ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

author img

By

Published : Oct 31, 2021, 5:57 AM IST

Updated : Oct 31, 2021, 9:50 PM IST

top news@6AM
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

20:41 October 31

టాప్​న్యూస్ @ 9PM

  • ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్​..

శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్(MLC Election Schedule) విడుదలైంది. నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ కానుండగా... 29న పోలింగ్ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం... తాజాగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది.

  • థర్డ్​వేవ్​ తప్పదా..

పండగ సీజన్​ దృష్ట్యా.. దేశంలోని చాలా ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు(Covid-19 Norms) అమల్లో లేవని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. రెండు శాతం మంది భారతీయులు మాత్రమే.. తమ ప్రాంతాల్లో మాస్కు ధారణ(Corona Guidelines) పాటిస్తున్నారని అనుకుంటున్నట్లు వెల్లడైంది.

  • బాలుడిపై జడ్జి లైంగిక వేధింపులు..

రాజస్థాన్​లో ఓ జడ్జి 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధిస్తున్నట్లు సంచలన ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెడితే చంపుతామని జడ్జి తమను బెదిరించినట్లు వెల్లడించారు.

  • గోల్​కీపర్​గా గ్రౌండ్​లో సీఎం..

అభిమానులతో కిక్కిరిసిపోయి ఉన్న క్రీడా మైదానంలోకి ఓ ముఖ్యమంత్రి అడుగుపెట్టారు. ఆట చూసేందుకు ఆయన వచ్చారని అనుంకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే! ఆ మ్యాచ్​లో స్వయంగా బరిలోకి దిగిన సీఎం.. గోల్​కీపర్​గా వ్యవహరించారు.

  • హైదరాబాద్​లో రెండో షెడ్యూల్​ 

హీరో రామ్​చరణ్​-దర్శకుడు శంకర్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా తొలి షెడ్యూల్​ చిత్రీకరణ నవంబరు 2న పూర్తికానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండో షెడ్యూల్​ను హైదరాబాద్​లో చిత్రీకరించనున్నారట.


 


 


 

19:55 October 31

టాప్​న్యూస్ @ 8PM

  • ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్​..

శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్(MLC Election Schedule) విడుదలైంది. నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ కానుండగా... 29న పోలింగ్ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం... తాజాగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది

  • రాష్ట్రంలో స్వల్ప భూప్రకంపనలు

జగిత్యాల, రామగుండం, లక్షెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. సాయంత్రం 6.49 గం.కు 3 సెకన్లపాటు భూమి కంపించింది. భూప్రకంపనలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.

  • కేటీఆర్​ను కలిసిన నెగర్స్​..

నాలుగురోజుల పర్యటనలో భాగంగా కేటీఆర్​ బృందం ఫ్రాన్స్​కు వెళ్లింది. భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన (IT Minister KTR) చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కేటీఆర్​ పలువురిని కలుసుకుంటుండగా.. మూడు దశాబ్దాలకుపైగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్​ డానియేల్‌ నెగర్స్‌ మంత్రిని కలిశారు.

  • పార్లమెంట్​కు కాఫీ తాగేందుకు వెళ్తున్నారా..

ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేస్తుంటే వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జనసేనాని పవన కల్యాణ్​. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' నినాదంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించారు. కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్.. కార్మికులకు సంఘీభావం తెలిపారు.

  • అఫ్గనిస్తాన్​ ఘన విజయం..

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) జరిగిన మ్యాచ్​లో నమీబియాపై విజయం సాధించింది అఫ్గానిస్థాన్. 62 పరుగుల తేడాతో గెలుపొందింది. నమీబియా బౌలర్లలో నవీన్​ ఉల్​ హక్​ 3, హమీద్​ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నారు.




 

18:43 October 31

టాప్​న్యూస్ @ 7PM

  • కోలుకున్న మన్మోహన్​సింగ్​..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన​ ఆరోగ్యం మెరుగుపడినందున ఇంటికి పంపినట్లు దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు వెల్లడించారు.

  • డ్రగ్స్​ కేసుపై సుప్రీంలో పిల్​..

ముంబయి క్రూయిజ్ షిప్​ డ్రగ్స్ కేసు విచారణ దశలో ఉన్నప్పటికీ.. పలువురు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ కేసులో సీబీఐతో విచారణతో పాటు.. సాక్షుల రక్షణకు ప్రత్యేక విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అందులో కోరారు.

  • 15 రోజుల్లో 5 ఐపీఓలు..

