chandrababu on three capitals: సీఎం వైఖరితో ఏపీకి తీవ్ర నష్టం: చంద్రబాబు

author img

By

Published : Nov 22, 2021, 6:06 PM IST

Updated : Nov 22, 2021, 6:28 PM IST

chandrababu on three capitals

ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu fire on jagan over capital city) మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గటంతో పాటు రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతోందన్నారు.

ఏపీ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu comments on jagan) అన్నారు. రాజధానిపై సీఎం వైఖరి వల్ల ఉపాధి అవకాశాలు తగ్గటంతో పాటు రాష్ట్ర ఆదాయానికీ భారీగా గండి పడుతోందన్నారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 34 మంది చనిపోగా.. 10 మంది గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

'జగన్ రెడ్డి హెలికాఫ్టర్​లో ఏరియల్ రివ్యూ చేసి చేతులు దులుపుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో విఫలమయ్యారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అజాగ్రత్త, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తా. వివేకానంద రెడ్డిని ఆయన అల్లుడే చంపించాడని కట్టుకథలు అల్లిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలు, అవినీతి, వివేకానందరెడ్డి హత్య నుంచి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. జగన్ పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఇళ్ల స్థలాలు, వాటిల్లో నిర్మించిన ఇళ్లను రెగ్యులరైజ్ పేరుతో ఒక్కో పేద కుటుంబం నుంచి రూ.10 వేల నుంచి 20 వేలు వసూలు చేసి..ఆదాయం పొందాలనుకోవటం దుర్మార్గమైన చర్య. పేద కుటుంబాలు ఎవరూ ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల్లో ఉచితంగా పేదలకు పంపిణీ చేస్తాం."- చంద్రబాబు, తెదేపా అధినేత

మూడు రాజధానుల బిల్లు రద్దు..

మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం (Three Capitals repeal bill) ఉపసంహరించుకున్నట్లు పీటీఐ వార్త సంస్థ కథనం వెలువరించింది. వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని సీఎం జగన్ శాసనసభలో స్పష్టం చేసినట్లు వెల్లడించింది. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని.. విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని సీఎం ప్రకటించారు. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలు వచ్చాయని వెల్లడించిన సీఎం.. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలు వచ్చాయన్నారు. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని తెలిపిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని సీఎం తెలిపినట్లు పీటీఐ వెల్లడించింది.

ఇవీ చదవండి:

Amaravati capital news: 'వికేంద్రీకరణే మా ప్రభుత్వ ఉద్దేశం, త్వరలో కొత్త బిల్లుతో వస్తాం..'

AP High Court on three capitals cases: '3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి'

Last Updated :Nov 22, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.