కొవాగ్జిన్ వేసుకున్నవారికి యూకే అనుమతి

author img

By

Published : Nov 22, 2021, 9:36 PM IST

Covaxin

భారత్​ నుంచి యూకేకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు (India to UK travel restrictions) ఇకపై మార్గం సుగమం కానుంది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం.. యూకే ఆమోదించే టీకా జాబితాలో కొవాగ్జిన్​కు (Covaxin uk travel) చోటు దక్కింది.

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం తాము ఆమోదించే టీకా జాబితాలో కొవాగ్జిన్​కు (Covaxin uk travel) చోటు కల్పించింది బ్రిటన్​ ప్రభుత్వం. కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకుని భారత్​ నుంచి యూకేకు వెళ్లాలనుకునే పర్యటకులకు ఇకపై ఆ దేశం నేరుగా అనుమతి లభించనుంది. ప్రయాణానికి ముందు.. కరోనా రిపోర్టులు, టెస్టులు అంటూ.. ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. వెళ్లాక కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది!

అత్యవసర వినియోగం కోసం డబ్ల్యూహెచ్​ఓ గుర్తించిన టీకాలను స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4 గంటల నుంచి అనుమతి ఇవ్వనున్నామని యూకే రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఫలితంగా సినోవాక్​, సినోఫార్మ్​, కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్నవారికి తమ దేశంలోకి రావడానికి అడ్డంకులు తొలగిపోనున్నాయని వెల్లడించింది.

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ గత నెలలో అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి:'కరోనా కాలంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.