వచ్చేనెల తొలి అర్ధ భాగంలో పేటీఎం సహా ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు(ఐపీఓ) రానున్నాయి. పేటీఎం రూ.18 వేల కోట్లకుపైగా సమీకరించి.. దేశంలో అతిపెద్ద ఐపీఓ అవతరించే అవకాశం ఉంది. దీనితో పాటు మరో నాలుగు సంస్థలు పబ్లిక్ ఇష్యూ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఐదు ఐపీఓల ద్వారా రూ. 27 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

  • ఆటో కరెక్ట్‌ ఫీచర్‌ను డిసేబుల్ చేయండిలా...

ఆండ్రాయిడ్​ ఫోన్​లో మెసేజ్​ టైప్​ చేసినప్పుడు, ఇంటర్నెట్​లో సమాచారం వెతికినప్పుడు ఆటోకరెక్ట్​ ఫీచర్​తో ఒక్కోసారి ఇబ్బందులు ఎదురువుతాయి. కొన్నిసార్లు మనం ఒకటి టైప్​ చేస్తే.. అక్కడ మరో పదం ప్రత్యక్షమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆటో కరెక్ట్‌ ఫీచర్‌ను డిసేబుల్ చేయడం మినహా మరో దారిలేదు. ఇంతకీ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌లో ఆ ఫీచర్‌ను ఎలా డిసేబుల్ చేయాలంటే..?

  • మత్తెక్కిస్తోన్న ముద్దుగుమ్మల అందాలు..

పలువురు అందాల తారలు తమ కొత్త లుక్స్​తో సోషల్​మీడియాలో దర్శనమిచ్చారు. వారి, లుక్​లు, పోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. వాటిని ఓ సారి చూసేద్దాం...
 

17:49 October 31

టాప్​న్యూస్ @ 6PM

  • 14 మంది నక్సల్స్​ లొంగుబాటు..

ఛత్తీస్​గఢ్​లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒక్కరోజే 14 మంది నక్సల్స్​.. జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. 2017లో సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై దాడి చేసి 25 మందిని పొట్టనపెట్టుకున్న ఘటనలో వీరంతా నిందితులుగా ఉన్నారు.

  • ఆ అవిభక్త కవలలు ఇకలేరు..

ఛత్తీస్​గఢ్​కు చెందిన అవిభక్త కవలలు(conjoined twins) శివరామ్​, శివనాథ్​ ఇకలేరు. జ్వరంతో బాధపడుతూ శనివారం ప్రాణాలు(conjoined twins die together) కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. ఎంతో చురుకుగా ఉండే వారు అకస్మాత్తుగా మృతి చెందటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు.

  • పశ్చిమాసియా మీదుగా అమెరికా బాంబర్​..

అమెరికాకు చెందిన బీ-1బీ ఎయిర్​క్రాఫ్ట్​ బాంబర్.. పశ్చిమాసియాలోని(Middle East News) మారిటైం చోక్​ పాయింట్స్ మీదగా వెళ్లినట్లు ఆ దేశ నావికదళం ప్రకటించింది. ఈ చర్య వల్ల మిత్రదేశాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ భరోసా కల్పిస్తున్నట్లు ట్వీట్​ చేసింది.

  • స్నిత్​పై వార్న్​ విమర్శలు..

ఆస్ట్రేలియా బ్యాటర్​ స్టీవ్ స్మిత్​పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ జట్టు మాజీ ఆటగాడు షేన్ వార్న్(Shane Warne Steve Smith). టీ20 జట్టులో స్టీవ్​ స్మిత్​ను(Steve Smith News) ఆడించొద్దని ట్వీట్ చేశాడు. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇంగ్లాండ్​తో ఓడిపోయినంత మాత్రాన ఆసీస్​ జట్టు గొప్పదికాకుండా పోదని, టీ20ల్లో ఇప్పటికీ ఆస్ట్రేలియా మేటి జట్టే అని కెప్టెన్ ఆరోన్​ ఫించ్​ అన్నాడు.

  • స్క్విడ్‌గేమ్‌లో ప్లేయర్​ మనోడే

అంతర్జాతీయంగా ప్రేక్షకాదరణ పొందుతున్న వెబ్‌సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్'(squid game season 2). విడుదలైనప్పటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ముదులుపుతోంది(squad game review 2021). మనీహైస్ట్‌, లుపిన్‌లను దాటేసి ఎక్కువ మంది చూసిన డెబ్యూ వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఇందులో ప్లేయర్‌ 199గా, అలీ అబ్దుల్‌గా(squid game ali abdul) అదరగొట్టిన నటుడికి భారతదేశంతో ప్రత్యేక అనుబంధముంది. అదేంటో చదివేద్దాం..


