హాకీ టోర్నీలో జపాన్​ను చిత్తుగా ఓడించిన భారత్​

author img

By

Published : Dec 19, 2021, 5:48 PM IST

Asian Champions Trophy hockey

Asian Champions Trophy hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ​లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో జపాన్​పై 6-0తో క్లీన్​స్వీప్​ చేసింది.

Asian Champions Trophy hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ​లో జపాన్​పై 6-0తో అజేయ విజయం సాధించింది భారత్​. మౌలానా భాసాని హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో హర్మన్​ప్రీత్​ సింగ్​(10ని., 53ని.) రెండు గోల్స్, దిల్​ప్రీత్​ సింగ్​(23ని.), జరమ్​ప్రీత్ సింగ్​(34ని.), సుమిత్​(46ని.), షంషేర్ సింగ్​(54ని.)గోల్స్​ చేసి భారత్​కు విజయాన్ని అందించారు. ​

Asian Champions Trophy hockey
హాకీ

ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్​ ఖరారు చేసుకున్న భారత్​.. పది పాయింట్స్​తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కొరియా(6), జపాన్​(5), పాకిస్థాన్​(2), బంగ్లాదేశ్​(0) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక కాంస్య పతకం గెలిచిన తర్వాత తొలిసారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత్‌.. కొరియాతో తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0తో చిత్తు చేసింది. పాకిస్థాన్​ను 3-1 తేడాతో ఓడించింది.

ఇదీ చదవండి: Dravid vs Kohli: కోహ్లీకి కోచ్​ ద్రవిడ్ బ్యాటింగ్ పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.