Amaravati capital news: 'వికేంద్రీకరణే మా ప్రభుత్వ ఉద్దేశం, త్వరలో కొత్త బిల్లుతో వస్తాం..'

author img

By

Published : Nov 22, 2021, 4:34 PM IST

Updated : Nov 22, 2021, 5:06 PM IST

ap three capitals

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని పీటీఐ(Amaravati capital news) వార్తా సంస్థ వెల్లడించింది. వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని శాసనసభలో ఏపీ సీఎం జగన్ ప్రకటించినట్లు పీటీఐ తెలిపింది. రాష్ట్ర విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే జగన్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఈ చట్టం స్థానంలో కొత్త బిల్లు ప్రవేశపెడతామని సీఎం ప్రకటించినట్లు తెలిపింది.

అమరావతి(Amaravati capital news) ప్రాంతమంటే తనకు వ్యతిరేకత లేదని, అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ సీఎం జగన్​ నేడు శాసనసభలో ప్రకటన చేశారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. (jagan on capital amaravathi in ap assembly)అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని జగన్​ స్పష్టం చేసినట్లు పీటీఐ వెల్లడించింది. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని శాసనసభలో సీఎం వెల్లడించినట్లు పీటీఐ(AP government repeals 3 capital laws) తెలిపింది. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలు వచ్చాయని సీఎం వెల్లడించినట్లు పేర్కొన్న పీటీఐ.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని సీఎం ప్రకటించినట్లుగా స్పష్టం చేసింది. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలు వచ్చాయని సీఎం వెల్లడించారని.. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని పీటీఐ పేర్కొంది.

అమరావతి సీఆర్‌డీఏ(CRDA) చట్టాన్ని పునరుద్ధరిస్తూ సోమవారం ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది.

భవిష్యత్తు కోసమే: జగన్​

'ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటూరులో హైకోర్టు ఉండేది. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేయాల్సి ఉంది. 1956లో కర్నూలు నుంచి రాజధానిని, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు తీసుకుపోయారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు రూ.2కోట్లు చొప్పున 50వేల ఎకరాలకు లక్ష కోట్లు అవుతుందని గత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఖర్చు తాజా లెక్కల ప్రకారం అవుతుంది. పదేళ్ల తర్వాత ఈ లక్ష కోట్ల విలువ ఆరేడు లక్షల కోట్లు అవుతుంది. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. వాటికి అదనపు హంగులు అద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలనే తాపత్రయంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసనసభ, ఒకప్పటి రాజధాని అయిన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, తద్వారా ప్రజలకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలో ఏమేం జరిగాయో అన్నీ చూశాం. రకరకాలు అపోహలు సృష్టించారు. న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యేలా చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది’. అని సీఎం జగన్​ శాసనసభలో ప్రసంగించారని పీటీఐ వెల్లడించింది.

రాజధానుల బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల(AP three capital laws repeal) ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవని శాసనసభలో జగన్​ ప్రస్తావించినట్లు పీటీఐ పేర్కొంది. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడిన ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని​ ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారని తెలిపింది. అందుకే వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టినట్లు పీటీఐ వెల్లడించింది.

మంచిదని నమ్మాం: జగన్​

''గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు ఎంత వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్‌లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని, ప్రజల తీర్పు స్పష్టం చేసింది. అందుకే వికేంద్రీకరణ సరైన విధానమని నమ్మి అడుగులు వేశాం. అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు వీరందరి ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది కాబట్టే ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని మనసారా దీవించారు. అయితే, వికేంద్రీకరణ సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు చేశారు. వికేంద్రీకరణ మంచిదని నమ్మి అడుగులు వేశాం. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు(AP three capitals law has been withdrawn) సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు పరిచేందుకు విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం’.’ అని సీఎం జగన్‌ శాసనసభలో ప్రకటన చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ కథనం వెలువరించింది.

ఇదీ చదవండి: three capitals withdrawn : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

Last Updated :Nov 22, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.