 


 


 


 


 

17:13 October 31

టాప్​న్యూస్ @ 5PM

  • ఆ రెండు రోజులు భారీ వర్షాలు..

రాష్ట్రంలో నవంబర్​ 3, 4 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 నుంచి మూడు రోజులలో అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది.

  • ప్రేమపెళ్లికి కులపెద్దల శిక్ష..

ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అబ్బాయితో పాటు అతడి కుటుంబానికి పెద్ద శిక్షే పడింది. ఎలాగూ ఒప్పుకోరని తెలిసి.. ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న ఆ జంటకు న్యాయం చేయాల్సిన పంచాయితీ పెద్దలు.. రాతి యుగం నాటి తీర్పు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా.. ఆ వరుడి కుటుంబంపై వధువు కుటుంబీకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
 

  • ఇటలీకి మోదీ వయా పాకిస్థాన్​..!

ఇటలీ పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Italy Tour) ప్రయాణించిన విమానం.. పాకిస్థాన్​ గగనతలం(Pakistan Airspace Open For India) పైనుంచి వెళ్లింది. గగనతలాన్ని ఉపయోగించుకునే విషయంపై భారత్ చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించింది పాకిస్థాన్​. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.

  • చంపేస్తారని తెలిసినా తగ్గలేదు..

మాజీ ప్రధాని, తన నానమ్మ ఇందిరా గాంధీని హత్య చేస్తారని ఆమెకు తెలుసని, అయినా ఏనాడూ వెనక్కి తగ్గలేదని అన్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. ఉత్తర్​ప్రదేశ్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు పోయినా భాజపాతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు.

  • మధ్యలోనే జీవితాలు ఆపేస్తున్నారు..

దేశంలో వివిధ కారణాలతో అభం శుభం తెలియని చిన్నారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 18 ఏళ్లు నిండకుండానే అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారనే లెక్కలు కలవరపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2020లో రోజుకు సగటున 31 మంది చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్​సీఆర్​బీ) తెలిపింది. వీరి బలవన్మరణాలకు కరోనా, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం కారణమని స్పష్టం చేసింది.


 


 


 

15:52 October 31

టాప్​న్యూస్ @ 4PM

  • వీవీప్యాట్​ల తరలింపుపై ఆర్వో క్లారిటీ..

వీవీ ప్యాట్‌లపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని హుజూరాబాద్‌ ఉపఎన్నిక రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి సూచించారు. పనిచేయని వీవీ ప్యాట్‌ను ఒక అధికారిక వాహనం నుంచి మరొక అధికారిక వాహనంలోకి తరలించిన సమయంలో ఎవరో వీడియో తీసి... దానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్వో అన్నారు (vvpads and evm moving issue).

  • విదేశాల నుంచి రాగానే మోదీ సమీక్ష..

జీ-20, కాప్​26 సదస్సులు ముగించుకొని భారత్​ వచ్చిన వెంటనే.. ప్రధాని నరేంద్ర మోదీ(Modi news today) వ్యాక్సినేషన్​పై సమీక్ష నిర్వహించనున్నారు. టీకా పంపిణీ(Vaccination in India) తక్కువగా జరిగిన జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నవంబర్​ 3న మోదీ మాట్లాడతారు.

  • పెళ్లికి ముందు కౌన్సిలింగ్​ తప్పనిసరి..

వివాహ బంధానికి అధికారికంగా గుర్తింపు కోసం వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రీ వెడ్డింగ్​ కౌన్సిలింగ్​కు(pre-wedding counselling) కావాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్​కు హాజరైనట్లు ధ్రువపత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్​ చేయాలని కేరళ మహిళ కమిషన్​ అక్కడి ప్రభుత్వానికి సూచించింది. వివాహితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్​ ఛైర్​పర్సన్​ పీ. సతీదేవి తెలిపారు.

  • లావా బీభత్సం.. 2100 ఇళ్లు ధ్వంసం..

స్పెయిన్​ లా పల్మాలోని కంబర్​ వీజా అగ్నిపర్వతం (Cumbre Vieja Volcano) విస్ఫోటం చెందిన దాదాపు ఆరు వారాల తర్వాత కూడా పెద్దఎత్తున లావా బయటకు వస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా దట్టమైన పొగలతో నిండింది. సుమారు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 2,100 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

  • కొత్త సినిమా సరకు వచ్చేసింది..

