ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 22, 2021, 6:13 AM IST

Updated : Nov 22, 2021, 9:59 PM IST

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS

21:41 November 22

టాప్​న్యూస్ @10PM

  • ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్​..!

రాష్ట్రంలో నాలుగైదు చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యనాయకులతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి...ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

  •  9 ఐఫోన్​లు తెచ్చాడు.. అడ్డంగా దొరికిపోయాడు!

శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న ఐఫోన్​-13 సహా బంగారం బిస్కెట్లు తీసుకొచ్చిన ప్రయాణికులపై కస్టమ్స్​ అధికారులు కేసులు నమోదు చేశారు. 9 ఐఫోన్​-13 ఫోన్లు, మూడు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

  •  మూర్చపోయిన ఏనుగులు.. కారణమేంటి?

ఏనుగులు మూర్చపోయి పడిపోయిన ఘటన ఛత్తీస్​గఢ్​లో కలకలం రేపింది. సూరజ్​పుర్​ జిల్లాలోని బిహార్​పుర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

  • కొవాగ్జిన్ వేసుకున్నవారికి అనుమతి

భారత్​ నుంచి యూకేకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు (India to UK travel restrictions) ఇకపై మార్గం సుగమం కానుంది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం.. యూకే ఆమోదించే టీకా జాబితాలో కొవాగ్జిన్​కు (Covaxin uk travel) చోటు దక్కింది.

  • 'అది  అతి పెద్ద సవాలే'

ఛాంపియన్స్ ట్రోఫీ-2025(champions trophy 2025) పాకిస్థాన్ వేదికగా జరగబోతుందని ఇటీవలే వెల్లడించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో భారత్​ పాల్గొనేలా చేయడం అతి పెద్ద సవాలని తెలిపాడు ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్​లే.

20:50 November 22

టాప్​న్యూస్ @9PM

  •  తెరాస అభ్యర్థుల నామినేషన్లు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు నామినేషన్లు(Local body MLC Elections Telangana) దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు తెరాస అభ్యర్థులుగా శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి నామ పత్రాలు సమర్పించారు.

  •  ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు తెరాస అభ్యర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్​, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస తరపున మాత్రమే అభ్యర్థులు నామినేషన్ వేయడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.

  •  'త్వరలో కొత్త బిల్లుతో వస్తాం..'

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని పీటీఐ(Amaravati capital news) వార్తా సంస్థ వెల్లడించింది. వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని శాసనసభలో ఏపీ సీఎం జగన్ ప్రకటించినట్లు పీటీఐ తెలిపింది. రాష్ట్ర విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే జగన్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఈ చట్టం స్థానంలో కొత్త బిల్లు ప్రవేశపెడతామని సీఎం ప్రకటించినట్లు తెలిపింది.

  •  సెన్సెక్స్ 1170 పాయింట్లు పతనం

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​లో భారీ​ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1170 పాయింట్ల పతనమై.. 58,466 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 348 పాయింట్లు కోల్పోయి.. 17,417 వద్ద ముగిసింది.

  •  మరో పాట రిలీజ్​కు రెడీ

RRR song update: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని 'జనని' పాట నవంబరు 26న విడుదల కానుంది. శక్తివంతంగా, హృదయానికి హత్తుకునేలా ఈ గీతం ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

19:49 November 22

టాప్​న్యూస్ @8PM

  •  ' ఆ ప్రాజెక్టులు అవసరం లేదు'

గోదావరిపై ఉన్న పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. 

  • మెట్రోలో ప్రయాణికులకు ఆఫర్

కొవిడ్​ పరిస్థితుల తర్వాత మెట్రోలో (hyderabad metro) ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మెట్రోలో ప్రయాణించిన వారికి లక్కీడ్రా ద్వారా బహుమతులు అందించేందుకు సువర్ణ ఆఫర్​ను తీసుకొచ్చారు. అందులో భాగంగా విజేతలైన వారికి ఇవాళ అమీర్​పేట్​ మెట్రో స్టేషన్​లో బహుమతులు అందించారు (Metro winners) .

  •  ' చట్టబద్ధత కల్పించాల్సిందే'

సాగు చట్టాల రద్దుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తేనే తాము స్వగ్రామాలకు వెళతామని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ (rakesh tikait news) చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత కోరుతూ సంయుక్త్​ కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) ఆధ్వర్యంలో సోమవారం కిసాన్ మహాపంచాయత్ (kisan mahapanchayat lucknow) నిర్వహించారు. తమతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు టికాయిత్​.

