ETV Bharat / sitara

'పుష్ప' కలెక్షన్స్​ చూస్తే పూనకాలే.. రెండో రోజు ఎంతంటే?

author img

By

Published : Dec 19, 2021, 12:46 PM IST

Pushpa Day2 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో దుమ్ములేపుతున్నారు. కలెక్షన్ల విషయంలోనూ తగ్గేదే.. లే అంటున్నారు. తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాకు రెండో రోజూ మంచి వసూళ్లే వచ్చాయి.

pushpa
పుష్ప

Pushpa Day2 Collection: 'పుష్ప'.. థియేటర్లలో ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పిస్తోంది. అల్లు అర్జున్​ నటన, డైలాగ్​ డెలివరీకి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాకు రెండో రోజు కూడా భారీ వసూళ్లు దక్కాయి.

మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన బన్నీ 'పుష్ప'.. మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ రాబట్టిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక వసూళ్లంటూ పేర్కొంది.

ఈ సినిమాకు.. ఏపీ, తెలంగాణలో రెండో రోజు రూ. 13.70 కోట్ల వసూళ్లు దక్కాయి. తొలి రోజు రూ. 24.9 కోట్లు వసూలు చేసిందీ చిత్రం. ఈ నేపథ్యంలో రెండు రోజులు కలిపి రూ. 38.60 కోట్ల వసూళ్లు వచ్చాయి.

ఓవర్సీస్​లోనూ జోరు

అమెరికా బాక్సీఫీసు వద్ద కూడా 'పుష్ప' ప్రభంజనం సృష్టిస్తోంది. రెండో రోజు 345వేల డాలర్ల వసూళ్లు​ వచ్చినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల క్లబ్​లో చేరిపోయిందీ చిత్రం. కాగా, ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ ఏడాది ఓ తెలుగు చిత్రానికి విదేశాల్లో ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం.

ఇదీ చదవండి:

Pushpa Movie Director: ఎర్రచందన నేపథ్యం.. 'పుష్ప' శక్తిమంతం

Rajasingh fire on DSP: 'పుష్ప'ను వీడని వివాదాలు.. డీఎస్పీపై రాజాసింగ్​ ఫైర్​.. ఎందుకంటే..?

మిలియన్ డాలర్​ క్లబ్​లో 'పుష్ప'.. పార్ట్​-2 షూటింగ్ అప్పుడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.