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. 'పలాస' ఫేం దర్శకుడు కరుణకుమార్​ కొత్త చిత్రం షూటింగ్​ ఫ్రారంభమైంది. ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, సంగీత్​ శోభన్​ ప్రధాన పాత్రలో నటించిన 'ఒక ఫ్యామిలీ స్టోరీ' ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇలాంటివి ఇంకా ఎన్నో..


 


 


 

14:39 October 31

టాప్​న్యూస్ @ 3 PM

  • వీవీప్యాట్ల తారుమారుపై వివరణ..

హుజూరాబాద్​ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్ల తారుమారుపై వివరణ ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్​ గోయల్​ ఆదేశించారు. ఈ మేరకు కరీంనగర్​ కలెక్టర్​, హుజూరాబాద్​ ఆర్వోకు ఆదేశాలు జారీ చేశారు.

  • 21 రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడు హత్య..

మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు ఊరి శివారులో శవమై కనిపించాడు. పనిమీద బయటకు వెళ్లిన కుమారుడు ఇంకెప్పుడు తిరిగిరాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాబోయేవాడు కానరాలకు వెళ్లాడని తెలిసి ఆ యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ యువకుడి మరణం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

  • పులి చంపి చర్మం తరలిస్తుండగా..

అటవీ జంతువులను కాపాడడానికి అధికారులు ఎంతో కృషి చేస్తున్నా... కొందరు వేటగాళ్లు మాత్రం యథేచ్ఛగా వాటిని చంపి విక్రయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ వద్ద వేటగాళ్లు పులిని వేటాడి(hunters killing tigers) చంపారు. హీరాపూర్ అటవీప్రాంతంలో పులిని వేటాడి.. చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పులి చర్మం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  

  • ఇలా చేస్తే ఇండియాదే గెలుపు​..

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) టీమ్​ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. పాకిస్థాన్​తో తొలి మ్యాచ్​లో ఓడి కాస్త వెనకడుగు వేసినట్టు కనిపిస్తున్నా.. కివీస్​పై (Ind Vs Nz) ఆదివారం జరిగే పోరులో గెలిచేందుకు అవకాశముందంటున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు బీ. మోహన్. ఇంకా ఆయన ఏమన్నారంటే?

  • పవన్​తో తీయాలనుకున్నా.. కానీ..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district) రాగోలు జెమ్స్‌ వైద్య కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(director SS Rajamouli) హాజరయ్యారు. జీవితంలో ముందడుగు వేస్తేనే విజయం సాధించగలమని రాజమౌళి స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో మమేకమై పలువురి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.




 

14:00 October 31

టాప్​న్యూస్ @ 2 PM

  • సద్దల చెరువులో రెండు మృతదేహాలు?

సూర్యాపేటలోని ఓ చెరువులో మృతదేహాలు తేలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. జిల్లాకేంద్రంలోని  సద్దుల చెరువులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు... చెరువులో వేర్వేరు ప్రదేశాల్లో మృతదేహాలను గుర్తించారు. 

  • 'ఈవీఎంలు మార్చారని అనుమానంగా ఉంది'

అధికార బలంతో తెరాస... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా నిన్న అర్ధరాత్రి జరిగిన వీవీ ప్యాట్​ విషయంతో ఇది బహిర్గతమైందని పేర్కొన్నారు (Bandi sanjay on huzurabad by pol).

  • ఇంటికి పిలిచి బావను కాల్చి చంపాడు

వేరే మతానికి చెందిన వ్యక్తిని తన సోదరి పెళ్లి చేసుకుందని ఓ వ్యక్తి కోపం పెంచుకున్నాడు. దీంతో సొంత బావను హత్య (Crime news Telugu) చేశాడు. ఇంటికి పిలిచి మరీ కాల్చి చంపాడు.

  • కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​మిశ్రాకు (Ajay Mishra News) భువనేశ్వర్​లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్​ పార్టీ విద్యార్థి విభాగం నేతలు కొందరు కోడి గుడ్లతో దాడి చేశారు. నల్ల బ్యాడ్జ్​లను ప్రదర్శిస్తూ మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

  • గోల్డ్ స్టార్ నీరజ్​కు మహీంద్ర 'స్పెషల్' కారు

స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్​ చోప్డాకు మహీంద్ర ఎక్స్​యూవీ కొత్త ఎడిషన్ కారు అందింది. చెప్పిన మాట ప్రకారం ఆనంద్ మహీంద్ర.. కారును నీరజ్​కు అందజేశారు. నీరజ్ జావెలిన్ విసిరిన దూరం 87.58 మీటర్లు. ఈ నంబర్​ను కారుపై ప్రత్యేకంగా అమర్చారు.