  • ఫస్ట్​లుక్​తో 'బంగార్రాజు'

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'బంగార్రాజు', 'థ్యాంక్యూ', 'శ్యామ్ సింగరాయ్', 'దృశ్యం 2' చిత్రాల వివరాలు ఉన్నాయి.

  •  హార్దిక్ దూరం!

Hardik Pandya Fitness: కొంతకాలంగా ఫిట్​నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా. టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కినా పెద్దగా ప్రభావం చూపలేకపోవడం వల్ల న్యూజిలాండ్​తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్​కు అతడిని ఎంపిక చేయలేదు. 

18:51 November 22

టాప్​న్యూస్ @7PM

' ప్రాజెక్టుల స్వాధీనం అక్కర్లేదు'

పెద్దవాగు మినహా మిగతా ప్రాజెక్టుల స్వాధీనం అక్కర్లేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.  ఈ మేరకు జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు.

  • సీఎం వైఖరితో తీవ్ర నష్టం

ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu fire on jagan over capital city) మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గటంతో పాటు రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతోందన్నారు.

  •  ' మమ్మల్ని గెలిపిస్తే ప్రతి నెల వెయ్యి'

పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపిస్తే మహిళల సాధికారత కోసం ప్రత్యేక పథకాలను తీసుకోస్తామని కేజ్రీవాల్‌ (kejriwal promises in punjab) వెల్లడించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పంజాబ్‌లో (kejriwal punjab visit) పర్యటించారు.

  • 'అందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు'

కరోనా బూస్టర్‌ డోస్‌(booster dose in India) అవసరమనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్​ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ స్పష్టం చేశారు. దేశంలో అర్హులైన ప్రతిఒక్కరికీ కరోనా రెండో డోసు ఇవ్వడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.

  •  అందులో మనం మెరుగవ్వాలి

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్(ind vs nz t20 2021)​ను క్లీన్​స్వీప్ చేసింది టీమ్ఇండియా. దీంతో టీ20 కెప్టెన్​గా తొలి సిరీస్​లో అదరగొట్టాడు రోహిత్ శర్మ. ఈ విజయంపై స్పందిస్తూ మ్యాచ్​లో ఏం చేయాలనే దానిపై ముందుగానే ప్రణాళికలు వేస్తామని వెల్లడించాడు.

17:53 November 22

టాప్​న్యూస్ @6PM

  • మరోసారి పోటీ చేయనున్న కవిత

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. నిజామాబాద్‌ నుంచి  కవిత మరోసారి పోటీ చేయనున్నారు. 

  • ట్రాక్​పై వీడియోకు పోజులిస్తుండగా..!

కొన్ని కొన్నిసార్లు సరదా పనులే ప్రాణాల మీదకు తెస్తుంటాయి. మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో యువకుడు పట్టాలపై రైలు వస్తుండగా వీడియో తీయమని స్నేహితుడికి చెప్పాడు

  •  సీబీఐకి అవసరం లేదు

మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై (Ts high court on Mariyamma case) హైకోర్టులో విచారణ జరిగింది. ఇందుకు సీబీఐ ఎస్పీ కల్యాణ్‌, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ హాజరయ్యారు.  

  • త్వరలోనే ​ బయోపిక్​!

Puneeth Biopic: ఇటీవలే గుండెపోటుతో మరణించిన కన్నడ స్టార్​ హీరో పునీత్​ రాజ్​కుమార్​ బయోపిక్​ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు దర్శకుడు సంతోష్‌. పునీత్​ ఎప్పటికీ జీవించే ఉంటారని అన్నారు.

  • 'వారిదే కీలకపాత్ర'

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్(ind vs nz t20 series 2021)​ను క్లీన్​స్వీప్ చేసింది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో ఈ సిరీస్​ విజయంలో స్పిన్నర్లే కీలకపాత్ర పోషించారని చెప్పుకొచ్చాడు భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్(sanjay bangar news).

16:55 November 22

టాప్​న్యూస్ @5PM

  •  ఆరుగురు  అభ్యర్థులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా(trs mlc candidates unanimous) ఎన్నికైనట్టు ఈసీ అధికారులు కాసేపట్లో ప్రకటించనున్నారు.

