వర్ష బీభత్సానికి 24 మంది బలి- 5 లక్షల ఎకరాల పంట నష్టం
Updated on: Nov 22, 2021, 2:14 PM IST

వర్ష బీభత్సానికి 24 మంది బలి- 5 లక్షల ఎకరాల పంట నష్టం
Updated on: Nov 22, 2021, 2:14 PM IST
కర్ణాటకలో కుండపోత వర్షాలతో (Heavy rains in karnataka) ఇప్పటివరకు 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 5 లక్షల ఎకరాలకుపైగా పంటదెబ్బతిన్నట్లు పేర్కొంది. మరోవైపు.. బెంగళూరు జలదిగ్భందం అయింది. ఎటు చూసినా వరదనీటితో నిండిపోయింది.
భారీవర్షాల కారణంగా కర్ణాటకలో (Rain in Bangalore) 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. దాదాపు 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 8,495 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు పేర్కొంది. వర్షం కారణంగా.. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, తుమకూరు, కోలార్, చిక్కబళ్లాపుర్, రామ్‌నగర్, హసన్ జిల్లాలు తీవ్ర ప్రభావం చెందినట్లు తెలిపింది.
భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిన క్రమంలో పరిహారం కింద రూ. 130కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
బెంగళూరు జలదిగ్భందం..
బెంగళూరు జలదిగ్భందం అయింది. నగరంలో ఎటు చూసినా వరదనీరే కనిపిస్తోంది. కాలనీలు, అపార్ట్మెంట్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం.. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిరాశ్రయులైన ప్రజలకు ప్రజలకు ఆహార పంపిణీ చేపట్టారు అధికారులు.
ఇదీ చూడండి: వరద ఉద్ధృతిలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!