12:50 October 31

టాప్​న్యూస్ @ 1 PM

  • పోలింగ్ సిబ్బందికి డబ్బులు పంచారు

హుజూరాబాద్ ప్రజలెవరూ ఆందోళనకు(huzurabad byelection)గురికావద్దని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ (Etela Rajender)కోరారు. అంతిమంగా ధర్మం, న్యాయానిదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. బస్సుల్లో ఈవీఎం కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయన్న ఈటల.. అధికారుల తీరు పలు అనుమానాలకు తెరలేపిందన్నారు.  

  • ఖజానాకు తగ్గిన ఆదాయం

ఆదాయ అంచనాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఆర్నెళ్లలో 30శాతం మాత్రమే అందుకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.76 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా... సెప్టెంబర్ వరకు కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అమ్మకం పన్ను మినహా... ఏదీ కూడా 50 శాతాన్ని సమీపించలేదు. కరోనా ప్రభావంతో పడిపోయిన ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆర్నెళ్లలో రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకోగా... రూ.76 వేల కోట్ల ఖర్చు చేసింది.

  • ఒకే బైక్​పై 10మంది ప్రయాణం

పెట్రోల్​ ధరల వరుస పెరుగుదలతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. ఈ సమయంలో చాలా మంది బైక్​లపై (Bike viral video) వెళ్లడం తగ్గించడమో లేక ప్రయాణాలు మానుకోవడమో చేస్తున్నారు. కానీ.. ఓ వ్యక్తి(Desi jugaad video) చేసింది చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. తనతో కలిపి ఏకంగా 10 మంది ద్విచక్రవాహనంపై ప్రయాణించారు. అసలు ఇదెలా సాధ్యమైంది అనుకుంటున్నారా? ఇది చూసేయండి మరి..

  • పెట్రోల్​పై పన్నులతో ఖజానా ఫుల్

పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కేంద్రం భారీగా ఆదాయం (Excise duty collection) ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 33 శాతం, కొవిడ్​ పూర్వ స్థాయితో పోలిస్తే 79 శాతం 'ఎక్సైజ్' రాబడి (Petrol Excise Duty 2021) పెరిగింది. 2021 ఏప్రిల్-సెప్టెంబర్​ మధ్య ఏకంగా రూ.1.71 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

  • అదిరే ఫీచర్లతో స్మార్ట్​ఫోన్లు 

ఒకప్పుడు స్మార్ట్​ఫోన్ కొనాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి బడ్జెట్ ధరలో సరికొత్త ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత భారత మార్కెట్లో రూ.14 వేల లోపు(mobiles under 15000) ధర కలిగిన ఫోన్లకు ఎక్కువ డిమాండ్​ ఉంది. మరి అలాంటి కొన్ని మొబైల్‌ ఫోన్ల గురించి తెలుసుకుందాం..!

11:53 October 31

టాప్​న్యూస్ @ 12 PM

  • లోయలో పడ్డ వాహనం

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం సంభవించింది. చక్రతా నుంచి వికాస్​ నగర్​వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల వాహనం లోయలో పడగా.. 11 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది.  

  •  గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి!

మేడపై ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఇరుకైన సందులో పడిపోయింది. ఆరు అంగుళాల స్థలం ఉన్న రెండు గోడల మధ్య బాలిక ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బాలికను కాపాడారు.

  • నవంబరు 1 నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్

నవంబరు 1 నుంచి వివిధ రంగాల్లో కొన్ని మార్పులు రానున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు తన సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. అంతేకాక నవంబర్‌ 1 నుంచి మరోసారి గ్యాస్‌ ధరను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

  • అలా జరిగితేనే సెమీస్​కు టీమ్​ఇండియా!

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) ఇప్పటికే మూడు విజయాలు సాధించిన పాకిస్థాన్​.. సెమీస్​ చేరడం దాదాపు ఖాయమైంది. ఇక మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం ప్రధానంగా టీమ్​ఇండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. భారత్​ సెమీస్​ (T20 World Cup Semi Final) చేరాలంటే ఇంతకీ ఏం చేయాలంటే?

  • రానాకు అది వదులుకోలేని అలవాటు..!

దక్షిణాదితో పాటు హిందీలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా(rana daggubati movies).. తన జీవితం గురించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రామ్​చరణ్​తో(ram charan movies) స్నేహం, నాగచైతన్యపై ఉన్న ఈర్ష్య తదితర విషయాల్ని చెప్పారు.

11:04 October 31

టాప్​న్యూస్ @ 11 AM

  • నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్ విడుదల, 29న పోలింగ్, లెక్కింపు జరగనుంది.