  • 'కొత్త బిల్లు తీసుకొస్తాం'

విస్తృత ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం జగన్(Amaravati capital news)​.. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈ చట్టం స్థానంలో కొత్త బిల్లు ప్రవేశపెడతామని అసెంబ్లీలో సీఎం ప్రకటించినట్లు తెలిపింది.

  • 'ఆ చట్టం రద్దు వివరాలు సమర్పించండి'

మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు (AP High Court on three capitals cases)... ఉపసంహరణపై స్పష్టత కోరింది.

  • బాయ్​ఫ్రెండ్​తో హీరోయిన్ పెళ్లి..!

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించింది హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్(rakul marriage updates)​. ప్రస్తుతం తాను కెరీర్​పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది

  •  ఛాంపియన్ తమిళనాడు.

సయ్యద్​ ముస్తక్​ అలీ ట్రోఫీని ముద్దాడింది తమిళనాడు. సోమవారం జరిగిన ఫైనల్​లో కర్ణాటకపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తమిళనాడు.. వరుసగా రెండో టైటిల్​ను కైవసం చేసుకుంది. ఆఖరి బంతికి సిక్సర్​ బాది మ్యాచ్​ విజయంలో కీలకంగా వ్యవహరించాడు షారుక్​ ఖాన్​(33*).

15:53 November 22

టాప్​న్యూస్ @4PM

  • కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​లో భారీ​ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1170 పాయింట్ల పతనమై.. 58,466 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 348 పాయింట్లు కోల్పోయి.. 17,417 వద్ద ముగిసింది.

  • ఆయనకు  సుప్రీంకోర్టులో ఊరట!

ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరంబీర్​ సింగ్​కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో ఆయనపై నమోదైన కేసుల్లో ముంబయి పోలీసులు నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేయగా.. పరంబీర్​ అరెస్ట్​ను సుప్రీం కోర్టు అడ్డుకుంది.

  • 'డ్రాగన్​'ను ధిక్కరిస్తే..అంతే!

ప్రముఖ చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆ దేశ మాజీ వైస్ ప్రీమియర్‌ జాంగ్​ గోలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటి నుంచి కనిపించకుండా పోయారు. అయితే ఇది అక్కడ కొత్తేమీ కాదు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ఎంతోమంది కనుమరుగైపోయారు.

  • కమల్​హాసన్​కు కరోనా

దిగ్గజ నటుడు కమల్​హాసన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

  • రవిశాస్త్రికి గంభీర్ చురకలు

విదేశాల్లో టీమ్ఇండియా అద్భుత విజయాలపై(team india victory) కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని తెలిపాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gambhir fire on ravisastri). ప్రస్తుతం కోచ్​గా ఉన్న ద్రవిడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడనుకోవడం లేదని పేర్కొన్నాడు.

14:36 November 22

టాప్​న్యూస్ @3PM

  •  అవకాశాలు అందిపుచ్చుకోవాలి

ఆంధ్రప్రదేశ్​లోని పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (CJI justice nv ramana news)... విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.

  • ' సమస్యగా మార్చారు'

హుజూరాబాద్‌ ఓటమి నుంచి దృష్టి మరల్చేందుకు కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ నిందిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy on kcr) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒప్పందం చేసుకున్న ప్రకారం ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.

  • వర్ష బీభత్సానికి 24 మంది బలి

కర్ణాటకలో కుండపోత వర్షాలతో (Heavy rains in karnataka) ఇప్పటివరకు 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 5 లక్షల ఎకరాలకుపైగా పంటదెబ్బతిన్నట్లు పేర్కొంది. మరోవైపు.. బెంగళూరు జలదిగ్భందం అయింది. ఎటు చూసినా వరదనీటితో నిండిపోయింది.

  •  సెన్సెక్స్​ భారీగా పతనం

గత నెల జీవితకాల గరిష్ఠాలకు చేరిన సూచీలు.. కొన్ని రోజుల నుంచి దిగజారుతూ వస్తున్నాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో పాటు దేశీయంగా ఫలితాల సీజన్‌ ముగియడం వల్ల మార్కెట్లకు మద్దతు లభించడం లేదు.

  • దూసుకుపోతున్న 'అఖండ' ట్రైలర్​.. 

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అఖండ, మైఖేల్, శేఖర్, క్యాలీఫ్లవర్, బ్రో చిత్రాలకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి.

