క్రిస్మస్ ఊరేగింపుపైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

author img

By

Published : Nov 22, 2021, 9:47 AM IST

Updated : Nov 22, 2021, 11:53 AM IST

CHRISTMAS PARADE

క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నవారి పైకి (SUV Christmas parade) ఎస్​యూవీ దూసుకెళ్లింది. మొత్తం 20 మందిని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు.

క్రిస్మస్ పరేడ్​లో పాల్గొన్న జనాలపైకి తన ఎస్​యూవీతో (US Christmas parade accident) దూసుకెళ్లాడు ఓ డ్రైవర్. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. ఇందులో చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా విస్కాన్సిన్​లోని వౌకేశా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

  • Graphic video shows a speeding vehicle ram through participants of the Christmas parade in #Waukesha, Wisc. Few details confirmed at this point though the police said they have a person of interest they’re looking into. pic.twitter.com/zKEX1VoC2T

    — Andy Ngô 🏳️‍🌈 (@MrAndyNgo) November 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఘటన తర్వాత ఆ ప్రాంతం అంతా భీతావహ వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ చీఫ్ డేన్ థాంప్సన్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

US CHRISTMAS PARADE
ప్రమాదం జరిగిన ప్రాంతం
US CHRISTMAS PARADE ACCIDENT
.
US CHRISTMAS PARADE ACCIDENT
.

కారు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినవని పేర్కొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కారు దూసుకెళ్లిన సమయంలో పలుమార్లు తుపాకీ శబ్దం వినిపించింది. కారును ఆపేందుకు పోలీసులే ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

US CHRISTMAS PARADE ACCIDENT
చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు
US CHRISTMAS PARADE ACCIDENT
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
US CHRISTMAS PARADE ACCIDENT
.
US CHRISTMAS PARADE ACCIDENT
పహారా కాస్తున్న పోలీసు సిబ్బంది

ఇదీ చదవండి: ఆర్మీ క్యాంప్​ ఎదుట గ్రనేడ్ పేలుడు.. నగరమంతా హై అలర్ట్​

Last Updated :Nov 22, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.