  • పటేల్ స్ఫూర్తితోనే  

దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్​ ఎల్లప్పుడూ సమ్మిళితంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని సర్దార్ పటేల్ కోరుకున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే దేశం ఇప్పుడు అన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.

  • జపాన్​ పార్లమెంట్​కు ఎన్నికలు

జపాన్ పార్లమెంట్ దిగువ సభకు ఎన్నికలు జరగుతున్నాయి. పార్లమెంట్​ను రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా తీసుకున్న నిర్ణయంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అధికార పార్టీ.. ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించే అవకాశం కనిపిస్తోంది.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

బంగారం, వెండి (Gold Rate Today) ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. ఆయన్ని శనివారం రాత్రి కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. 

09:55 October 31

టాప్​న్యూస్ @ 10 AM

 

  • దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్​లో 12 వేల 830 కరోనా కేసులు (Corona cases in India) నమోదయ్యాయి. 446 మంది ప్రాణాలు కోల్పోగా.. 14,667 మంది వైరస్​ను(Coronavirus update) జయించారు. క్రియాశీల కేసులు 247 రోజుల కనిష్ఠానికి చేరాయి.

  • ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు అమిత్​ షా నివాళి

సర్దార్​ వల్లభ్​భాయ్​ ​ పటేల్​ జయంతి సందర్భంగా.. గుజరాత్​ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు.

  • తల్లిదండ్రుల సమాధుల వద్దే పునీత్ అంత్యక్రియలు

గుండెపోటుతో మరణించిన ప్రముఖ కథానాయకుడు పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్దే పునీత్​ను ఖననం చేశారు.

  • ఓటు వేసే అవకాశం దక్కని 20 మంది అభ్యర్థులు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు ఇక్కడ ఓటు వేయలేని విచిత్రమైన పరిస్థితి నెలకొంది (20 candidates who failed to vote). మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 10 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • రూ.100 కోసం వార్డుబాయ్ కక్కుర్తి

ప్రాణాలు పోసే ఆస్పత్రుల్లో కొందరి కాసుల కక్కుర్తి అభంశుభం తెలియని వారిని పొట్టన బెట్టుకుంటోంది(Ward Boy removed Oxygen pipe for money). వార్డుబాయ్ వంద రూపాయల కక్కుర్తి.. ఓ చిన్నారిని బలి తీసుకుంది. కేవలం రూ.100కు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారి ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు ఓ వార్డుబాయ్. ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరి అయి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల్లోనే కన్నుమూశాడు.

08:47 October 31

టాప్​న్యూస్ @ 9 AM

  • అయ్యో బిడ్డలారా.. ఎంత కష్టం! 

కాయకష్టం చేసుకునే ఆ దంపతులకు పుట్టిన ఇద్దరు మగపిల్లలు వారు. బాగా చదివించి ప్రయోజకులను చేస్తే తమ ఇబ్బందులు తీరుస్తారనే ఆశతో పోషించుకుంటున్నారు. బిడ్డలు ఎదుగుతున్న దశలో అరుదైన వ్యాధి ఒకరి తరువాత ఒకరిని కోలుకోలేకుండా దెబ్బతీసింది. ఫలితంగా ఇప్పుడు వారిద్దరూ చూడలేరు.. మాట్లాడలేరు.. నడవలేరు.. కూర్చోలేరు.. అన్నం పెట్టమని అడగలేరు. పేద కుటుంబంపై రాకాసిలా విరుచుకుపడిన మహమ్మారితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది (Parents seeking donor for the treatment of children).

  • మేనన్‌ తలకు పెన్‌-గన్‌!

స్వాతంత్య్రానంతరం 500కుపైగా సంస్థానాలను వివిధ రకాలుగా ఒప్పించి భారతావనిని ఏకం చేసిన ధీరుడు సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌! ఆ క్రమంలో పటేల్‌, ఆయన బృందం ఎదుర్కొన్న సవాళ్లు బోలెడు. హైదరాబాద్‌పై పోలీస్‌చర్య, కశ్మీర్‌ విలీనం చాలా మందికి తెలిసిన కథలు! కానీ తెలియనివి చాలానే ఉన్నాయ్‌. నేడు పటేల్‌ జయంతి సందర్భంగా వాటిలో కొన్ని...

  • సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత

ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అసోం-మిజోరం సరిహద్దులో (Assam Mizoram border dispute) రెండు పేలుళ్లు జరిగాయి. ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఓ మిజోరం పోలీసును అదుపులోకి తీసుకున్నట్లు అసోం అధికారులు వెల్లడించారు.