13:43 November 22

టాప్​న్యూస్​@2PM

  • ఆ దేశంలో మళ్లీ లాక్​డౌన్

దేశంలో కరోనా కేసుల విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో 10 రోజులుపాటు పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధించింది ఆస్ట్రియా ప్రభుత్వం. వైరస్​ ఉద్ధృతి కొనసాగితే లాక్​డౌన్​ను పొడిగించే అవకాశముంది.

  • సెన్సెక్స్​ 1000 పాయింట్లు పతనం

అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్లు(Stock Market) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​(Sensex Today) 1000 పాయింట్లపైగా కోల్పోయి.. 58,576 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 310 పాయింట్ల నష్టంతో 17,454 వద్ద కదలాడుతోంది.

  • 'అప్పటి వరకు ఉద్యమం కొనసాగింపు'

ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం(amaravathi farmers on ysrcp repeal 3 capital act) తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు స్పందించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

  • ఇల్లందులో పులి కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పులి కలకలం.. స్థానికులను కలవరపెడుతోంది. దీంతో పోడు భూముల సమస్యను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులకు పులి సంచారం ఇబ్బందిగా మారింది. ప్రత్యేక బృందాలతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

  • రోడ్డు కోసం నవ్వుల నిరసన

వర్షాలు, భారీ వాహనాల రాకపోకలతో రహదారి ధ్వంసమైంది. అధికారుల చుట్టూ తిరిగితే (Road repair laughing protest) రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి. రెండేళ్లు గడిచినా నిర్మాణం మాత్రం చేపట్టలేదు. ఎవరిని అడిగినా సమాధానమూ రావడంలేదు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు... మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ (Madhya Pradesh laugh protest) వాసులు వినూత్న మార్గం ఎంచుకున్నారు.

12:56 November 22

టాప్​న్యూస్​@1PM

  • భాజపా నేతలకు కేటీఆర్​ కౌంటర్

అన్నదాతలను వీధిపాలు చేసిన వారు దేశ భక్తులు.. రైతులకు ఆపన్న హస్తం అందించిన వారు దేశ ద్రోహులా అని మంత్రి కేటీఆర్​(KTR on BJP leaders) ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ దేశద్రోహి అన్న భాజపా నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ స్పందించారు.

  • వర్ష బీభత్సానికి 24 మంది బలి

కర్ణాటకలో కుండపోత వర్షాలతో (Heavy rains in karnataka) ఇప్పటివరకు 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 5 లక్షల ఎకరాలకుపైగా పంటదెబ్బతిన్నట్లు పేర్కొంది. మరోవైపు.. బెంగళూరు జలదిగ్భందం అయింది. ఎటు చూసినా వరదనీటితో నిండిపోయింది.

  • పాగా కోసం మజ్లిస్ ఆరాటం

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలపై కన్నేసిన మజ్లిస్ పార్టీ (UP Elections AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. వంద సీట్లలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకునే విషయంపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

  • టీమ్ఇండియాపై గెలవడం కష్టం

ఏ ఫార్మాట్​లో అయినా టీమ్​ఇండియాపై గెలవడం చాలా కష్టమని అన్నాడు న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ సాంట్నర్. కాన్పుర్​లో తొలి టెస్టు కోసం సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. టీ20 సిరీస్​లో భారత్​పై ఓడిన ఈ జట్టు.. రెండు టెస్టుల సిరీస్​ ఆడనుంది.

  • ఆండ్రాయిడ్ ఫోన్‌ వాడుతున్నారా

ఆండ్రాయిడ్​ ఫోన్లలో(Android Phone) సెట్టింగ్స్​ను యూజర్ తన​ అవసరాలకు తగినవిధంగా మార్చుకోవచ్చు. ఫలితంగా ఫోన్‌ బ్యాటరీ పనితీరు మెరుగవడం సహా మీ డివైజ్‌ను ఇతరులు దొంగిలించినా ఎక్కడ ఉందనేది సులువుగా తెలుసుకోవచ్చు. డార్క్‌మోడ్‌లో ఫోన్ ఉపయోగించడం వల్ల కళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటో ఓ లుక్కేయండి!

11:59 November 22

టాప్​న్యూస్​@12PM

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్​ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లును మంత్రి వర్గం రద్దు చేసిందని.. చట్టం రద్దుపై అసెంబ్లీలో కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్లు కోర్టుకు చెప్పారు. త్రిసభ్య ధర్మాసనానికి ఏజీ వివరాలు అందజేశారు. ఈ అంశంపై విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది.

