాషింగ్‌ మెషీన్‌ ఉంటుంది. కానీ.. దానికి సంబంధించిన అన్ని విషయాలూ అందరికీ తెలియకపోవచ్చు. ఇలాంటి వాటిల్లో.. జీన్స్‌ ప్యాంట్​ను ఏ టెంపరేచర్‌ వద్ద వాష్‌ చేయాలనేది ఒకటి! మరి ఈ విషయం మీకు తెలుసా?

Best Temperature To Wash Jeans : ఇంట్లో దుస్తులు క్లీన్ చేస్తే సగం పని పూర్తయినట్టుగా ఫీలవుతారు గృహిణులు. అందుకే.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషీన్‌ వాడుతున్నారు. దీనివల్ల మహిళలకు శ్రమ తగ్గడంతోపాటు టైమ్​ సేవ్ అవుతుంది. అయితే.. వాషింగ్‌ మెషీన్‌ కొన్నప్పుడు కంపెనీ యూజర్‌ మాన్యువల్‌ ఇస్తుంది. దాన్ని తప్పకుండా చదవాలి. కానీ.. చాలా మంది లైట్​ తీసుకుంటారు.

ఫలితంగా.. వారికి ఏ ఉష్ణోగ్రత వద్ద ఏ రకమైనటువంటి దుస్తులు ఉతకాలో తెలియదు! జీన్స్‌ప్యాంట్ల వంటి మందంపాటి దుస్తులను ఉతికేటప్పుడు టెంపరేచర్‌ ఎక్కువగా సెట్‌ చేస్తుంటారు. దీంతో అవి త్వరగా రంగు మారిపోతుంటాయి. మరి.. ఏ ఉష్ణోగ్రత వద్ద ఏ రకమైనటువంటి దుస్తులు ఉతకాలి? వాషింగ్‌ మెషీన్‌ ఈజీగా ఎలా క్లీన్‌ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాషింగ్‌ మెషీన్‌ ఎలా క్లీన్‌ చేయాలి :

  • ఎక్కువ మంది వాషింగ్‌ మెషీన్‌ పైన చూడడానికి బాగానే ఉంది కదా.. లోపల కూడా శుభ్రంగానే ఉంటుందని అనుకుంటారు. దీంతో వాషింగ్‌ మెషీన్‌ను క్లీన్‌ చేయడం గురించి ఆలోచించరు.
  • అయితే.. ఎక్కువ రోజులు వాషింగ్‌ మెషీన్‌ శుభ్రం చేయకపోతే.. లోపల దుమ్ము, ధూళి, క్రిములు, బూజు వంటివి పేరుకుపోతాయని నిపుణులంటున్నారు. దీనివల్ల బట్టల మురికిపోవడం అటుంచితే.. వాషింగ్‌ మెషీన్‌ తొందరగా పాడైపోతుందని చెబుతున్నారు.
  • అందుకే కనీసం 20 రోజులకు ఒకసారి నీళ్లలో బ్లీచింగ్ లేదా వంటసోడా వేసి ఖాళీగా తిప్పాలని సూచిస్తున్నారు. దీనివల్ల వాషింగ్‌ మెషీన్‌ లోపల క్రిమిరహితంగా మారుతుంది.
  • బట్టలు ఉతకడమే కాదు.. వాషింగ్‌ మెషీన్‌ను సరిగ్గా వాడుతున్నామా ? లేదా ? అనేది గమనించుకోవాలి. తప్పనిసరిగా మెషీన్‌ను ప్రతి 3 వాష్‌లకు ఒకసారైనా బెల్ట్‌లోపల స్పాంజితో క్లీన్‌ చేయాలి.
  • లేకపోతే అక్కడ మురికి చేరి వాషింగ్‌ మెషీన్‌ తొందరగా పాడవుతుంది. అలాగే బట్టల మురికి కూడా తొలగిపోదని నిపుణులు చెబుతున్నారు.

దుస్తుల లైఫ్‌ను పెంచే ట్రిక్​- వాషింగ్​ మెషీన్​లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి!​

  • కొంతమంది వాషింగ్‌ మెషీన్‌ లోపల క్లీన్‌ చేస్తారు కానీ.. డిటర్జెంట్‌ బాక్స్‌ గురించి అస్సలు పట్టించుకోరు. అయితే, డిటర్జెంట్‌ బాక్స్‌ను కూడా వారానికోసారి క్లీన్‌ చేయాలి.
  • వేడినీటితో శుభ్రం చేస్తే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. డిటర్జెంట్‌ బాక్స్‌ పూర్తిగా ఆరాక మూత వేయాలి.
  • బట్టలు బాగా మురికిగా ఉన్నప్పుడు.. అలాగే జ్వరం, ఫ్లూ ఇతర అంటువ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారి దుస్తులు మెషీన్‌లో వేసే ముందు పావుగంట వేడి నీటిలో నానబెట్టాలి.
  • ఇలా చేయడం వల్ల మురికి బట్టలపై ఉన్న మురికి, బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌ వంటివి తొలగిపోతాయి.

జీన్స్‌ దుస్తులను ఏ టెంపరేచర్‌ వద్ద వాష్‌ చేయాలి?

  • బ్లీచ్‌ బేస్డ్‌ సబ్బు, సర్ఫ్‌లను వేసి బట్టలను వాష్‌ చేసేటప్పుడు టెంపరేచర్‌ 30-40 డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. ఈ ఉష్ణోగ్రత సెట్‌ చేయడం వల్ల బట్టలు త్వరగా క్లీన్‌ అవుతాయి.
  • అదే జీన్స్‌ పాంట్లు, జీన్స్‌ దుస్తులను వాష్‌చేసేటప్పుడు వేడినీళ్లలో అంటే 60 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలో పెడితే రంగు మారే ప్రమాదం ఉందని నిపుణులంటున్నారు. కాబట్టి, కొద్దిగా టెంపరేచర్‌ తక్కువగా సెట్‌ చేయాలని సూచిస్తున్నారు.

వాషింగ్ మెషిన్లో ఎన్ని దుస్తులు వేస్తున్నారు? - ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం! - Washing Machine Maintenance Tips

వాషింగ్ మెషిన్ క్లీనింగ్ కోసం బెస్ట్ టిప్స్ - ఫాలో అయ్యారంటే నిమిషాల్లో తళతళ మెరిసిపోవడం పక్కా! - Washing Machine Cleaning Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.