  • వాతావరణ మార్పులపై 'కాప్'​ అస్త్రం ఫలిస్తుందా?

అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకూ 'కాప్‌26' (Cop26 Glasgow) పేరుతో గ్లాస్గోలో సదస్సు నిర్వహిస్తున్నాయి ప్రపంచదేశాలు. గ్లోబల్​ వార్మింగ్​పై చర్చించేందుకు వివిధ దేశాల నేతలు సిద్ధమయ్యారు. ఈ చర్చలు సఫలం అయితే భూతాపాన్ని అదుపులోకి తెచ్చే కార్యాచరణకు ప్రపంచ నేతలు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.

  • ద్రవిడ్‌ పక్కా బ్లూప్రింట్‌తో వచ్చేస్తాడు

టీమ్‌ఇండియాకు (Team India Coach) కొత్త కోచ్​గా రాహుల్​ ద్రవిడ్ (Rahul Dravid News) నియామకం దాదాపుగా ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో జట్టును విజయ పథంలో నడిపేందుకు ద్రవిడ్‌ బ్లూప్రింట్‌తో వస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా.

07:53 October 31

టాప్​న్యూస్ @ 8AM

  • ప్రైవేటు వాహనంలో ఈవీఎం తరలింపు

హుజూరాబాద్​లో ప్రైవేటు వాహనంలో ఈవీఎం తరలింపు ఆందోళనకు దారితీసింది. భారీభద్రత నడుమ తరలించాల్సిన ఈ యంత్రాన్ని ఓ వ్యక్తి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీల శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

  • పెరుగుతున్న గుండెకోత

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు(Heart Surgery Types) వస్తున్నాయి. కేవలం 30-40 ఏళ్లకే హృదోగ ముప్పు పెరగడం ఆందోళన కలిగించే అంశమే. అయితే ఏటా ఒక్క హైదరాబాద్​లో 15వేల గుండె శస్త్ర చికిత్సలు జరుగుతుండడం గమనార్హం. ఇందులో 8-10 వేల వరకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలేనని(Heart Surgery Types) వైద్యులు చెబుతున్నారు.

  • నాలుగు సెకన్లలో కరోనా అంతం

శరీరంపై కరోనాను అంతం చేసే డిసిన్ఫెక్ట్ యంత్రాన్ని (Covid Disinfection Machine) ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. దీన్ని ప్రయోగాత్మకంగా పట్నాలోని ఎయిమ్స్‌ వద్ద ఏర్పాటు చేశారు.

  • నవంబర్​లో 17 రోజులు బ్యాంకు సెలవులు!

వివిధ పండగలు, సాధారణ సెలవులు కలుపుకొని నవంబరులో (Bank Holidays in November 2021) మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవని ఆర్​బీఐ వెల్లడించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది.

  • టాస్​ గెలిస్తే మ్యాచ్​ నెగ్గినట్లే

తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో ఆదివారం న్యూజిలాండ్​తో (Ind Vs Nz) తలపడనుంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ గెలిస్తేనే సెమీస్​ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే టాస్ గెలవడం కూడా జట్టు విజయంలో కీలకంగా మారింది.
 

06:44 October 31

టాప్​న్యూస్ @ 7AM

  • హు‘జోరు’ పోలింగ్‌

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో భారీస్థాయిలో పోలింగ్ నమోదైంది. ఉపఎన్నికలో 86.57 శాతం నమోదు కాగా.. 2018 కంటే 2.5 శాతం పెరిగింది. అక్కడక్కడా దాడులు, వాగ్వాదాలతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ ఉదయం మందకొడిగా సాగగా.. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ఎక్కువగా కదలివచ్చారు. కమలాపూర్‌ మండలం బీంపల్లిలో కొవిడ్‌ సోకిన ఒక మహిళ పీపీఈ కిట్‌ ధరించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • ఆ రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు

బంగాల్​, అసోంలో మళ్లీ కరోనా (corona cases updates) విజృంభిస్తోంది. కొవిడ్‌ కేసుల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. కట్టుదిట్టంగా కొవిడ్‌ నిబంధనలను అమలు చేయాలని, కరోనా పరీక్షలు పెంచాలని సూచించింది.

  • ఫుట్​బాల్​తో రాహుల్​గాంధీ సిక్సర్​..

గోవా, తలేగావ్​లోని ఎస్​పీఎం స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ యూత్ కాంగ్రెస్​ ఫుట్​బాల్ టోర్నమెంట్​ను ప్రారంభించారు. ​ఫుట్​బాల్​ కిక్​ ఇచ్చి.. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభకు కాంగ్రెస్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

  • భారత్​-న్యూజిలాండ్​ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం(అక్టోబర్​ 31) భారత్‌, న్యూజిలాండ్‌(IND vs NZ T20 Match) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిస్తేనే సెమీస్​కు చేరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు.. టాప్​ ఆటగాళ్లెవరు.. ఓ లుక్కేద్దాం...