  • అభినందన్​కు 'వీర్​ చక్ర'

వైమానిక దళ గ్రూప్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్(abhinandan varthaman) మూడో అత్యున్నత సైనిక పురస్కారం​ 'వీర్​ చక్ర' అందుకున్నారు. 2019లో బాలాకోట్​ వైమానిక దాడుల్లో పాల్గొన్న అభినందన్ పాక్​కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చేశారు

  • సైబర్​క్రైమ్​ కంటే ప్రమాదకరం

ఆన్​లైన్​లో డ్రగ్స్ విక్రయం సైబర్ క్రైమ్ కంటే ప్రమాదకరమైనదని మధ్యప్రదేశ్ హోంమంత్రి, భాజపా నాయకుడు నరోత్తమ్​ మిశ్రా అన్నారు. డ్రగ్స్​ సరఫరాపై దర్యాప్తునకు 'అమెజాన్ ఇండియా' సహకరించాలని కోరారు. ప్రభుత్వం కంటే అమెజాన్ పెద్దది కాదన్నారు.

  • సంప్రదాయాన్ని కొనసాగించిన రోహిత్

కెప్టెన్​గా తొలి సిరీస్​లోనే టీమ్​ఇండియాకు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ (Rohit Sharma). న్యూజిలాండ్​పై మూడో టీ20లో గెలిచి ట్రోఫీ అందుకున్న అనంతరం.. దాన్ని తీసుకెళ్లి నేరుగా కొత్త ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్‌, హర్షల్ పటేల్‌కు అందజేశాడు (Rohit Sharma Trophy).

  • బాలీవుడ్​ ఎంట్రీపై సమంత క్లారిటీ

సమంత, బాలీవుడ్(bollywood movies)​ ఎంట్రీపై ఎట్టకేలకు స్పందించింది. సరైన స్క్రిప్ట్ తన దగ్గరకు వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేసింది. భాష అనేది తనకు ముఖ్యం కాదని చెప్పింది.

10:41 November 22

టాప్​న్యూస్​@11AM

  • మది దోచేస్తారు... సర్వం ఊడ్చేస్తారు..!!

ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు (Cybercriminals). మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా కానుకలు.. గిఫ్ట్‌ చెక్కుల పేరుతో రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.

  • క్రిస్మస్ ఊరేగింపుపైకి దూసుకెళ్లిన కారు

క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నవారి పైకి (SUV Christmas parade) ఎస్​యూవీ దూసుకెళ్లింది. మొత్తం 20 మందిని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మరణించారని పోలీసులు తెలిపారు.

  • తగ్గిన బంగారం ధర ఎంతంటే..?

బంగారం ధర (Gold Rate Today) సోమవారం తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ.50 తగ్గింది. అయితే కిలో వెండికి రూ.10 పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

  • ఎయిర్​టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు

ప్రీపెయిడ్​ రీఛార్జ్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​ (airtel recharge) తెలిపింది. అన్ని ప్లాన్​ల​పై 20-25 శాతం ధరలు పెంచినట్లు పేర్కొంది. కొత్త రీఛార్జ్​ ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

  • 'జై భీమ్' వివాదంపై స్పందించిన దర్శకుడు

'జై భీమ్‌' వివాదానికి పూర్తి బాధ్యత వహించాలంటూ సూర్యను టార్గెట్‌ చేయడం అన్యాయమని, దర్శకుడిగా ఆ బాధ్యత తనదని జ్ఞానవేల్‌ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంపై వస్తున్న వివాదాలపై ఆయన స్పందించారు.

09:56 November 22

టాప్​న్యూస్​@10AM

  • భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

భారత్​లో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 8,488 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 12,510 మంది కరోనాను జయించారు.

  • రాయలచెరువుకు గండం

భారీ వర్షాలకు తిరుపతిలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఆరువందల ఏళ్లనాటి రాయల చెరువు ప్రమాదఘంటికలు(Rayala Cheruvu in danger zone) మోగిస్తోంది. చెరువు కట్టకు స్వల్ప గండి ఏర్పడటంతో ఆయకట్టు ప్రాంత గ్రామాలను యుద్ధప్రాతిపదికన ఖాళీ చేయించారు. ఏ క్షణాన ఏం జరుగుంతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

  • ఊరేగింపుపైకి దూసుకెళ్లిన కారు

క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నవారి పైకి (SUV Christmas parade) ఎస్​యూవీ దూసుకెళ్లింది. మొత్తం 20 మందిని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మరణించారని పోలీసులు తెలిపారు.

