యూపీలో పాగా కోసం మజ్లిస్ ఆరాటం.. వంద సీట్లలో పోటీ

author img

By

Published : Nov 22, 2021, 12:14 PM IST

aimim in up election

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలపై కన్నేసిన మజ్లిస్ పార్టీ (UP Elections AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. వంద సీట్లలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకునే విషయంపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

భాజపా, సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్, కాంగ్రెస్​తో పాటు ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో పార్టీ (MIM in UP election) ఎంఐఎం. పార్టీ మూలాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Owaisi alliance in UP).. యూపీ ఎన్నికల బరిలోకి దిగి, విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం ప్రాబల్య ప్రాంతాలపై కన్నేశారు. మొత్తం యూపీ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా.. 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

దళితులు, ముస్లింల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని ఎన్నికల బరిలో దిగుతోంది ఎంఐఎం. యూపీ జనాభాలో 40 శాతానికి పైగా వాటా ఈ రెండు సామాజిక వర్గాలదే. వీరంతా సమాజ్​వాదీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నారు. మజ్లిస్ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువగా నష్టపోయేది అఖిలేశ్ పార్టీనే. ముస్లిం, దళితుల ఓట్లను ఎంఐఎం చీల్చగలిగితే.. ఎస్పీకి అపార నష్టం జరుగుతుంది.

ఒంటరిగానా? కూటమితోనా?

ఈ నేపథ్యంలో పొత్తుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు ఒవైసీ. కూటమి ఏర్పాటు విషయంపై ఒకట్రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పొత్తు విషయం కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో గెలుపు మాత్రం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఇతర పార్టీలతో పొత్తు కోసం ఆది నుంచీ ప్రయత్నాలు చేశారు ఒవైసీ. అయితే, ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తొలుత పెద్ద పార్టీలపైనే దృష్టిసారించి చిన్న పార్టీలను దూరం చేసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కూటమి ఏర్పాటు చేయాలని భావించారు ఒవైసీ. కానీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూటమి అంశాన్ని బహిరంగంగానే కొట్టిపారేశారు. ఆ తర్వాత ఓంప్రకాశ్ రాజ్​భర్​తో కలిసి 'భాగీదారీ సంకల్ప్ మోర్చా' పేరుతో కూటమి (Owaisi alliance in UP) ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే, చివరి క్షణంలో సమాజ్​వాదీ పార్టీతో చేతులు కలిపిన రాజ్​భర్.. ఒవైసీకి (MIM in UP election) హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఏకాకిగా మిగిలిపోయారు ఒవైసీ.

ఎస్పీతో జట్టుకట్టే ఛాన్స్?

ఒవైసీతో కూటమిని సమాజ్​వాదీ పార్టీ వ్యతిరేకించలేదు. మజ్లిస్​తో పొత్తుపై (Owaisi alliance in UP) ఎస్పీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో సమాజ్​వాదీ కూటమిలో చేరే అవకాశం మజ్లిస్​కు (MIM in UP election)ఇంకా మిగిలే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, ఒవైసీని యూపీ ఓటర్లు విశ్వసించే పరిస్థితి లేదని మరికొందరు వాదిస్తున్నారు. యోగి పాలనపై కొంతమంది ముస్లిం వర్గాలలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది మజ్లిస్​కు అనుకూలంగా మారే అంశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: యూపీలో ఒంటరైన ఒవైసీ.. యోగి పరోక్ష మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.