  • ఎస్పీ బాలుకి 100 పాటలతో స్వరార్చన

నవంబరు 14న సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలుకు స్వరార్చన జరగనుంది. 100 మంది గాయకులు 100 అద్భుతమైన పాటల్ని ఆలపించనున్నారు.
 

04:20 October 31

టాప్​న్యూస్ టుడే

  •  ఉపఎన్నికలో 86.57 శాతం నమోదు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో భారీస్థాయిలో పోలింగ్ నమోదైంది. ఉపఎన్నికలో 86.57 శాతం నమోదు కాగా.. 2018 కంటే 2.5 శాతం పెరిగింది. అక్కడక్కడా దాడులు, వాగ్వాదాలతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

  • టీఎస్​ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులు..

ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా నగదు రహిత చెల్లింపులే జరుగుతున్నాయి. జేబులో డబ్బులు లేకపోయినా ఫోన్‌తో క్యూఆర్​ కోడ్‌స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈమధ్యనే టీఎస్​ఆర్టీసీ ఆ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రయాణికులకు, సిబ్బందికి ఉపయోగకరంగా మారింది.

 

  • కొన్ని ఫిర్యాదులపై కేసులు 

హుజూరాబాద్​లో రాత్రి 7 గంటల వరకు 86.57 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. పోలింగ్​ మొత్తం ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్​ గోయల్​ వెల్లడించారు.

  • ​ విజయంపై ధీమాగా భాజపా, తెరాస

హుజూరాబాద్‌ ఉపఎన్నిక విజయంపై భాజపా, తెరాస ధీమా వ్యక్తం చేశాయి. 86 శాతం పైగా పోలింగ్‌ నమోదవటం తమకు తెరాసకు అనుకూలిస్తుందని. తెరాస భావిస్తుంది. కేసీఆర్‌ మార్గదర్శకంతో హుజూరాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో గొప్పవిజయం సాధించబోతున్నామని హరీశ్‌రావు తెలిపారు.గతంతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరగటం సహా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసి వస్తుందని భాజపా చెబుతోంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లు చైతన్యవంతంగా ఆలోచించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.

  • నవంబరు ఒకటో తేదీ నుంచి  నమోదు 

రాష్ట్రంలో 30 లక్షలకుపైగా పార్టీ సభ్యత్వం నమోదు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నవంబర్ ఒకటో తేదీన మొదలు కానున్న ఈ ప్రక్రియ రాబోవు మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని పీసీసీ తీర్మానించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల అధ్యక్షతన శనివారం గాంధీభవన్​లో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

  • ఉగ్రమూకలే లక్ష్యం

కశ్మీర్​ లోయలో భీకర ఎన్​కౌంటర్ (terrorist attack) జరుగుతోంది. ఉగ్రమూకల (terrorist groups in india) కోసం భద్రతా సిబ్బంది చేపడుతున్న గాలింపు చర్యలు శనివారంతో 20 రోజులకు చేరుకున్నాయి.

  • '2022 చివరి నాటికి 500 కోట్ల టీకాలు'

వచ్చే ఏడాది చివరి నాటికి 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్​ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. తద్వారా కరోనాపై పోరులో ప్రపంచానికి మరింత బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన జీ-20 సదస్సులో(G20 Summit 2021) మాట్లాడారు. అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాల పరస్పర గుర్తింపు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

  • నేడే పునీత్​ రాజ్​కుమార్​ అంత్యక్రియలు

కన్నడ స్టార్ హీరో పునీత్​ రాజ్​కుమార్ అంత్యక్రియలు.. ఆదివారం(అక్టోబర్​ 31) జరగనున్నాయని తెలిపారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. పునీత్​ కూతురు అమెరికా నుంచి దిల్లీకి చేరుకుందని, సాయంత్రానికి బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు.

  •  మెగా వేలం నిబంధనలివే..

వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్(IPL 2022 Auction)​ కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆటగాళ్ల రిటెన్షన్(ipl retention 2022), వేలానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ ఫ్రాంఛైజీలకు లేఖ రాసింది బీసీసీఐ. ఈ నిబంధనలపై స్పష్టత ఇచ్చారు ఓ ఫ్రాంఛైజీకి చెందిన సీనియర్ అధికారి.

Last Updated :Oct 31, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.