  •  మరి 'జీవా' అంటే?

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ కుమార్తె పేరు వామిక.. ధోనీ కూతురు జీవా (Dhoni Daughter Ziva).. రోహిత్ కుమార్తె సమైరా.. అయితే ఈ చిన్నారుల పేర్లకు ప్రత్యేకించి కొన్ని అర్థాలున్నాయి. ఇంతకీ అవేంటంటే?

  • సంగీతం వింటే ఎంతో హాయి!

మానవుడి మెదడుపై సంగీతం (Research on Music Therapy) అపారంగా ప్రభావం చూపుతుందని పరిశోధకులు తేల్చారు. మెదడు తనంతట తాను మరమ్మత్తు చేసుకునేందుకు, రోగులు తమ లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సంగీతం సహాయపడుతుందని పేర్కొన్నారు.

08:41 November 22

టాప్​న్యూస్​@9AM

  • ఐదు నిమిషాలు ఉండలేకపోయా!

HC CJ on MUSI: నదులు, చెరువులు వంటి నీటి వనరుల్ని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్‌ అథారిటీతో పాటు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

  • ఎగుమతులు అంతంతమాత్రమే

పుష్కలంగా వరి ధాన్యం(rice exports telangana) పండిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ.. విదేశాలకు ఎగుమతి చేయడంలో మాత్రం వెనకపడుతోంది. సముద్రతీరం, నౌకాశ్రయాలు లేకపోవడం వల్ల ఇతర దేశాలకు ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

  • వాన తగ్గినా వీడని అవస్థలు

భారీ వర్షాలు ఏపీలోని కడప జిల్లా(kadapa rain news today 2021) బతుకు చిత్రాన్ని మార్చేశాయి. వర్షాలు తగ్గినా వరద ప్రభావం ఇప్పటికీ వీడలేదు. అన్నమయ్య ప్రాజెక్టు నీళ్లు.. ప్రభావిత గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చెయ్యేరు పరివాహక ప్రాంతంలో ఏరూ.. ఊరూ.. ఏకమయ్యేలా ముంచెత్తిన వరద.. పచ్చని పొలాలను మింగేసింది.

  •  బ్రిటిష్​ పాలనకు ఆద్యుడు ఆయనే

చిన్నప్పుడు అనాథగా పెరిగినవాడు.. అల్లరిచిల్లరగా తిరిగినవాడు.. వీధి రౌడీగా పేరొందినవాడు.. ఈస్టిండియా కంపెనీ గోడౌన్‌లో లెక్కలు చూసుకునేందుకు గుమస్తాగా మద్రాసుకు వచ్చినవాడు.. ప్రపంచంలో అతిపెద్ద వలస సామ్రాజ్యానికి పునాది వేశాడని.. భారతావని 200 ఏళ్లు బానిసయ్యేందుకు కారణమయ్యాడని.. వందల ఓడల్లో భారత్‌ నుంచి సంపదను దోచుకుపోయాడని మీకు తెలుసా? అనంతరం ఆయన ఐరోపాలోనే అత్యంత సంపన్నుడయ్యాడు. ఆయనే రాబర్ట్‌ క్లైవ్‌!(robert clive achievements)

  • అది సులభమేం కాదు

న్యూజిలాండ్​పై మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను (Ind vs NZ T20 Series 2021) క్వీన్​స్వీప్ చేసింది టీమ్​ఇండియా. అయితే ఈ విజయం పట్ల వాస్తవికంగా ఉండాలన్నాడు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid Coach News). టీ20 ప్రపంచకప్​ గెలిచిన మూడు రోజుల్లోనే సిరీస్​ ఆడడం న్యూజిలాండ్​కు అంత సులువు కాదని అన్నాడు.

08:01 November 22

టాప్​న్యూస్​@8AM

  • విపక్షాల అస్త్రాలు ఇవే!

ధరల పెరుగుదల, చైనా చొరబాట్లు, పెగసస్ స్పైవేర్​ అంశాలపై (Parliament Winter Session 2021) కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 29 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోదీ సర్కార్​ను ఇరుకునపెట్టేలా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగు చట్టాల రద్దుకు బిల్లు ప్రవేశపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది.

