18 కోట్ల మంది పీఎన్‌బీ కస్టమర్ల డేటా బహిర్గతం!

author img

By

Published : Nov 22, 2021, 3:33 AM IST

punjab national bank

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కస్టమర్ల సమాచారం బహిర్గతమైనట్లు (PNB Server Vulnerability) సైబర్​ ఎక్స్​9 అనే సంస్థ వెల్లడించింది. సర్వర్​లో లోపం కారణంగానే ఇది జరిగినట్లు పేర్కొంది. అయితే.. ఖాతాదారుల సమాచారం గోప్యంగానే ఉందంటూ పీఎన్​బీ తెలిపింది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​కు చెందిన 18 కోట్ల మంది ఖాతాదారుల (PNB Server Vulnerability) సమాచారం గత ఏడు నెలలుగా బహిర్గతంగా ఉన్నట్లు సైబర్​ సెక్యూరిటీ సంస్థ సైబర్​ ఎక్స్​9 వెల్లడించింది. బ్యాంక్​ సర్వర్​లో లోపం ఉండటమే అందుకు కారణమని పేర్కొంది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్‌ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్‌ చేసే అవకాశాన్ని (PNB Server Vulnerability) సర్వర్‌లోని లోపం కల్పించిందని ఆ సంస్థ తెలిపింది. అయితే, సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ఖాతాదారులకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్‌ చేసినట్లు తెలిపింది.

"పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన 18 కోట్ల ఖాతాదారుల సమాచారం (PNB Server Vulnerability) గత ఏడు నెలలుగా బహిర్గతంగా ఉంది. ఖాతాదారుల వ్యక్తిగత సమచారం, ఆర్థిక వివరాలు, నగదు విషయంలో ఆ బ్యాంక్‌ రాజీ పడింది. సైబర్‌ ఎక్స్‌9 చెప్పిన తర్వాతే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేల్కొంది. ఇదే విషయాన్ని సీఈఆర్​టీ-ఇన్​, ఎన్​సీఐఐపీసీకి కూడా తెలియజేశాం" అని సైబర్‌ ఎక్స్‌9 వ్యవస్థాపకుడు, ఎండీ హిమాన్షు పాతక్ తెలిపారు. సైబర్‌ దాడులకు వీలు కల్పించే విధంగా ఈ లోపం ఉందని, అడ్మిన్‌ యాక్సెస్‌ సైతం అందించేవిధంగా ఈ లోపాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 19న పీఎన్‌బీ చర్యలు చేపట్టినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది.

అయితే, దీనిపై పీఎన్‌బీ స్పందిస్తూ.. సర్వర్‌లో లోపం ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందులో ఎలాంటి సున్నితమై, క్లిష్టమైన డేటా లేదని పేర్కొంది. ఆన్‌-ప్రిమ్‌ నుంచి ఆఫీస్‌ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూట్‌ చేయడానికి మాత్రమే ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. సైబర్‌ ఎక్స్‌9 చెప్పినట్లుగా ఖాతాదారులకు సంబంధించిన డేటా ఏదీ బయటకు రాలేదని చెప్పింది. ఎప్పటికప్పుడు సీఈఆర్​టీ-ఇన్ ఎంప్యానెల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆడిటర్లు తనిఖీ చేస్తూనే ఉన్నారని వివరించింది. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్‌ చేసినట్లు వివరించింది.

ఇదీ చూడండి : Market Outlook: ఈ వారం మార్కెట్ల దారెటు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.