దూసుకుపోతున్న 'అఖండ' ట్రైలర్​.. 'మైఖేల్​'లో గౌతమ్ మేనన్

author img

By

Published : Nov 22, 2021, 2:10 PM IST

balakrishna  gautham menon

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అఖండ, మైఖేల్, శేఖర్, క్యాలీఫ్లవర్, బ్రో చిత్రాలకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి.

*నందమూరి బాలకృష్ణ 'అఖండ' ట్రైలర్​ యూట్యూబ్​లో దూసుకుపోతుంది. ప్రస్తుతం 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో బాలయ్య అఘోరాగా విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.

*సందీప్ కిషన్-విజయ్ సేతుపతి నటిస్తున్న మల్టీస్టారర్ 'మైఖేల్'. ఇందులోని ప్రతినాయకుడిగా నటుడు-దర్శకుడు గౌతమ్​ మేనన్ నటిస్తున్నారని సోమవారం వెల్లడించారు. సంకెళ్లు, రక్తంతో ఉన్న చేతికి సంబంధించిన పోస్టర్​ను రిలీజ్ చేశారు.

యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

*సీనియర్ నటుడు రాజశేఖర్ కొత్త సినిమా 'శేఖర్'. ఈ సినిమా ఫస్ట్​ గ్లింప్స్​ను గురువారం(నవంబరు 25) రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు.

sekhar movie
రాజశేఖర్ శేఖర్ మూవీ

ఇందులో రాజశేఖర్​ రిటైర్డ్​ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మలయాళ సినిమా 'జోసెఫ్'కు ఇది రీమేక్! అను సితార, మస్కన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తుండగా, జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చిత్రబృందం భావిస్తోంది.

*సంపూర్ణేశ్​బాబు 'క్యాలీఫ్లవర్' సినిమాలోని 'జుమ్ జుమ్' అంటూ సాగే లిరికల్ గీతం విడుదలైంది. ఇందులో సంపూ సరసన వాసంతి హీరోయిన్​గా చేసింది. నవంబరు 26న థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బ్రో'. ఈ సినిమాలోని 'ఊహల్లో..' లిరికల్ సాంగ్​ను సోమవారం రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర ఈ గీతానికి సంగీతమందించారు.

కార్తికే తుపరని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.