  • కాంగ్రెస్​ కౌంటర్​ రాజకీయం

రాష్ట్రంలో వడ్ల కొనుగోలు అంశంలో... తెరాస, భాజపాలపై కాంగ్రెస్‌ మరింత ఒత్తిడి పెంచుతోంది. కల్లాల్లోకి కాంగ్రెస్‌ అంటూ క్షేత్ర స్థాయిలోకి దిగిన హస్తం నాయకులు.. కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు క్రెడిట్‌ తమదేనంటూ తెరాస నాయకులు చెబుతున్న మాటలకు కాంగ్రెస్‌ కౌంటర్‌ రాజకీయాలకు తెరతీసింది.

  • పూర్తిగా నిలిపేయనున్న మారుతీ!

కాలుష్య ఉద్గారాల తగ్గింపు చర్యల్లో తన వంతు బాధ్యతగా డీజిల్‌ వాహనాలను ఉత్పత్తిని చేయట్లేదని దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ(maruti suzuki cars) తెలిపింది. అధిక మైలేజీ ఇచ్చే.. పెట్రోల్‌ కార్లపైనే దృష్టి సారించనున్నట్లు వివరించింది.

  • బీజింగ్​లో పెంగ్ ప్రత్యక్షం

కొంత కాలంగా కనిపించకుండాపోయిన చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి (Peng Shuai Missing) మళ్లీ అభిమానుల ఎదుట ప్రత్యక్షమైంది. బీజింగ్‌లో జరుగుతున్న యూత్‌ టోర్నీకి పెంగ్‌ ఆతిథిగా హాజరైనట్లు నిర్వాహకులు వీడియోతో పాటు ఫొటోలు కూడా విడుదల చేశారు.

  • అన్​సీజన్​లో అదిరే వినోదం

కుదిరితే పండగ గురి.. లేదంటే వేసవి బరి.. అగ్రతారల చూపెప్పుడూ వీటిపైనే ఉంటుంది. మామూలు రోజుల్లో బాక్సాఫీస్‌ రేసులో నిలవడాన్ని అరుదుగా చూస్తుంటాం. సినీ సీమకు అన్‌ సీజన్‌గా భావించే ఫిబ్రవరిని లక్ష్యం చేసుకోవడమంటే ఓ సాహసమనే అనుకోవాలి. ఇప్పుడిలాంటి సాహసాన్నే చేసి చూపుతున్నారు పలువురు అగ్రతారలు. కుర్ర హీరోలతో కలిసి అన్‌ సీజన్‌లో కాసుల పంట పండించేందుకు సిద్ధమవుతున్నారు.

06:48 November 22

టాప్​న్యూస్​@ 7AM

  • ఎంఎంటీఎస్​ సర్వీసులు రద్దు

హైదరాబాద్​లో ఈరోజు, రేపు.. పలు ఎంఎంటీఎస్​ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల ఈనెల 22, 23 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

  • వీడుతున్న అపనమ్మకాలు

కేపీ ఓలీ హయాంలో భారత్​-నేపాల్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు (India Nepal relations) దెబ్బతిన్నాయి. చైనాతో ఓలీ వైఖరిపై విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఓలీ స్థానంలో కాంగ్రెస్‌ నేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా బాధ్యతలు స్వీకరించాక ఇండియాతో మైత్రి దిశగా ఆశలు చిగురించాయి.

  • వాయుసేన నిర్ణయం

రఫేల్ యుద్ధ విమానాలను వచ్చే ఏడాది (rafale fighter plane) జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు వాయుసేన సిద్ధమైంది. ఇప్పటికే అప్‌గ్రేడ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.

  • రోహిత్-ద్రవిడ్ కాంబో హిట్

టీ20 ప్రపంచకప్​లో గ్రూప్​ దశలోనే టీమ్​ఇండియా (Team India News) నిష్క్రమించడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. అయితే ఆ వెంటనే న్యూజిలాండ్​తో (India vs New Zealand 2021) టీ20 సిరీస్​ను 3-0తో క్లీన్​స్వీప్​ చేసి గట్టి కమ్​బ్యాక్​ ఇచ్చింది రోహిత్ సేన.

  • ఫ్యాన్సే అండగా నిలిచారు

'మన్మధ', 'వల్లభ' వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు. ఇటీవలే 'ఈశ్వరుడు'గా సినీప్రియుల ముందుకొచ్చిన ఆయన.. ఇప్పుడు 'లూప్‌'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన చిత్రమిది.

04:12 November 22

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • హస్తినలో సీఎం కేసీఆర్​..

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు, విభజన చట్టంలో హామీలు, నీటి వాటా కేటాయింపుల్లో స్పష్టత తదితర విషయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు, ఉన్నతాధికారుల బృందాలు హస్తినకు వెళ్లాయి. నాలుగురోజుల పాటు అక్కడే ఉండి ప్రధాని సహా కేంద్రమంత్రులతో సీఎం సమావేశం కానున్నారు.

  • నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఏకగ్రీవం..

శాసనమండలి ఎమ్మెల్యే కోటా(mla quota mlc election)లో ఆరుగురు తెరాస అభ్యర్థులు(trs mlc candidates 2021) నేడు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిశాక.. తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం(trs mlc candidates unanimous)గా ఎన్నికైనట్టు లాంఛనంగా ప్రకటించి ధృవపత్రం ఇవ్వనున్నారు.

  • తెరాస స్థానికసంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్​..

శాసనమండలి స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక(trs mlc candidates list in telangana 2021)లోనూ తెరాస తనదైన వ్యూహాన్ని అమలుచేసింది. సగానికి పైగా సిట్టింగ్ అభ్యర్థులను మార్చింది. సామాజిక, రాజకీయ పరిణామాలతోపాటు గతంలో ఇచ్చిన హామీలు, విధేయతకు కేసీఆర్​(cm kcr latest news) పెద్దపీట వేశారు. తెరాస అభ్యర్థుల(trs mlc candidates list in telangana 2021)కు.. నేడు జిల్లా మంత్రులు బీ ఫారాలు(b forms to mlc candidates) ఇవ్వనున్నారు.

  • వరిసాగుపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

రాష్ట్రంలో వరి కొనుగోళ్ల అంశం ఆందోళనకరంగా మారిన పరిస్థితుల్లో.. ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముందని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పంటమార్పిడీ ఆవశ్యకతను రైతులకు వివరిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

  • వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు..

ఆంధ్రప్రదేశ్​లో కురుస్తోన్న వర్షాల(rains in andhra pradesh)తో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం(train interruptions today) ఏర్పడింది. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాలపై నీళ్లు వచ్చి చేరాయని, మరికొన్ని ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులకు గురైందని రైల్వేశాఖ(South Central Railway) వెల్లడించింది. ట్రాక్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని... వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేశాఖ పేర్కొంది. 

  • దిల్లీలో స్కూళ్లు బంద్​..

దిల్లీలో అంతకంతకూ పడిపోతున్న గాలి నాణ్యతను (air pollution in delhi) దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ సర్కార్​ మరో నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలుబడే వరకు పాఠశాల బోధనను ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డైరెక్టరేట్​ ఆఫ్​ ఎడ్యూకేషన్​ ఉత్తర్వులు జారీ చేసింది.

  • కరోనా ఆంక్షలపై నిరసన జ్వాలలు..

కరోనా ఆంక్షలపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ పలు దేశాల్లో ప్రజలు నిరసనలు చేపట్టారు. బెల్జియంలో జరిగిన (Belgium Coronavirus Restrictions) నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. డచ్​లో ఇప్పటివరకు 51 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మరోవైపు సోమవారం నుంచి ఆంక్షలు అమలు కానున్న నేపథ్యంలో ఆస్ట్రియాలో ప్రజలు ఆదివారం మార్కెట్లకు పోటెత్తారు.

  • పీఎన్​బీ ఖాతాదార్ల సమాచారం బహిర్గతం..

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కస్టమర్ల సమాచారం బహిర్గతమైనట్లు (PNB Server Vulnerability) సైబర్​ ఎక్స్​9 అనే సంస్థ వెల్లడించింది. సర్వర్​లో లోపం కారణంగానే ఇది జరిగినట్లు పేర్కొంది. అయితే.. ఖాతాదారుల సమాచారం గోప్యంగానే ఉందంటూ పీఎన్​బీ తెలిపింది.

  • న్యూడిలాండ్​ను క్లిన్​స్వీప్​ చేసిన భారత్​..

న్యూజిలాండ్​తో జరిగిన మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది టీమ్​ఇండియా. నేడు(నవంబరు 21) జరిగిన మూడో టీ20లోనూ(చివరిది) 73పరుగులు తేడాతో గెలిచి 3-0తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది.

  • కైకాల లేటెస్ట్​ హెల్త్​ అప్​డేట్​..

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై(actor satyanarayana health condition) హెల్త్​ బులిటెన్​ను విడుదల చేశారు వైద్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వివవరించారు.

Last Updated : Nov 22, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.